తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆస్తుల లెక్కలపై సాక్షి తనదైన శైలిలో విశ్లేషణ చేసింది. చంద్రబాబు ఆయా సంవత్సరాలలో ఇచ్చిన లెక్కలలోని తేడాలను వివరించడానికి, అలాగే కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఆస్తుల వివరాలకు మార్కెట్ విలువ కట్టి కదనాన్ని ఇచ్చింది.చంద్రబాబు తన కుటుంబ ఆస్తి 41 కోట్లు అని , అందులో తనవ్యక్తిగత ఆస్తి విలువ నలభై రెండు లక్షలని తెలిపిన నేపధ్యంలో ఈ విశ్లేషణ చేసింది.1988లో చంద్రబాబు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం కుటుంబ ఆస్తి 77 ఎకరాలని తెలిపారని, అందులో తన ఆదాయం వాటా ఏడాదికి ముప్పై ఆరు వేలు అని పేర్కొన్నారని సాక్షి తెలిపింది.1999లో స్పీకర్ ఇచ్చిన ప్రకటనలో 7.7 కోట్లుగా చెప్పారని పేర్కొన్నారు.2004 నాలుగులో ఇరవై కోట్లు, 2009లో అరవై కో్ట్లుగా అదికారికంగానే తెలిపారని వెల్లడించింది.ఇక ఇప్పుడు చంద్రబాబు ప్రకటించిన ఆస్తి మార్కెట్ విలువ 680కోట్లుగా సాక్షి లెక్కగట్టింది.
Chandrababu 100% fake assets
Related posts:
If you enjoyed this article just click here, or subscribe to receive more great content just like it.
Subscribe to:
Post Comments (Atom)
Post a Comment