Home » , , , , , » ఎర్రబెల్లి చదువులేని వ్యక్తి..సి.ఎమ్. రమేష్ చీడపురుగు..

ఎర్రబెల్లి చదువులేని వ్యక్తి..సి.ఎమ్. రమేష్ చీడపురుగు..

తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు తనను చీడపురుగు అనడం,పార్టీలో ఎవరు ఉండాలో తేల్చుకోవాలని అనడంపై టిడిపి ఎమ్.పి రాజ్యసభ సభ్యుడు సి.ఎమ్.రమేష్ మండిపడ్డారు.చదువు లేని వ్యక్తి దయాకరరావు అని,తాను ఆర్టికిల్ 371పై సుప్రింకోర్టుకు వెళితే ఆయనకు నష్టం ఏమిటని అన్నారు. చట్టపరమైన అంశాలు దయాకరరావుకు తెలియవని, కెసిఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించాల్సింది పోయి తమపై విమర్శలు చేయడం ఏమిటని ఆయన అన్నారు.వంద మంది దయాకరరావులు అడ్డుపడినా తమ ప్రయత్నాలు చేస్తామని,సమన్యాయం జరిగేవరకు రాష్ట్ర సమైక్యత కోసం పోరాడాతమని రమేష్ స్పష్టం చేశారు.దయాకరరావు, రమేష్ ల మధ్య మాటల యుద్దం ముదరడంతో పార్టీలో చిచ్చు తీవ్రం అయినట్లు కనిపిస్తుంది.

.తెలుగుదేశం పార్టీలో తాము ఉండాలో, రాజ్యసభ సబ్యుడు సి.ఎమ్. రమేష్ ఉండాలో తేల్చుకుంటామని తెలంగాణ టిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు స్పష్టం చేశారు. ఇలాంటి చీడపురుగులను పార్టీలో చేర్చుకోవడమే పెద్ద తప్పు అని ఆయన అన్నారు.ఇలాంటి డబ్బు ఉన్న వారిని పార్టీలో తీసుకుని, వారికి ఎమ్.పి పదవులు ఇవ్వడం వల్లనే పార్టీ నష్టపోయిందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు విభజన లేఖకు కట్టుబడి ఉన్నారని అంటూనే దయాకరరావు ఈ డిమాండ్ చేయడం విశేషం.

http://kommineni.info/articles/dailyarticles/content_20131115_15.php

http://kommineni.info/articles/dailyarticles/content_20131115_16.php
Share this article :

Post a Comment