Home » , , , » నేను మారాను. నన్ను నమ్మండి

నేను మారాను. నన్ను నమ్మండి

బాబు రాయ‘బేరం’
సాక్షి ప్రతినిధి, గుంటూరు :‘నేను మారాను. నన్ను నమ్మండి, పనిచేసే వారికి ప్రాధాన్యం’’ ఇస్తాను అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తరచూ వల్లించే పలుకులివి. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా పార్టీని బతికించిన వారికి రానున్న ఎన్నికల్లో సీట్లు ఇస్తానని అనేక పర్యాయాలు హామీలు గుప్పించారు. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పార్టీని బతికిస్తున్న సీనియర్లను, నియోజకవర్గ ఇన్‌చార్జులను విస్మరించి తటస్థులకు సీట్లు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలకు అవసరమైన నగదును సమకూర్చుకోగల వారిని అన్వేషిస్తున్నారు. తనకు అనుకూలమైన నేతలను వారి వద్దకు రాయభారం పంపుతున్నారు. వారితో చర్చలు జరుపుతున్నారు. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి అధినేత చేసిన ప్రయత్నాలు బహిర్గతం కావడంతో స్థానిక నేతలు గుర్రుగా ఉన్నారు. 
 
 2009 ఎన్నికల్లో పీఆర్పీ నుంచి పోటీచేసి ఓడిపోయిన కొందరు నేతల్ని తన పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేశారు. అప్పటి నుంచి నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో లేకపోయినా, ఎన్నికలకు నిధులు సమకూర్చుకోగల స్థోమత ఉండటాన్ని ఆర్హతగా ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పీఆర్పీ తరఫున పోటీచేసి ఓటమి పాలైన బైరా దిలీప్‌ను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు అధినేత ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి యర్రం వెంకటేశ్వరరెడ్డి, టీడీపీ నుంచి నిమ్మకాయల రాజనారాయణ, పీఆర్పీ నుంచి దిలీప్ పోటీచేశారు. వీరిలో దిలీప్‌కు తక్కువ ఓట్లు వచ్చాయి. అప్పటి నుంచి పార్టీని నియోజకవర్గంలో బతికిస్తున్న నిమ్మకాయల రాజనారాయణను పక్కన పెట్టి బైరా దిలీప్‌కు సీటు ఇచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు పార్టీలో వినపడుతోంది. 
 
 బాపట్ల నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి
 నియోజకవర్గ ఇన్‌చార్జి చీరాల గోవర్ధన రెడ్డి కంటే ఫిబ్రవరిలో తిరిగి పార్టీలో చేరిన అన్నం సతీష్ ప్రభాకర్‌కు చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నట్టు సమాచారం. 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి గాదె వెంకటరెడ్డిపై 1300 ఓట్ల తేడాతో గోవర్ధనరెడ్డి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో పార్టీని బతికిస్తున్నారు. ఇతన్ని కాదని 2009లో కొంతకాలం పీఆర్పీలో కొనసాగి, అక్కడా ఇమడలేక రాజకీయాలకు దూరంగా ఉంటూ ఇటీవల టీడీపీలో మళ్లీ చేరిన సతీష్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది.
  గత ఎన్నికల్లో జిల్లాలో ఒక్క సీటు కూడా కాపు సామాజిక వర్గానికి కేటాయించని బాబు ఈసారి ఆ వర్గానికి చెందిన సతీష్‌కు సీటు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అనంతవర్మ, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి తాతా జయ ప్రకాష్, బీసీ నాయకుడు పమిడి భాస్కరరావులు కూడా సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
 
 వీరంతా పార్టీలో సీనియర్లు. పార్టీ కోసం పనిచేస్తున్నవారే. కాపు సామాజిక వర్గానికి ఈసారి ప్రాధాన్యం ఇవ్వాలనే సాకుతో సతీష్‌కు సీటు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పీఆర్పీ నుంచి పోటీచేసి ఓటమి పాలైన ప్రముఖ పారిశ్రామికవేత్త తులసీ రామచంద్ర ప్రభును అక్కడి నుంచి పోటీ చేయాలని టీడీపీ నేతలతో బాబు రాయభారం పంపినట్టు తెలుస్తోంది. పనిచేసే వారికి కాకుండా తటస్థులకు, నిధులు సమకూర్చుకునే వారికి బాబు ఇస్తున్న ప్రాధాన్యం పార్టీలో చర్చనీయాంశమైంది.
http://www.sakshi.com/news/andhra-pradesh/chandrababu-naidu-call-for-prp-leaderst-to-join-in-tdp-84349?pfrom=home-top-story

Share this article :

+ comments + 1 comments

Anonymous
13 April 2014 at 15:01

రూపాయలో తొంబై తొమ్మది పైసలు అక్రమంగా సొంతానికి ఆస్తులు కొనుకొంటు తినేసి ,సమాజ అబివృద్ది కి వక పైసా కర్చు పెట్టే జగన్ మోహన్ రెడ్డి గారి వై .ఎస్ .అర్ పార్టీ మరియు బాగా డబ్బులు సంపాయించాలి అని ఆకలి తో వున్నా కెసిఆర్ తెలంగాణా పార్టీ తో జాగ్రత్త గా వుండండి .

మార్పు జనం తోటే సాద్యం(powrudu.blogspot.com)


ఎంచే లంచేలుగా సమాజం లో మార్పు జనం మంచి ఆలోచన ,నడవడిక మూలం గానే వస్తుంది .
బయం వద్దు , అందరు కలసి కట్టుగా చెడును విబేదించండి.ఎంతె మందిని బెదిరిస్తారు, వక్కడిని బేదిరించగలరు ,వంద మందిని బెదిరించాగలరా .
పౌరిడిగా వక చిన్న ప్రయత్నం

ఈ బ్లాగ్ ని చదవండి .మీ రచనలు ఈ ఫోరం లో ముద్రించండి .

దయచేసి ఈ బ్లాగు ని మీ సైట్ కి జతచేయండి

Post a Comment