- ఆనాడే ప్రాజెక్టులు నిర్మించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు
- ఆ ప్రాజెక్టులన్నింటికీ నేడు ట్రిబ్యునల్ నీటిని కేటాయించేది
- కానీ బాబు తొమ్మిదేళ్ల పాలనలో ప్రాజెక్టులను పట్టించుకోలేదు
- పైగా ఆయన హయాంలోనే ఎగువ రాష్ట్రాల్లో ఆలవుట్టి వంటి మెగా ప్రాజెక్టుల నిర్మాణం
- ఇవన్నీ విస్మరించి వైఎస్‌పై దుష్ర్పచారం
సాక్షి, హైదరాబాద్: గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రాజెక్టుల నిర్మాణంపై అనుసరించిన వైఖరే ఇప్పుడు రాష్ట్రానికి పెనుశాపంగా మారింది! ఒకవైపు బచావత్ ట్రిబ్యునల్ తీర్పు గడువు సమీపిస్తున్నా అప్పటి సీఎం చంద్రబాబు మిన్నకుండిపోయారు. ప్రాజెక్టులకు డబ్బుల్లేవంటూ చేతులు ముడుచుకొని కూర్చోవద్దని, వాటిని పూర్తిచేయుకపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వైఎస్ అనేకమార్లు చెప్పారు. చరిత్రహీనుడిగా మిగిలిపోవద్దని హెచ్చరించారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం ఖాతరు చేయులేదు. తీరా వైఎస్ వుుఖ్యవుంత్రి అయ్యాక పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయుటానికి నడుంబిగించారు. వుహారాష్ట్ర, కర్ణాటక ఇందుకు అభ్యంతరం తెలిపాయి. కొత్త ట్రిబ్యునల్ ఎదుట ఆ ప్రాజెక్టుల నిర్మాణాలు ఆపేరుుంచాలని పట్టుబట్టారుు.
అప్పుడు మిగులు జలాలపై ఆధారపడిన ప్రాజెక్టులకు మేం ఎలాంటి హక్కులు కోరబోవునీ, ఎలాగూ మిగులు జలాలపై వూకు స్వేచ్ఛ ఉంది కాబట్టి వాటిపై ఆధారపడే నిర్మించుకుంటావునీ వైఎస్ ప్రభుత్వం ఒక లేఖ ఇచ్చింది. ఆ తర్వాతే ఆ ప్రాజెక్టుల ప్రగతి సాధ్యమైంది. లేకపోతే వాటిని ఆరంభించడమే సాధ్యం కాకపోయేది. నాడు బాబు ప్రభుత్వం ప్రదర్శించిన అలసత్వం కారణంగా నేడు ఈ పరిస్థితి నెలకొంది. ట్రిబ్యునల్ ఏర్పడే నాటికే ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తి కావడమో లేక.. నిర్మాణాలు చివరి దశలో ఉండి ఉంటే.. ఇప్పుడు ఈ నష్టం జరిగేది కాదు. ప్రాజెక్టులు ఉన్నందున నీటి కేటాయింపులు వచ్చేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర ఇలాగే ప్రయోజనం పొందాయి. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో తప్పిదాలు ఇంకా రాష్ట్రాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ట్రిబ్యునల్ తీర్పు కూడా అందులో ఒక భాగం!
బాబు హయాంలోనే బాబ్లీ..
రాష్ట్రంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు చంద్రబాబు హయాంలోనే రూపు దిద్దుకుంది. పైగా టీడీపీ ముఖ్యనేతకు చెందిన సంస్థే దాన్ని నిర్మించింది. నిర్మాణం పూర్తయ్యాక ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఈ ప్రాజెక్టును అనుమతిస్తూ తీర్పు వెల్లడించింది. అలాగే ఎగువ కృష్ణాలో కర్ణాటక నిర్మించిన ఆలమట్టిని కూడా బాబు హయాంలోనే పూర్తయింది. దాంతో ఈ ప్రాజెక్టుకు నీటి కోటాను పెంచుతూ ప్రస్తుత ట్రిబ్యునల్ తీర్పును వెల్లడించింది.
ఆనాడే నిర్మించి ఉంటే...
ప్రస్తుత బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ 2004 ఏప్రిల్ 2న ఏర్పాటైంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ వైఎస్ సీఎం అయిన తర్వాత చేపట్టినవే. జలయజ్ఞం కింద మొత్తం 86 ప్రాజెక్టులను చేపట్టారు. ఇందులో ఆయన హయాంలోనే 12 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మరో 21 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీరందించారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగానే కల్వకుర్తి, నెట్టెంపాడు, గాలేరు-నగరి, హంద్రీనీవా, వెలిగొండ, ఏఎమ్మార్పీ వంటి ప్రాజెక్టులను చేపట్టారు.
ఇవి ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ప్రజల నుంచి డిమాండ్ ఉంది. వీటిలో కొన్ని ఎన్టీఆర్, చంద్రబాబు కూడా శంకుస్థాపన చేసినవి ఉన్నాయి. అయితే వాటిని నిర్మించడంలో విఫలమయ్యారు. వైఎస్ వచ్చిన తర్వాత వాటికి మోక్షం కలిగింది. గతంలోనే ఈ ప్రాజెక్టులను నిర్మించి ఉంటే.. నేడు ట్రిబ్యునల్ వీటికి నీటి కేటాయింపులను చేసేది. సాధారణంగా ట్రిబ్యున ల్ ఏర్పాటు కంటే ముందే పూర్తయిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను చేయడం ఆనవాయితీ. దాంతో రాష్ట్రానికి ఎంతో మేలు జరిగేది.
అయితే ట్రిబ్యునల్ మొదలైన తర్వాత వీటిని చేపట్టినందున ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర అభ్యంతరం చెప్పాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణాలను నిలుపుదల చేయించాల్సిందిగా ట్రిబ్యునల్‌పై ఒత్తిడి తీసుకువచ్చాయి. దాంతో ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయడానికి వీలుగా ప్రభుత్వం వీటికి నికర జలాలను కోరబోమనే అఫిడవిట్‌ను దాఖలు చేసింది. వీటిని మిగులు జలాల ఆధారంగానే చేపట్టినందున, వరద నీటిని ఉపయోగించుకుంటామని చెప్పింది. ఇలా కాకుండా గతంలోనే ఈ ప్రాజెక్టులు పూర్తయినట్టయితే.. నేడు ట్రిబ్యునల్ వాటికీ నీటికి కేటాయించడానికి అవకాశం ఉండేది.
నికర జలాలంటే...
- కృష్ణా బేసిన్‌లో 47 సంవత్సరాల ప్రవాహాల్లో 65 శాతం నీటి లభ్యతను ఆధారంగా చేసుకొని.. బేసిన్‌లో ఏటా అందులోబాటులోకి వచ్చే జలాల పరిమాణాన్ని లెక్కిస్తారు. అవే నికర జలాలు.
- మిగులు జలాలు: నదీ పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురిసినప్పుడు.. సాధారణం కంటే అధిక పరిమాణంలో లభ్యమయ్యే నీటినే మిగులు జలాలు అంటారు.
- వరద జలాలు: వరదల సమయంలో నదిలో అధికంగా (నికర, మిగులు జలాలకు మించి) ప్రవహించే నీరు.
- డిపెండబిలిటీ అంటే..?: 75 శాతం డిపెండబిలిటీ అంటే.. వందేళ్లలో 75 సంవత్సరాల్లో వచ్చిన నీటి ప్రవాహం సరాసరి.
http://www.sakshi.com/news/andhra-pradesh/chandrababu-naidu-is-the-reason-for-the-krishna-water-tribunal-verdict-84540?pfrom=home-latest-story
+ comments + 1 comments
రూపాయలో తొంబై తొమ్మది పైసలు అక్రమంగా సొంతానికి ఆస్తులు కొనుకొంటు తినేసి ,సమాజ అబివృద్ది కి వక పైసా కర్చు పెట్టే జగన్ మోహన్ రెడ్డి గారి వై .ఎస్ .అర్ పార్టీ మరియు బాగా డబ్బులు సంపాయించాలి అని ఆకలి తో వున్నా కెసిఆర్ తెలంగాణా పార్టీ తో జాగ్రత్త గా వుండండి .
మార్పు జనం తోటే సాద్యం(powrudu.blogspot.com)
ఎంచే లంచేలుగా సమాజం లో మార్పు జనం మంచి ఆలోచన ,నడవడిక మూలం గానే వస్తుంది .
బయం వద్దు , అందరు కలసి కట్టుగా చెడును విబేదించండి.ఎంతె మందిని బెదిరిస్తారు, వక్కడిని బేదిరించగలరు ,వంద మందిని బెదిరించాగలరా .
పౌరిడిగా వక చిన్న ప్రయత్నం
ఈ బ్లాగ్ ని చదవండి .మీ రచనలు ఈ ఫోరం లో ముద్రించండి .
దయచేసి ఈ బ్లాగు ని మీ సైట్ కి జతచేయండి
Post a Comment