Home » , , , , , , » హైదరాబాద్ ఫేస్‌వాల్యూ పెంచి, ఫేస్‌బుక్‌లో ఎక్కించాను

హైదరాబాద్ ఫేస్‌వాల్యూ పెంచి, ఫేస్‌బుక్‌లో ఎక్కించాను

హ్యూమరం: కోతల రాయుడు
 ‘రింజిం రింజిం హైదరాబాద్’ అని పాడుకుంటూ సైకిలెక్కి బయలుదేరాడు చంద్రబాబు. ఆయన వెంట టీవీలవాళ్లు పరిగెత్తారు.
 ‘‘డెవలప్‌మెంట్, అసైన్‌మెంట్, అగ్రిమెంట్, కంటోన్మెంట్, గవర్నమెంట్’’ అన్నాడు బాబు.
 ‘‘వామ్మో, ఇంత ఇంగ్లీషా?’’ అని ఆశ్చర్యపోయారు విలేకరులు.
 ‘‘ట్రీట్‌మెంట్, టెంపర్‌మెంట్, పిప్పర్‌మెంట్, కామెంట్’’ అన్నాడు బాబు.
 ‘‘నో కామెంట్ సార్, ఇంతకూ మీరేం మాట్లాడుతున్నారు’’ అడిగారు విలేకరులు.
 ‘‘మాట్లాడ్డానికి విషయం లేనప్పుడు ఇలా ప్రాసతో మాట్లాడాలని మా గురువు చెప్పాడు.’’
 ‘‘ఎవరు సార్, ఆయన?’’
 ‘‘గురువులను నేను గుర్తుంచుకోను’’ అంటూ చార్మినార్ వద్ద సైకిల్ ఆపాడు.
 ‘‘దీన్ని చార్మినార్ అంటారు. దీన్ని దొంగలెత్తుకుపోకుండా తొమ్మిదేళ్లు నేను కాపాడాను. చార్మినార్ అంటే నాకెందుకిష్టమంటే, అందులో నార్ ఉంది. నాలో నారా ఉన్నాడు. అందుకే మేమిద్దరం నాలుగు కాలాలు నిలబడి ఉన్నాం.’’
 ‘‘వాట్ ఏ కంపారిజన్’’ అని ఆశ్చర్యపోయారు విలేకరులు.
 ‘‘రాజకీయాలకు రీజన్, సీజన్ ఉండవు. ఇటు చూడండి, సాలార్‌జంగ్ మ్యూజియమ్. ఇందులోని వస్తువులన్నీ నాయకుల ఇళ్లకు వెళ్లకుండా కాపలా ఉన్నాను’’ అంటూ అసెంబ్లీకి తీసుకెళ్లాడు.
 ‘‘ఈ గాంధీ విగ్రహాన్ని నాయకులు ఎత్తుకెళ్లి చైనావాళ్లకు అమ్మకుండా నేనే కాపాడి అసెంబ్లీ పరువును రక్షించాను. రక్షణ, భక్షణ, శిక్షణ... అన్నీ ఒక్కలాగే కనిపించినా అర్థాలు వేరు.’’
 హైటెక్ సిటీకి తీసుకెళ్లి, ‘‘బిల్డింగ్‌లు కట్టించాను, బిల్ క్లింటన్‌ను రప్పించాను, రోడ్లు వేయించాను, చెట్లు నాటించాను, కాలువలు తవ్వించాను, హైదరాబాద్ ఫేస్‌వాల్యూ పెంచి, ఫేస్‌బుక్‌లో ఎక్కించాను. టెక్నాలజీ, ఐడియాలజీ ప్రజలకు అర్థం కావు’’ అన్నాడు.
 ‘‘ఆహో ఆంధ్రభోజా! ఇన్ని పనులు మీరు చేస్తే, మరి మిమ్మల్ని ఓడించే పనిలో ప్రజలెందుకున్నారు?’’ అడిగారు విలేకరులు.
 ‘‘డిఫీట్, రిపీట్, సర్కస్ ఫీట్, ప్రాఫిట్. జనం నాడి అర్థంకాక, ఆస్ట్రాలజీని నమ్ముకుంటున్నాను’’ అని చిలక జ్యోతిష్కుని పిలిచాడు.
 చంద్రబాబుని చూసి చిలక పారిపోవడానికి ప్రయత్నించింది. అతికష్టం మీద జ్యోతిష్కుడు దాన్ని పట్టుకుని ఒక కార్డు తీయించాడు. అందులో ఇలా ఉంది.
 ‘‘మీకు వర్తమానమూ లేదు, భవిష్యత్తూ లేదు. మిగిలింది గతమే. దాని గురించే మాట్లాడుతూ ఉండండి.’’
 -   జి.ఆర్.మహర్షి

http://www.sakshi.com/news/funday/comedy-satire-on-chandra-babu-naidu-84725?pfrom=home-top-story
Share this article :

+ comments + 1 comments

Anonymous
13 April 2014 at 15:00

రూపాయలో తొంబై తొమ్మది పైసలు అక్రమంగా సొంతానికి ఆస్తులు కొనుకొంటు తినేసి ,సమాజ అబివృద్ది కి వక పైసా కర్చు పెట్టే జగన్ మోహన్ రెడ్డి గారి వై .ఎస్ .అర్ పార్టీ మరియు బాగా డబ్బులు సంపాయించాలి అని ఆకలి తో వున్నా కెసిఆర్ తెలంగాణా పార్టీ తో జాగ్రత్త గా వుండండి .

మార్పు జనం తోటే సాద్యం(powrudu.blogspot.com)


ఎంచే లంచేలుగా సమాజం లో మార్పు జనం మంచి ఆలోచన ,నడవడిక మూలం గానే వస్తుంది .
బయం వద్దు , అందరు కలసి కట్టుగా చెడును విబేదించండి.ఎంతె మందిని బెదిరిస్తారు, వక్కడిని బేదిరించగలరు ,వంద మందిని బెదిరించాగలరా .
పౌరిడిగా వక చిన్న ప్రయత్నం

ఈ బ్లాగ్ ని చదవండి .మీ రచనలు ఈ ఫోరం లో ముద్రించండి .

దయచేసి ఈ బ్లాగు ని మీ సైట్ కి జతచేయండి

Post a Comment