Home » , , , , , » కనబడినవారందరికి మీకెందరు? ఇద్దరు పుత్రులా ...

కనబడినవారందరికి మీకెందరు? ఇద్దరు పుత్రులా ...

ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ ప్రయోజనం ఆశించే నిర్ణయాలు తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కె.తారకరామారావు అన్నారు చంద్రబాబు కు ఈ విషయం తెలియదా , ఆయన డిల్లీలో ఎందుకు దీక్ష చేశారో , అప్పుడు ఎందుకు అఖిల పక్ష సమావేశం పిలవాలని కోరలేదా?అని ఆయన అన్నారు.ఇప్పుడు అఖిలపక్ష సమావేశం పెడితే మొహం చాటేశారని అన్నారు. ఆయనకు ఒక్కరే కొడుకని,కాని కనబడినవారందరికి మీకెందరు? ఇద్దరు పుత్రులా అంటూ అసంబధ్దమైన ప్రశ్నలు వేస్తున్నారని అన్నారు.ప్రజాప్రతినిధులను, రాజకీయ పార్టీలను కాకుండా జెఎసిలను,ప్రజాసంఘాలను పిలవాలని అనుకుంటే రాజకీయ పార్టీలు ఎందుకు ,టిడిపి ఎందుకు?ప్రధాన ప్రతిపక్ష హోదా ఎందుకు,ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఎందుకు ? అని కెటిఆర్ ప్రశ్నించారు. జెఎసిలనే ఎన్నికలలో నిలబెట్టి తెలుగుదేశం తప్పుకుంటుందా అని ఆయన అన్నారు.కేవలం తప్పించుకోవడానికే తప్ప జెఎసిల పై ప్రేమ ఉండి కాదని ఆయన అన్నారు. తెలుగు జాతికి సమన్యాయం పేరుతో ఇరు ప్రాంతాల తెలుగువారికి సమ మోసం చేస్తున్నదని అన్నారు. కేంద్రం పదకుండు అంశాల వారిగా వైఖరులు అడిగితే టిడిపి తప్ప అన్ని పార్టీలు అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారని అన్నారు.రాజ్యాంగ విరుద్దంగా ప్రక్రియ జరుగుతున్నదంటూ రాష్ట్రపతికి లేఖ రాసిన చంద్రబాబు ఆ అన్యాయం ఏమిటో ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పగలరా అని అన్నారు. అందరిని దూషించడం తప్ప ఒక విధానం లేకుండా చంద్రబాబు ఉన్నారంటే ఎంత దురవస్థ లో ఉన్నారో అర్ధం అవుతుందని అన్నారు. టిఆర్ఎస్ పై కూడా లేనిపోని మాటలు మాట్లాడారని, చంద్రబాబు లాగా చీకటి రాజకీయాలు చేయడం లేదని కెటిఆర్ స్పష్టం చేశారు.తమ దారిలోకి వస్తేనే కాంగ్రెస్ ,టిడిపిలతో పొత్తు పెట్టుకున్నామని అన్నారు.చంద్రబాబు జూలై ముప్పైనాడు కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్,అజాద్ లకుఫోన్ చేసి తెలంగాణను ఆపాలని కోరలేదని ప్రమాణం చేయగలరా అని కెటిఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పడుతుంటే అక్కసుతోనే టిఆర్ఎస్ పై నిందలు మోపుతున్నారని,తమకు అవసరం లేదని ఆయన అన్నారు.గతంలో నరేంద్ర మోడీని తీవ్రంగా విమర్శించిన చంద్రబాబు,ఇప్పుడు బిజెపితో పొత్తు కోసం తహతహలాడడం లేదా? అని చంద్రబాబును ఆయన విమర్శించారు.కెసిఆర్ తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన నాయకుడు అయితే, చంద్రబాబు మామను వెన్నుపోటు పొడిచి ,టిడిపిని కాంట్రాక్టర్ల పార్టీగా మార్చిన వ్యక్తి అని అన్నారు.టిఆర్ఎస్ పై చిల్లరమల్లర ఆరోపణలు చేస్తున్నారని,ఒక్కదానిని అయినా రుజువు చేయగలవా అని ఆయన ప్రశ్నించారు.

http://kommineni.info/articles/dailyarticles/content_20131113_10.php#.UoOD6lejyuI.facebook
Share this article :

Post a Comment