సాక్షి, చిత్తూరు, కుప్పం టౌన్: తన సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ఓడిపోతానన్న భయం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి పట్టుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ తగ్గడంపై ఆయన కుప్పంలో ప్రత్యేకంగా సమీక్షించారు. అక్కడ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు రెండో రోజూ బిజీగా గడిపారు. కుప్పం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మంగళవారం నియోజకవర్గ తెలుగుదేశం సవున్వయ కమిటీ సవూవేశాన్ని నిర్వహించారు. 2014 అసెంబ్లీ ఎన్నికలో ఓడిపోయే పరిస్థితి ఉందని భయాందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా అంతర్గత సవూవేశాల్లో ఎవరైనా లేచి వూట్లాడితే.. ఏయ్ కూర్చో అనే చంద్రబాబు ఈ సవూవేశంలో మాత్రం స్వరం తగ్గించి వూట్లాడారు. ఇటీవల పంచాయుతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ 32 పంచాయుతీలను గెలుచుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సింగిల్ విండో డెరైక్టర్లు, కుప్పం టౌన్ బ్యాంక్ డెరైక్టర్ పోస్టుల్లోనూ వైఎస్‌ఆర్‌సీపీ గెలవడంపై ఆరా తీశారు. తాము సరిగ్గా వ్యవహరించకపోవడం వల్లే వైఎస్‌ఆర్‌సీపీ గెలిచిందని, మీరేం చేస్తున్నారని టీడీపీ నాయుకులను ప్రశ్నించారు.
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కుప్పం పర్యటనకు గ్రావూల నుంచి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలని ఆదేశించారు.
http://www.sakshi.com/news/andhra-pradesh/defeat-fear-for-chandrababu-naidu-at-kuppam-of-chittor-82021?pfrom=home-top-story
Post a Comment