Home » , , , , , » వైఎస్ఆర్ సీపీ టీం చేసిన ఒక పోస్ట్ అర్థాన్నే మార్చిన లోకేష్

వైఎస్ఆర్ సీపీ టీం చేసిన ఒక పోస్ట్ అర్థాన్నే మార్చిన లోకేష్

ప్రజలవద్దకు వెళ్ళడం కంటే ట్విట్టర్ లోనే ఎక్కువగా సమయం గడిపే చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పేస్ బుక్ లో వైఎస్ఆర్ సీపీ టీం చేసిన ఒక పోస్ట్ అర్థాన్నే లోకేష్ మార్చినట్టుగా స్పష్టంగా అర్ధమవుతుంది.

వైఎస్ఆర్ సీపీ టీం చేసిన పోస్ట్ ఇలా ఉంది: “చంద్రబాబు సోనియా కోసం ఇటలీ భాష లో ఒక పదాన్ని వాడారు. దాని అర్ధం ‘కదలిక లేక ఉండడటం’. అసలు ఆ పదం చంద్రబాబు నాయుడుకు సరిగ్గా సూట్ అవుతుంది ఎందుకంటే 100 రోజులుగా ఉద్యమం జరుగుతున్నా చలనంలేకుండా ఉన్నాడు కాబట్టి”.

లోకేష్ దీనికి విపరీత అర్ధాలు తీసినట్టుగా ఉంది. ట్విట్టర్ లో ఈ విధంగా కామెంట్ చేశాడు “తెలుగుదేశం పార్టీ ఆరోపణల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు సోనియా గాంధీని సమర్ధించారు. తమ నాయకుడికి బెయిల్ పొందడానికి వారు తెలుగుజాతి ఆత్మ గౌరవాన్ని సోనియా వద్ద తాకట్టు పెట్టారు”.

అయితే పేస్ బుక్ పోస్టులో లోకేష్ చివరివరకు చదివితే అతనికి బాగా అర్ధం అయి ఉండేదని వైఎస్ఆర్ సీపీ పేస్ బుక్ శ్రేణులు అంటున్నారు. ‘ఆంధ్రపదేశ్ ను అడ్డంగా నరికింది కాంగ్రెస్, చంద్రబాబు లేఖే గండ్ర గొడ్డలి, అడ్డుకుందాం ఈ దుర్మార్గాన్ని”. మరి ఇందులో సోనియా గాంధీని వైఎస్ఆర్ సీపీ వాళ్ళు ఏ విధంగా సమర్ధించారో లోకేష్ కే తెలియాలి!


వైఎస్ఆర్ సీపీ టీం చేసిన పోస్ట్:


Share this article :

Post a Comment