హైదరాబాద్ ఫేస్‌వాల్యూ పెంచి, ఫేస్‌బుక్‌లో ఎక్కించాను

హ్యూమరం: కోతల రాయుడు
 ‘రింజిం రింజిం హైదరాబాద్’ అని పాడుకుంటూ సైకిలెక్కి బయలుదేరాడు చంద్రబాబు. ఆయన వెంట టీవీలవాళ్లు పరిగెత్తారు.
 ‘‘డెవలప్‌మెంట్, అసైన్‌మెంట్, అగ్రిమెంట్, కంటోన్మెంట్, గవర్నమెంట్’’ అన్నాడు బాబు.
 ‘‘వామ్మో, ఇంత ఇంగ్లీషా?’’ అని ఆశ్చర్యపోయారు విలేకరులు.
 ‘‘ట్రీట్‌మెంట్, టెంపర్‌మెంట్, పిప్పర్‌మెంట్, కామెంట్’’ అన్నాడు బాబు.
 ‘‘నో కామెంట్ సార్, ఇంతకూ మీరేం మాట్లాడుతున్నారు’’ అడిగారు విలేకరులు.
 ‘‘మాట్లాడ్డానికి విషయం లేనప్పుడు ఇలా ప్రాసతో మాట్లాడాలని మా గురువు చెప్పాడు.’’
 ‘‘ఎవరు సార్, ఆయన?’’
 ‘‘గురువులను నేను గుర్తుంచుకోను’’ అంటూ చార్మినార్ వద్ద సైకిల్ ఆపాడు.
 ‘‘దీన్ని చార్మినార్ అంటారు. దీన్ని దొంగలెత్తుకుపోకుండా తొమ్మిదేళ్లు నేను కాపాడాను. చార్మినార్ అంటే నాకెందుకిష్టమంటే, అందులో నార్ ఉంది. నాలో నారా ఉన్నాడు. అందుకే మేమిద్దరం నాలుగు కాలాలు నిలబడి ఉన్నాం.’’
 ‘‘వాట్ ఏ కంపారిజన్’’ అని ఆశ్చర్యపోయారు విలేకరులు.
 ‘‘రాజకీయాలకు రీజన్, సీజన్ ఉండవు. ఇటు చూడండి, సాలార్‌జంగ్ మ్యూజియమ్. ఇందులోని వస్తువులన్నీ నాయకుల ఇళ్లకు వెళ్లకుండా కాపలా ఉన్నాను’’ అంటూ అసెంబ్లీకి తీసుకెళ్లాడు.
 ‘‘ఈ గాంధీ విగ్రహాన్ని నాయకులు ఎత్తుకెళ్లి చైనావాళ్లకు అమ్మకుండా నేనే కాపాడి అసెంబ్లీ పరువును రక్షించాను. రక్షణ, భక్షణ, శిక్షణ... అన్నీ ఒక్కలాగే కనిపించినా అర్థాలు వేరు.’’
 హైటెక్ సిటీకి తీసుకెళ్లి, ‘‘బిల్డింగ్‌లు కట్టించాను, బిల్ క్లింటన్‌ను రప్పించాను, రోడ్లు వేయించాను, చెట్లు నాటించాను, కాలువలు తవ్వించాను, హైదరాబాద్ ఫేస్‌వాల్యూ పెంచి, ఫేస్‌బుక్‌లో ఎక్కించాను. టెక్నాలజీ, ఐడియాలజీ ప్రజలకు అర్థం కావు’’ అన్నాడు.
 ‘‘ఆహో ఆంధ్రభోజా! ఇన్ని పనులు మీరు చేస్తే, మరి మిమ్మల్ని ఓడించే పనిలో ప్రజలెందుకున్నారు?’’ అడిగారు విలేకరులు.
 ‘‘డిఫీట్, రిపీట్, సర్కస్ ఫీట్, ప్రాఫిట్. జనం నాడి అర్థంకాక, ఆస్ట్రాలజీని నమ్ముకుంటున్నాను’’ అని చిలక జ్యోతిష్కుని పిలిచాడు.
 చంద్రబాబుని చూసి చిలక పారిపోవడానికి ప్రయత్నించింది. అతికష్టం మీద జ్యోతిష్కుడు దాన్ని పట్టుకుని ఒక కార్డు తీయించాడు. అందులో ఇలా ఉంది.
 ‘‘మీకు వర్తమానమూ లేదు, భవిష్యత్తూ లేదు. మిగిలింది గతమే. దాని గురించే మాట్లాడుతూ ఉండండి.’’
 -   జి.ఆర్.మహర్షి

http://www.sakshi.com/news/funday/comedy-satire-on-chandra-babu-naidu-84725?pfrom=home-top-story

బాబు పాపం.. రాష్ట్రానికి శాపం!

బాబు పాపం.. రాష్ట్రానికి శాపం!
  •  ఆనాడే ప్రాజెక్టులు నిర్మించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు
  •   ఆ ప్రాజెక్టులన్నింటికీ నేడు ట్రిబ్యునల్ నీటిని కేటాయించేది
  •   కానీ బాబు తొమ్మిదేళ్ల పాలనలో  ప్రాజెక్టులను పట్టించుకోలేదు
  •   పైగా ఆయన హయాంలోనే ఎగువ రాష్ట్రాల్లో ఆలవుట్టి వంటి మెగా ప్రాజెక్టుల నిర్మాణం
  •   ఇవన్నీ విస్మరించి వైఎస్‌పై దుష్ర్పచారం
 
 సాక్షి, హైదరాబాద్: గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రాజెక్టుల నిర్మాణంపై అనుసరించిన వైఖరే ఇప్పుడు రాష్ట్రానికి పెనుశాపంగా మారింది! ఒకవైపు బచావత్ ట్రిబ్యునల్ తీర్పు గడువు సమీపిస్తున్నా అప్పటి సీఎం చంద్రబాబు మిన్నకుండిపోయారు. ప్రాజెక్టులకు డబ్బుల్లేవంటూ చేతులు ముడుచుకొని కూర్చోవద్దని, వాటిని పూర్తిచేయుకపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వైఎస్ అనేకమార్లు చెప్పారు. చరిత్రహీనుడిగా మిగిలిపోవద్దని హెచ్చరించారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం ఖాతరు చేయులేదు. తీరా వైఎస్ వుుఖ్యవుంత్రి అయ్యాక పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయుటానికి నడుంబిగించారు. వుహారాష్ట్ర, కర్ణాటక ఇందుకు అభ్యంతరం తెలిపాయి. కొత్త ట్రిబ్యునల్ ఎదుట ఆ ప్రాజెక్టుల నిర్మాణాలు ఆపేరుుంచాలని పట్టుబట్టారుు. 
 
 అప్పుడు మిగులు జలాలపై ఆధారపడిన ప్రాజెక్టులకు మేం ఎలాంటి హక్కులు కోరబోవునీ, ఎలాగూ మిగులు జలాలపై వూకు స్వేచ్ఛ ఉంది కాబట్టి వాటిపై ఆధారపడే నిర్మించుకుంటావునీ వైఎస్ ప్రభుత్వం ఒక లేఖ ఇచ్చింది. ఆ తర్వాతే ఆ ప్రాజెక్టుల ప్రగతి సాధ్యమైంది. లేకపోతే వాటిని ఆరంభించడమే సాధ్యం కాకపోయేది. నాడు బాబు ప్రభుత్వం ప్రదర్శించిన అలసత్వం కారణంగా నేడు ఈ పరిస్థితి నెలకొంది. ట్రిబ్యునల్ ఏర్పడే నాటికే ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తి కావడమో లేక.. నిర్మాణాలు చివరి దశలో ఉండి ఉంటే.. ఇప్పుడు ఈ నష్టం జరిగేది కాదు. ప్రాజెక్టులు ఉన్నందున నీటి కేటాయింపులు వచ్చేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర ఇలాగే ప్రయోజనం పొందాయి. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో తప్పిదాలు ఇంకా రాష్ట్రాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ట్రిబ్యునల్ తీర్పు కూడా అందులో ఒక భాగం!
 
 బాబు హయాంలోనే బాబ్లీ..
 రాష్ట్రంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు చంద్రబాబు హయాంలోనే రూపు దిద్దుకుంది. పైగా టీడీపీ ముఖ్యనేతకు చెందిన సంస్థే దాన్ని నిర్మించింది. నిర్మాణం పూర్తయ్యాక ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఈ ప్రాజెక్టును అనుమతిస్తూ తీర్పు వెల్లడించింది. అలాగే ఎగువ కృష్ణాలో కర్ణాటక నిర్మించిన ఆలమట్టిని కూడా బాబు హయాంలోనే పూర్తయింది. దాంతో ఈ ప్రాజెక్టుకు నీటి  కోటాను పెంచుతూ ప్రస్తుత ట్రిబ్యునల్ తీర్పును వెల్లడించింది.
 
 ఆనాడే నిర్మించి ఉంటే...
 ప్రస్తుత బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ 2004 ఏప్రిల్ 2న ఏర్పాటైంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ వైఎస్ సీఎం అయిన తర్వాత చేపట్టినవే. జలయజ్ఞం కింద మొత్తం 86 ప్రాజెక్టులను చేపట్టారు. ఇందులో ఆయన హయాంలోనే 12 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మరో 21 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీరందించారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగానే కల్వకుర్తి, నెట్టెంపాడు, గాలేరు-నగరి,  హంద్రీనీవా, వెలిగొండ, ఏఎమ్మార్పీ వంటి ప్రాజెక్టులను చేపట్టారు.
ఇవి ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ప్రజల నుంచి డిమాండ్ ఉంది. వీటిలో కొన్ని ఎన్టీఆర్, చంద్రబాబు కూడా శంకుస్థాపన చేసినవి ఉన్నాయి. అయితే వాటిని నిర్మించడంలో విఫలమయ్యారు. వైఎస్ వచ్చిన తర్వాత వాటికి మోక్షం కలిగింది. గతంలోనే ఈ ప్రాజెక్టులను నిర్మించి ఉంటే.. నేడు ట్రిబ్యునల్ వీటికి నీటి కేటాయింపులను చేసేది. సాధారణంగా ట్రిబ్యున ల్ ఏర్పాటు కంటే ముందే పూర్తయిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను చేయడం ఆనవాయితీ. దాంతో రాష్ట్రానికి ఎంతో మేలు జరిగేది. 
 
 అయితే ట్రిబ్యునల్ మొదలైన తర్వాత వీటిని చేపట్టినందున ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర అభ్యంతరం చెప్పాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణాలను నిలుపుదల చేయించాల్సిందిగా ట్రిబ్యునల్‌పై ఒత్తిడి తీసుకువచ్చాయి. దాంతో ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయడానికి వీలుగా ప్రభుత్వం వీటికి నికర జలాలను కోరబోమనే అఫిడవిట్‌ను దాఖలు చేసింది. వీటిని మిగులు జలాల ఆధారంగానే చేపట్టినందున, వరద నీటిని ఉపయోగించుకుంటామని చెప్పింది. ఇలా కాకుండా గతంలోనే ఈ ప్రాజెక్టులు పూర్తయినట్టయితే.. నేడు ట్రిబ్యునల్ వాటికీ నీటికి కేటాయించడానికి అవకాశం ఉండేది. 
 
 నికర జలాలంటే...
  •  కృష్ణా బేసిన్‌లో 47 సంవత్సరాల ప్రవాహాల్లో 65 శాతం నీటి లభ్యతను ఆధారంగా చేసుకొని.. బేసిన్‌లో ఏటా అందులోబాటులోకి వచ్చే జలాల పరిమాణాన్ని లెక్కిస్తారు. అవే నికర జలాలు.
  •  మిగులు జలాలు: నదీ పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురిసినప్పుడు.. సాధారణం కంటే అధిక పరిమాణంలో లభ్యమయ్యే నీటినే మిగులు జలాలు అంటారు.
  •  వరద జలాలు: వరదల సమయంలో నదిలో అధికంగా (నికర, మిగులు జలాలకు మించి) ప్రవహించే నీరు.
  •  డిపెండబిలిటీ అంటే..?: 75 శాతం డిపెండబిలిటీ అంటే.. వందేళ్లలో 75 సంవత్సరాల్లో వచ్చిన నీటి ప్రవాహం సరాసరి.
http://www.sakshi.com/news/andhra-pradesh/chandrababu-naidu-is-the-reason-for-the-krishna-water-tribunal-verdict-84540?pfrom=home-latest-story
 

Disclaimer

Disclaimer
This site is not anti to any one.we are just posting newspapers,news site,blogs...etc news links in our website.bringbackbabu.org  owners, associates and employees are not responsible for any errors, omissions or representations on any of our pages or on any links on any of our pages. We do not endorse in anyway any advertisers on our web pages, links to personal pages, official pages, or commercial pages.
This site should be viewed purely as a source of information and should not be taken to guarantee or warranty for performance of any activity
We have no control of the content of external information. Please verify the veracity of all information on your own before undertaking any reliance.
The linked sites are not under our control and we are not responsible for the contents of any linked site or any link contained in a linked site, or any changes or updates to such sites. We are providing these links to you only as a convenience, and the inclusion of any link does not imply endorsement by us of the site. bringbackbabu.org  also contains material in the form of inputs/feedbacks submitted by users and bringbackbabu.org  accepts no responsibility for the content or accuracy of such content nor does it make any representations by virtue of the contents of bringbackbabu.org   in respect of the existence or availability of any goods and services advertised in the contributory sections.bringbackbabu.org  makes no warranty that the site contents are Virus -free or anything else, which has destructive properties and shall have no liability in respect thereof.
Every effort is made to keep the website up and running smoothly. However, bringbackbabu.org  takes no responsibility for and will not be liable for the website being temporarily unavailable due to technical issues beyond its control.
If you have any questions or concerns about a published article, please send us email . We will review your request and article will be removed immediatly.

నేను మారాను. నన్ను నమ్మండి

బాబు రాయ‘బేరం’
సాక్షి ప్రతినిధి, గుంటూరు :‘నేను మారాను. నన్ను నమ్మండి, పనిచేసే వారికి ప్రాధాన్యం’’ ఇస్తాను అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తరచూ వల్లించే పలుకులివి. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా పార్టీని బతికించిన వారికి రానున్న ఎన్నికల్లో సీట్లు ఇస్తానని అనేక పర్యాయాలు హామీలు గుప్పించారు. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పార్టీని బతికిస్తున్న సీనియర్లను, నియోజకవర్గ ఇన్‌చార్జులను విస్మరించి తటస్థులకు సీట్లు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలకు అవసరమైన నగదును సమకూర్చుకోగల వారిని అన్వేషిస్తున్నారు. తనకు అనుకూలమైన నేతలను వారి వద్దకు రాయభారం పంపుతున్నారు. వారితో చర్చలు జరుపుతున్నారు. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి అధినేత చేసిన ప్రయత్నాలు బహిర్గతం కావడంతో స్థానిక నేతలు గుర్రుగా ఉన్నారు. 
 
 2009 ఎన్నికల్లో పీఆర్పీ నుంచి పోటీచేసి ఓడిపోయిన కొందరు నేతల్ని తన పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేశారు. అప్పటి నుంచి నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో లేకపోయినా, ఎన్నికలకు నిధులు సమకూర్చుకోగల స్థోమత ఉండటాన్ని ఆర్హతగా ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పీఆర్పీ తరఫున పోటీచేసి ఓటమి పాలైన బైరా దిలీప్‌ను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు అధినేత ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి యర్రం వెంకటేశ్వరరెడ్డి, టీడీపీ నుంచి నిమ్మకాయల రాజనారాయణ, పీఆర్పీ నుంచి దిలీప్ పోటీచేశారు. వీరిలో దిలీప్‌కు తక్కువ ఓట్లు వచ్చాయి. అప్పటి నుంచి పార్టీని నియోజకవర్గంలో బతికిస్తున్న నిమ్మకాయల రాజనారాయణను పక్కన పెట్టి బైరా దిలీప్‌కు సీటు ఇచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు పార్టీలో వినపడుతోంది. 
 
 బాపట్ల నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి
 నియోజకవర్గ ఇన్‌చార్జి చీరాల గోవర్ధన రెడ్డి కంటే ఫిబ్రవరిలో తిరిగి పార్టీలో చేరిన అన్నం సతీష్ ప్రభాకర్‌కు చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నట్టు సమాచారం. 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి గాదె వెంకటరెడ్డిపై 1300 ఓట్ల తేడాతో గోవర్ధనరెడ్డి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో పార్టీని బతికిస్తున్నారు. ఇతన్ని కాదని 2009లో కొంతకాలం పీఆర్పీలో కొనసాగి, అక్కడా ఇమడలేక రాజకీయాలకు దూరంగా ఉంటూ ఇటీవల టీడీపీలో మళ్లీ చేరిన సతీష్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది.
  గత ఎన్నికల్లో జిల్లాలో ఒక్క సీటు కూడా కాపు సామాజిక వర్గానికి కేటాయించని బాబు ఈసారి ఆ వర్గానికి చెందిన సతీష్‌కు సీటు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అనంతవర్మ, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి తాతా జయ ప్రకాష్, బీసీ నాయకుడు పమిడి భాస్కరరావులు కూడా సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
 
 వీరంతా పార్టీలో సీనియర్లు. పార్టీ కోసం పనిచేస్తున్నవారే. కాపు సామాజిక వర్గానికి ఈసారి ప్రాధాన్యం ఇవ్వాలనే సాకుతో సతీష్‌కు సీటు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పీఆర్పీ నుంచి పోటీచేసి ఓటమి పాలైన ప్రముఖ పారిశ్రామికవేత్త తులసీ రామచంద్ర ప్రభును అక్కడి నుంచి పోటీ చేయాలని టీడీపీ నేతలతో బాబు రాయభారం పంపినట్టు తెలుస్తోంది. పనిచేసే వారికి కాకుండా తటస్థులకు, నిధులు సమకూర్చుకునే వారికి బాబు ఇస్తున్న ప్రాధాన్యం పార్టీలో చర్చనీయాంశమైంది.
http://www.sakshi.com/news/andhra-pradesh/chandrababu-naidu-call-for-prp-leaderst-to-join-in-tdp-84349?pfrom=home-top-story

చిన్నబోయిన బుద్దా

చిన్నబోయిన బుద్దా
మాటలే తప్ప చేతల్లో బాబు  తీరు మారలేదు.. బలహీన వర్గాల నేతలంటే ఆయనకున్న చిన్నచూపు పోలేదు.. పార్టీ పదవున్నా ఆయన ప్రాపకం లేకపోతే తగిన గౌరవం దక్కదనే విషయం మరోమారు రుజువైంది. నగరంలో మీడియా సమావేశం నిర్వహించి.. కొత్తగా పార్టీ అర్బన్ పగ్గాలు చేపట్టిన బుద్దా వెంకన్నకు ఆ వేదికపై చోటుకల్పించకపోవడంపై పలువురు కార్యకర్తలు, నేతలు విస్తుబోతున్నారు. ఇది కేడర్‌కు ఏ సంకేతాలు అందిస్తుందో అధినేతకు తెలియదా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
 
విజయవాడ :   తెలుగుదేశం పార్టీలో బలహీనవర్గాలకు ఎటువంటి ప్రాధాన్యత ఉంటుందో మరోమారు స్పష్టమైంది. అధినేత చంద్రబాబు సమక్షంలోనే పార్టీ అర్బన్ అధ్యక్షుడికి అవమానం జరిగిందంటూ ఆ పార్టీలోని కొందరు నేతలే ఆవేదన, ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నగరంలో బుధవారం మీడియా సమావేశం ఏర్పాటుచేసిన చంద్రబాబు అర్బన్ అధ్యక్షుడికి ఆ వేదిక మీద చోటుకల్పించకపోవడం ఏం సంప్రదాయమంటున్నారు. ఇది కేడర్‌కు ఎటువంటి సంకేతాలు అందిస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు.
హెలెన్ తుపాను బాధిత రైతులను పరామర్శించేందుకు మంగళవారం రాత్రి జిల్లాలో పర్యటించి నగరానికి వచ్చిన చంద్రబాబు ఓ హోటల్‌లో బసచేశారు. బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వేదికపై చంద్రబాబుతోపాటు మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేశినేని నాని, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌తోపాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఆశీనులయ్యారు. పార్టీ అర్బన్ అధ్యక్షుడికి మాత్రం చోటుదక్కలేదు.  దీంతో ఆయన ఒక పక్కన సాధారణ కార్యకర్తలతోపాటు నిల్చోవాల్సి వచ్చింది.

 కొత్తగా పార్టీ పగ్గాలు అప్పగించిన వ్యక్తికి సముచితమైన స్థానం ఇవ్వాలన్న ఆలోచన కూడా అధినేతకు లేకపోవడం పలువురు నేతల్ని, కార్యకర్తలను ఆశ్చర్యపర్చింది. అధినేత సమక్షంలోనే నగర శాఖ అధ్యక్షుడికి ఇటువంటి మన్నన మర్యాద లభించిందంటే రేపటి నుంచి ఆయన మాటకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఏం విలువ ఇస్తారనే ప్రశ్న ముందుకువచ్చింది. ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న అర్బన్ పార్టీని గాడిన పెట్టే ఆలోచన అధినేతకు ఏ మాత్రం లేదని కొందరు బహిరంగంగానే  విమర్శిస్తున్నారు. పార్టీలో బలహీనవర్గాల వారికి పదవిచ్చినా ప్రాధాన్యత ఇవ్వబోరని, పెత్తనం చేసే వారు వేరే ఉంటారని మరోమారు స్పష్టమైందని కొందరు నేతలు  వాపోతున్నారు.

 పరామర్శపై రైతన్న విమర్శ
 తుపాన్‌కు పంట తీవ్రంగా దెబ్బతిన్న తమను పరామర్శించే తీరు ఇదేనా అని జిల్లాలోని రైతన్నలు చంద్రబాబుపై మండిపడుతున్నారు. అర్ధరాత్రి వేళ పర్యటించి పంట నష్టం గురించి ఆయన ఏం తెలుసుకున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో కైకలూరు చేరుకున్న చంద్రబాబు అక్కడే విశ్రాంతి తీసుకుని బుధవారం పగటివేళ పొలాల్లో దెబ్బతిన్న పంటను పరిశీలించి, అన్నదాతలను పరామర్శించి ఉంటే బాగుండేదని తెలుగుదేశం శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి.
అలా కాకుండా ఆ చీకట్లోనే ముదినేపల్లి, గుడివాడ, గన్నవరం మీదగా మొత్తం 12 గ్రామాల్లో మొక్కుబడిగా పర్యటించి విజయవాడ చేరుకున్నారు. గన్నవరం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన రాత్రి ఒకటిన్నరకు జరిగింది. అర్ధరాత్రి పొలాల్లో పంటలు దెబ్బతిన్న వైనాన్ని ఆయన ఎలా చూశారో ఎవరికీ అర్థం కాలేదు. ఇళ్ల వద్ద నిద్రపోతున్న రైతులను బలవంతంగా లేపి బాబు పర్యటనలో పాల్గొనేలా చేశారు. ఇలా ఆయన పంటనష్టం పరిశీలనంతా మమ అన్న రీతిలో సాగింది.

 ఆ రాత్రి నగరానికి చేరుకున్న చంద్రబాబు 11 గంటల వరకూ హోటల్ గదినుంచి బయటకు రాలేదు. తర్వాత గంటసేపు శ్రీకాకుళం, ఉభయగోదావరి, కృష్ణాజిల్లా నాయకులతో సమావేశం అయ్యారు. దానిలో చర్చంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎలా ఎదుర్కొవాలనే అంశంపైనే జరిగినట్లు సమాచారం. ‘టికెట్లు మీకే ఇస్తాను. జాగ్రత్తగా పనిచేసుకోండి. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయండి’ అంటూ నియోజకవర్గ ఇన్‌చార్జులను చంద్రబాబు ఆదేశించారు.

 వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు సన్నద్ధం కావాలని, కేడర్‌ను కాపాడుకోవాలని హితబోధ చేశారు. అందరికీ ఒకే తరహా ఉపన్యాసం తప్ప నియోజకవర్గ సమస్యలపై చర్చించలేదని, ఇటువంటి సమీక్షలు, సమావేశాల వల్ల ప్రయోజనం ఏమిటని ఆ పార్టీ నేతలే కొందరు పెదవి విరిచారు.

http://www.sakshi.com/news/andhra-pradesh/chandrababu-will-not-change-his-stand-bc-leaders-in-party-84174

‘రత్నాలు’… రాజకీయాలు

Why Bharat ratna to NTRhttp://www.okacharitra.com/politics-and-bharat-ratnas/
Why Bharat ratna to NTR
వివాదం నేటి రాజకీయాల చిరునామా. కాదనేవాళ్లు ఇంకా సద్దుమణగని ‘భారతరత్న’ రభసను చూస్తే చాలు. తాజా వివాదంలో వాదం కంటే రాజకీయం పాలే ఎక్కువని ఒప్పుకుంటారు. భారత ప్రజాస్వామ్య పరిణతిని గానం చేయడం లేటెస్ట్ ‘దేశభక్తి’ ఫ్యాషన్. కాబట్టి ‘రత్న’ వివాదాన్ని మన ప్రజాస్వామ్య పరిణతికి సంకేతంగా ఎందుకు భావించకూడదు? ‘మనం మన అర్హతకు మించిన మెరుగైన పాలనకు నోచుకోకుండా నియంత్రించడానికి కనిపెట్టిన సాధనమే ప్రజాస్వామ్యం’ అని సుప్రసిద్ధ అమెరికన్ రచయిత హెచ్‌ఎల్ మెన్కెన్ 19వ శతాబ్దిలోనే చెప్పాడు. అది మింగుడు పడకపోతే ఆయన మాటల్ని తిరగేసి అన్వయించుకుంటే సరి. మన ప్రజాస్వామ్యం పరిణతి అంటే మన పరిణతే అవుతుంది. అదీ, ఇదీ కూడా మింగుడు పడకపోతే ‘భారత రత్న’ చరిత్రన ు ఓసారి తిరగేయడం మంచిది.
దేశంలోని అత్యున్నత పౌర పురస్కారంగా ‘భారతరత్న’ను ఏర్పాటు చేసిందే (1954) తడవుగా, మరుసటి ఏడే ప్రధాని పదవిలోని జవహర్‌లాల్ నెహ్రూ దాన్ని అందుకున్నందుకు ఆక్షేపించినవారు లేరు. ప్రథమ ప్రధాని ఎంపిక సమయంలో నెహ్రూకు సాటిరాగల వ్యక్తిగా నిలిచిన వల్లభ్‌భాయ్ పటేల్ ఆ పురస్కారం కోసం నాలుగు దశాబ్దాలు వేచి చూడాల్సి వచ్చింది. నెహ్రూ మనవడు రాజీవ్‌గాంధీతో పాటు 1991లో ఆయన భారత ర త్న అయ్యారు.పటేల్‌కు ఇవ్వలేదనో లేదా ఆలస్యంగా ఇచ్చారనో పెద్ద చర్చ సాగలేదు. అతి ఉదారంగా ఎక్కువ మందికి భారతరత్న పురస్కారాలను ప్రకటించిన ప్రధాని పీపీ నరసింహారావు… పటేల్‌తో పాటే సుభాష్ చంద్రబోస్‌కు కూడా ‘న్యాయం’ చేద్దామని చూశారు. రాష్ట్రపతి పదవికి ‘రబ్బరుస్టాంపు’ పేరు తెచ్చిన వీవీ గిరి తర్వాత పదహారేళ్లకు నేతాజీకి పురస్కారమా? అనే విమర్శకుల నసుగుడుకు మించిన రభస నాడూ జరగలేదు. ఈ ఆలస్యాన్ని అవమానంగా ఎంచి బోస్ కుటుంబసభ్యులు దాన్ని తిరస్కరించారనేది వేరేసంగతి. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ కూడా అదే ఏడాది… పురస్కారాల కమిటీలో ఉంటూ పురస్కారాన్ని అందుకోవడం సమంజసం కాదని తిరస్కరించారు. ఆయన మరణానంతరం, మరుసటి ఏడాది ఆజాద్‌కు ఆ పురస్కారం ఇచ్చారు.
ఇద్దరే ఇద్దరు
‘వెయిటింగ్ లిస్ట్’ను క్లియర్ చేయడమే లక్ష్యం అన్నట్టుగా చకచకా ఐదేళ్ల పదవీ కాలంలో ఎక్కువగా భారతరత్న పురస్కారాలను ఇచ్చిన ప్రధానులు పీపీ నరసింహారావు, ఏబీ వాజపేయి. పూర్తికాలం పదవిలో ఉండి కూడా, దేశ ఆర్థిక, రాజకీయ జీవితంపై బలమైన ముద్రను వేసి కూడా(మంచా, చెడా అనేది అసందర్భం… ఎవరికి ఏది తోస్తే అదే) భారత రత్నకు నోచుకోని ఇద్దరే ఇద్దరు మాజీ ప్రధానులు. వారిద్దరూ అలా మిగలడమూ, ఎన్నడూ లేని విధంగా అత్యున్నత పురస్కారంపై నేడు రభస జరుగుతుండటమూ స్వాతంత్య్రానంతర కాలంలో దేశ రాజకీయాల గతిని సూచించే మైలు రాళ్లు కావడం విశేషం. ఇద్దరిలోనూ వాజపేయి నయం. ఆయన వెయిటింగ్ లిస్ట్‌లోనైనా ఉన్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు, కొన్ని యూపీఏ పక్ష పార్టీలు ఆయన తరఫున వాదిస్తున్నాయి. బీజేపీ అదికారంలోకి రాకున్నా ఆయన భారతరత్న అయ్యే అవకాశం ఉంది. వాజపేయితో పాటూ రామ్‌మనోహర్ లోహియా, చరణ్‌సింగ్, కాన్షీరామ్, బాల్‌ఠాక్రే, బిజూ పట్నాయక్, ఎన్టీఆర్, వగైరాలతో చాలా పెద్ద వెయిటింగ్ లిస్టే తయారైంది. వివిధ రాజకీయేతర రంగాలలోని విశిష్ట వ్యక్తుల జాబితా మరొకటి హనుమంతుడి తోకలాగా పెరుగుతూ పోతోంది. ఈ జాబితాల రచ్చలో సోదిలోకి రాకుండా పోయినది పీవీ ఒక్కరే. మన్మోహన్‌కు రాజకీయ తీర్థం ఇచ్చి, దేశ ఆర్థిక మంత్రి పదవిని కట్టబెట్టి, ఆర్థిక సంస్కరణల ఛాంపియన్‌ను చేసినది పీపీ. ప్రధానిగా పదేళ్ల పదవీ కాలంలో మన్మోహన్ ఈ అత్యున్నత పురస్కారాన్ని ఆయనకు ఇవ్వలేకపోవడానికి ‘తగు’ కారణమే ఉందని అందరికీ తెలిసిందే. ప్రధాని సకల శక్తివంతుడైన దేశాధినేతగా ప్రారంభమైన మన ప్రజాస్వామ్య వ్యవస్థకు సోనియాగాంధీ ‘బంట్ల పాలన’ అనే సరికొత్త అధ్యాయాన్ని చేర్చారు. పీపీతోనే దానికి నాంది పలకాలని ఆశించి భంగపడ్డారు. మన్మో హన్‌తో సఫలమయ్యానని సంతృప్తి చెందుతున్నారు. ఆమె మళ్లీ పొరబడ్డారనేది పూర్తిగా అసందర్భం. రాజీవ్ పాలన వరకు కాంగ్రెస్ అధికారంలో ఉండటం అంటే నెహ్రూ-ఇందిరల కుటుంబం అధికారంలో ఉండటమే (లాల్‌బహదూర్ శాస్త్రిని మినహాయిస్తే). ‘అమ్మ’ బంటుగా ఢిల్లీ గద్దెనెక్కిన పీవీ… బంటుగా గాక రాజుగా వ్యవహరించారు. ఫలితాన్ని అనుభవించారు, ఢిల్లీలో అంత్యక్రియలకే నోచుకోని ఆయనను ‘రత్నాన్ని’ ఏం చేస్తారనో ఏమో పీవీ పేరును వెయిటింగ్ లిస్ట్‌కు చేర్చే ప్రయత్నం కూడా ఎవరూ చేయడం లేదు.
‘రత్నం’ రంగు రాజకీయం
ఇక వర్తమానానికి వస్తే… మున్నెన్నడూ లేని విధంగా నేడు ఇంత రభస ఎందుకు జరుగుతున్నట్టు? అది ఏం చూసిస్తున్నట్టు? సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న ప్రకటించడంలో యూపీఏ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అనవసర తొందరపాటును ప్రదర్శించిందనేది ప్రధానంగా వినవస్తున్న వాదన. క్రికెట్ ప్రపంచంలో సచిన్ అసమాన ప్రతిభాశాలి అనడంలో ఎలాంటి వివాదమూ లేదు. అయినా గానీ సచిన్‌కు అత్యున్నత పురస్కారాన్ని అందుకునే అర్హత ఉన్నదా? అంతకంటే ముందే ఆ పురస్కారాన్ని అందుకోవాల్సిన వారి మాటేమిటి? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నవారికి కొదవలేదు. సీఎన్‌ఆర్ రావు గురించి ఏ గొడవా లేదు. సచిన్ ఒక్కడికే ఇస్తే అది ఎన్నికల ‘తొందరపాటు’ రాజకీయం అనిపిస్తుందనే ఆయన పేరును చేర్చారనేది బహిరంగ రహస్యం. భారతరత్న ఆయనకు అనూహ్యంగా, హఠాత్తుగా వచ్చిపడ్డ లబ్ధి (విండ్ ఫాల్ గెయిన్). కాబట్టి ఆయన ఈ రచ్చకు ‘అతీతుడు’ కావాల్సింది. కానీ కాలేదు. ‘కృతజ్ఞత’ చూపాల్సిన సీఎన్‌ఆర్ రావు… రాజకీయనేతల చేతుల్లో పడి విజ్ఞానశాస్త్ర రంగం భ్రష్టుపట్టి పోతోందంటూ విరుచుకుపడి యూపీఏను రచ్చ కీడ్చారు. తర్వాత ఆయన ‘శాంతించినా’ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చాలా మంది భావిస్తున్నట్టు యూపీఏ ఈ వ్యవహారంలో ‘తొందరపాటు’ ప్రదర్శించ లేదు. సచిన్ కంటే ముందుగానే కాంగ్రెస్ రాజనీతి దురంధరులు ఎన్నికల ముందు చూపుతో సచిన్ రిటైర్మెంట్‌కు కానుకను సిద్ధం చేసారు. 2011 డిసెంబర్‌లోనే క్రీడాకారులకు కూడా భారత రత్నకు అర్హతను కల్పించేలా నిబంధనలను సవరించారు. ఆ తదుపరి ప్రకటించిన పురస్కారాలు ఇవే. జాతీయ వ్యసనమా అనిపించేంతగా విస్తరించిన క్రికెట్ అభిమానాన్ని, ఆ ఆటకు ఇలవేలుపుగా వెలుగుతున్న సచిన్ రిటైర్మెంట్‌ను ఓట్ల కాలంలో సొమ్ము చేసుకోలేని అధికారం ఉండి ఫలమేమిటని అనుకోని పార్టీలు ఏవన్నా ఉన్నాయా? సచిన్‌కు భారతరత్న ఎందుకు ఇవ్వరని మోడీ, శివసేనల నుంచి అంతా పోటీపడి ప్రకటనలు గుప్పించాక మేల్కోవడం కంటే ముందే సిద్ధం కావడం మంచి ఎత్తుగడే. కానీ కాంగ్రెస్ తలరాతే… ‘కాలం’ కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందన్నట్టుంది. అందుకే అత్యంత వివాదరహితుడైన క్రికెటర్‌గా పేరుమోసిన సచిన్ భారతరత్న అతి పెద్ద వివాదమైంది. ఆ వివాదం భారతరత్నకు ఆది నుంచి అంటుకున్న రాజకీయాల రంగును వెలుగులోకి తెస్తోంది. మొదటి నుంచి ఈ పురస్కారం ప్రధాని, అధికార పార్టీల ఇష్టాయిష్టాలపై ఆధారపడినదిగానే ఉంటున్న విషయం తేటతెల్లమవుతోంది.
క్షీణ రాజకీయ శకం
ఒకప్పుడు కేంద్రంలో కాంగ్రెస్‌కు ఉన్న తిరుగులేని రాజకీయ అధికారం వల్లనే అన్ని రంగాల్లోలాగానే అత్యున్నత పురస్కారాల విషయంలోనూ అసమ్మతి స్వరాలు, ధిక్కార గళాలు పెద్దగా వినిపించేవి కావు. ఎప్పుడో మాట కాదు, 1988లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు ఎంజీఆర్‌కు ఈ పురస్కారం ఇచ్చినప్పుడు కూడా అది పెద్ద వివాదం కాలేదు. అంబేద్కర్ కంటే రెండేళ్ల ముందు, పటేల్ కంటే మూడేళ్ల ముందు, నేతాజీ కంటే నాలుగేళ్ల ముందు ఆయనకు ఈ పురస్కారాన్ని కట్టబెట్టడం రాజకీయం గాక మరేమిటి? వాజపేయి ప్రభుత్వ హయాంలో సైతం కాంగ్రెస్‌కు చెందిన పీవీకి భారతరత్న ఇవ్వడం కంటే ఎవరికీ ఇవ్వకపోవడమే ఉత్తమమని భావించలేదా? అందరికంటే ఎక్కువగా భారతరత్నలను అందించిన ఆయన హయాంలో ఒక్క జయప్రకాష్ నారాయణ్ మాత్రమే రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తి. నేడు అందరికంటే గట్టిగా ఎన్టీఆర్‌కు భారతరత్న కావాలని కోరుతున్న చంద్రబాబు నాయుడు ఎన్‌డీఏ హయాంలో కింగ్ మేకర్. ఆయన మాటకు కట్టుబడే ఆనాడు వాజపేయి ప్రభుత్వం ఎన్టీఆర్ పేరును విస్మరించలేదా? అది రాజకీయం కాక మరేమిటి? అయితే ఈసారే ఇలా భారతరత్నపై నిర్భయంగా భిన్నాభిప్రాయాలను ప్రకటించగలగడం, ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించడం, ఇలా శల్య పరీక్షకు గురిచేయడం. ఎవరికి వారుగా ఎక్కడికక్కడ జాబితాలు తయారు చేయడం ఏం సూచిస్తోంది? కేంద్రంపై జాతీయపార్టీల పట్టుసడలిపోవడం అనేది నిజమే. అంతకుమించి కేంద్రంలో అధికారం నెరపుతున్న ప్రభుత్వాల నైతిక అధికారం రోజురోజుకూ క్షీణించిపోతుండటం కాదా? ఈ క్షీణత ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వాలకు సంబంధించినదేకాదు. బీజేపీ అందుకు మినహాయింపు కానేకాదు. కాబట్టే ఒకప్పుడు ఎన్‌డీఏ భాగస్వాములు కావడానికి వాజపేయి ఉదారవాదం, గాం దేయ సోషలిజాల మొహం బిజేపీకి అవసరమైంది. నేడు ఆ అవసరం లేదు. మోడీ మొహంతోనే మిత్రులను కూడగట్టుకోగలదు. నితీష్, మోడీ వ్యతిరేకత పచ్చి రాజకీయం లేదా అవకాశవాదం మాత్రమే. ఇదంతా మన ప్రజాస్వామ్యం పరిణతిగా భావించలేకపోతే… ‘ప్రజాస్వామ్యం ఒక కల మాత్రమే. అర్కేడియా, శాంతాక్లాజ్, స్వర్గం కోవలోకే దాన్ని కూడా చేర్చాలి’ (మెన్కెన్)

ఆయనలా.. ఈయనిలా!!

విస్తరించు & ప్లే క్లిక్ చేయండి
ఆయనలా.. ఈయనిలా!!
గోదావరి జిల్లాలపై ప్రకృతి పగబట్టింది. రైతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. నలభై రోజుల వ్యవధిలోనే ఏకంగా మూడు తుఫాన్లు వరుసపెట్టి వచ్చి, చేతిదాకా అందిన కూడును నోటి వరకు రాకుండా చేసేసరికి రైతు గుండె అల్లాడిపోయింది. అలాంటి పరిస్థితుల్లో అన్నదాతకు తానున్నానంటూ ధైర్యం చెప్పి, నాలుగు మాటలు మాట్లాడి భరోసా ఇవ్వాల్సినది నాయకులే. తుఫాను బాధిత రైతులను పరామర్శించి, పలకరించి, వారికి ప్రభుత్వపరంగా అందాల్సిన సాయం అందుతోందో లేదో తెలుసుకుని, అందకపోతే అందేలా చేయాలన్న ఉద్దేశంతో ఇద్దరు నాయకులు గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లారు. వారిలో ఒకరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాగా, మరొకరు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.

జన నాయకుడు అనేవాడు ప్రజల హృదయాల్లో ఎలా ఉంటాడో, ప్రజల కష్టాల్లో ఎలా పాలుపంచుకుంటాడో తెలియాలంటే ఈ ఇద్దరు నాయకుల పర్యటనలను ఒక్కసారి చూస్తే చాలు. అన్నదాతల బాధలు వింటుంటే గుండె తరుక్కుపోతోందని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.  ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో ఆయన స్వయంగా పొలాల్లోకి దిగి, ఆ మట్టిలోనే నడుస్తూ రైతుల భుజాలపై చేతులు వేసి.. వారి గుండెల్లో కాసింత నిబ్బరం నింపడానికి శాయశక్తులా ప్రయత్నించారు.

మరోవైపు
పశ్చిమగోదావరిజిల్లా నరసాపురం సమీపంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా పర్యటించారు. బాధితులను పరామర్శించారు. పరామర్శించడానికి సీఎం రాకపోయినా తాను వచ్చానంటూ గొప్పలు చెప్పుకున్నారు. చేతికందిన పంటను కోల్పోయిన అన్నదాతను పరామర్శించేందుకు వెళ్లిన చంద్రబాబు... కాలికి కనీసం మట్టికూడా అంటకుండా ఆకుపచ్చ తివాచీ మీద చామంతి పూలు పరిపించుకుని మరీ దానిమీద అత్యంత సుతారంగా నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ నుంచే రైతులను 'ఓదార్చారు'. రాజకీయలబ్ధి కోసమే తప్ప... నిజంగా తమను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ఉంటే వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అంటూ రైతులు విమర్శిస్తున్నారు.

http://www.sakshi.com/news/features/ys-jagan-mohan-reddy-and-chandra-babu-a-comparision-of-their-tours-83968?pfrom=home-top-story

Chandra Babu's HITEC City Story



హ్యూమరం: కోకోనట్ థియరీ

హ్యూమరం: కోకోనట్ థియరీ
http://www.sakshi.com/news/funday/journalists-asks-chandrababu-naidu-about-coconut-theory-83013

బాబు విలేకరుల సమావేశం.‘‘రాష్ట్రం గురించి మీ అభిప్రాయం?’’ అడిగారు విలేకరులు. ‘‘కొబ్బరికాయలా సమంగా పగలాలి. గుమ్మడికాయలా ముక్కలు కాకూడదు. ప్రతిదీ పండే కదాని అన్నిటినీ ఒక్కలా తినకూడదు. అరటికి తొక్క తీయాలి. ఆపిల్‌ను కోసి తినాలి. పైనాపిల్ చెక్కు తీయాలి. ద్రాక్షను గుటుక్కున మింగాలి. సీతాఫలంలో విత్తనాలు ఊసేయాలి...’’
 
 ‘‘కొబ్బరికాయ గోలేంటి సార్?’’
 ‘‘గోలలోనే గోల్ ఉంటుంది. కొబ్బరిని నారికేళమంటారు. నా రాజకీయాన్ని నారావారి కేళమంటారు. కొబ్బరి నీడ కొంప ముంచుతుంది. కాయ నెత్తిన పడితే కైలాసం ఫ్రీ. ఇడ్లీలోకి చెట్నీ అవుతుంది. మటన్‌లోకి మసాలాగా మారుతుంది. పది వంకాయలు కూడా ఒక టెంకాయతో సమానం కావు.’’
 
 ‘‘మేమడిగిందేంటి?’’
 ‘‘అడిగేవాడికే జ్ఞానం. కడిగేవాడికే పాత్రలు. కొబ్బరిలోకి నీళ్లెలా వచ్చాయో తెలుసుకోవడమే జ్ఞానం. నీళ్లు నూనెగా మారడమే విజ్ఞానం. తలకు నూనె రాస్తే, తలరాతలు మారుతాయనుకోవడం అజ్ఞానం. అలలను, కలలను ఎవరూ ఆపలేరు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం నా కల. ఓటర్లకు వాగ్దానం చేయడం ఓ వల. అల, కల, వల అన్నీ రాజకీయమే. పీచే కదాని చులకన చేయకు. అదే ఒకనాడు పరుపవుతుంది.’’
 
 ‘‘మీరెప్పటికీ మారరా?’’
 ‘‘ప్రపంచంలో ఎప్పటికీ మారనిది కొబ్బరికాయే. శతాబ్దాల క్రితం దేవుడికి కొబ్బరికాయే కొడుతున్నాం. ఇప్పుడూ అదే. తీర్థమిచ్చిన ప్రతివాడూ పూజారి కాదు. ప్రసాదం తిన్న ప్రతివాడూ భక్తుడు కాదు. భక్తికీ కొబ్బరికాయకీ ఉన్న అనుసంధానమే ఈ రాష్ట్రం. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఓటరుకూ ఒక కొబ్బరికాయ కొడతా. ఓటేయకపోతే నెత్తిన కొడతా. టెంకాయ సమంగా పగలకపోతే ఢిల్లీదే తప్పు...’’
 విలేకరులు కుయ్యో మొర్రో అన్నారు.
 ‘‘కుయ్యోమని కూయమంటే కోడి కూయదు. మొర్రోమన్నా మేకని వదలరు. కూతలు, కోతలు రెండూ ఒకటే. టెంక ఉన్నంత మాత్రాన మామిడి టెంకాయగా మారదు. కొబ్బరి కొబ్బరే, మామిడి మామిడే. కొబ్బరిని ఇంగ్లిష్‌లో కోకోనట్, హిందీలో నారియల్ అంటారు.’’
 
 ‘‘సార్, స్టేట్ పరిస్థితి...’’
 ‘‘స్టేట్‌మెంట్‌లతో స్టేట్ మారదు. స్టేట్‌లు మారినా స్ట్రీట్‌మారదు. ఏ స్టేట్‌లో ఉన్నా మన ఎస్టేట్‌లు ఉన్నాయా లేదా, మన స్టేటస్ ఏంటి అన్నది ముఖ్యం.’’
 విలేకరులు పారిపోవడానికి ప్రయత్నించారు. తలా ఒక కొబ్బరి బర్ఫీని తినిపించాడు బాబు.
 ఆ తరువాత వాళ్లు ఎటుపోయారో తెలియదు. పత్రికా కార్యాలయాలకు, టీవీ చానళ్లకు చేరలేదు.
 - జి.ఆర్.మహర్షి
 
 మహర్షిజం
 ఢిల్లీ నాటకం: నాయకులు తెల్లమొహాలేసి, జనాల మొహాలకు రంగు పూస్తున్నారు.
 తెలుగు తమ్ముడి కామెంట్: అర్థమయ్యేలా మాట్లాడటం మా చంద్రబాబు డిక్షనరీలోనే లేదు.
 కిరణ్ ఏం చేస్తున్నాడు? హార్స్ రేస్‌ల కోసం చెక్క గుర్రంపై ప్రాక్టీస్ చేస్తున్నాడు.
 రాజకీయమంటే: ఎన్నటికీ రాని రైలుకి టికెట్లు అమ్మడం!
 మన నాయకుల ప్రత్యేకత: బాల్, గోల్ రెండూ లేకుండా ఫుట్‌బాల్ ఆడటం!
 కాంగ్రెస్ నాయకుడి ఆవేదన: ఆయుధాలన్నీ ఢిల్లీవాళ్లు లాక్కుని, యుద్ధానికి వెళ్లమంటున్నారు.

టీడీపీ సొంతింటి ప్యాకేజీ...!

టీడీపీ సొంతింటి ప్యాకేజీ...!
 పార్టీలోకి వచ్చే నేతలకే కాదు.. పార్టీని వీడిపోతారనే నేతలను బుజ్జగించడానికీ టీడీపీలో ప్యాకేజీలు ఇస్తున్నారు. ఈ సొంతింటి ప్యాకేజీ సంగతి గురించి తెలుసుకున్న పలువురు టీడీపీ నేతలు ఇదేదో బాగానే ఉందే అనుకుంటున్నారు. విషయమేమిటంటే.. కాంగ్రెస్‌తో కుదిరిన ప్యాకేజీలో భాగంగా నేడో రేపో పార్టీ మారిపోతున్నాడని ఒక తెలంగాణ నాయకుడిపై టీడీపీలో కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నాయకుడు పార్టీ ‘టీ’ నేతల మేధోమథన సదస్సులో అందరికీ షాకిచ్చారు.
 
  ‘‘పార్టీ మారుతున్నట్టు నాపై లేనిపోని ప్రచారం జరుగుతోంది. చూడండి.. నా గుండెల్లో చంద్రుడు(చంద్రబాబు) ఉన్నారు’’ అంటూ చొక్కా విప్పి మరీ తన ఛాతీని అక్కడున్నవారికి చూపించేశారు. పురాణాల్లో హనుమంతుడు తన రామభక్తిని చాటినట్టు ఈయన తన చంద్రభక్తిని చాటడంపై ఆ నేతలంతా ఆశ్చర్యపోయారు. నిన్నటివరకు రోజూ తిడుతున్న నాయకుడే ఒక్కసారిగా ఇలా భక్తి చాటుకోవడంలో ఆంతర్యమేంటా అని ఆరా తీసేసరికి అసలు విషయం తెలిసి ముక్కున వేలేసుకున్నారట. టీ టీడీపీ ఫోరానికి చెందిన ఆ నేత కాంగ్రెస్‌లో చేరుతున్నారని ప్రచారం జరుగుతుండటంతో బాబు ఆయన్ను రహస్యంగా పిలిపిం చుకుని మాట్లాడారట.
 
  అసలే పార్టీ స్థితి దయనీయంగా మారుతున్న టైమ్‌లో మీలాంటి నేతలు బయటికెళ్లిపోతే ఎలా? అలాంటి ప్రయత్నాలు విరమించుకోవాలని కోరారట. దాంతో పార్టీలో ఉండాలంటే ఇవి చేయండంటూ చాంతాడంత కోరికల చిట్టా విప్పారట. ‘‘వచ్చే ఎన్నికల్లో మీరు టికెట్ ఇచ్చినా గెలిచే స్థితి కనిపించట్లేదు. అలాంటప్పుడు నేను ఖర్చుపెట్టుకుని ఏం సాధిస్తాను. అందుకే ఇప్పట్నుంచి ఎన్నికలదాకా అయ్యే ఖర్చుతో పాటు ఎన్నికల ఖర్చునూ పూర్తిగా మీరే భరించాలి. నేను ఓడితే ఆ తర్వాత నాకు రాజ్యసభ టికెట్ ఇస్తానని హామీ ఇవ్వాలి’’ అంటూ జాబితా చెప్పుకుపోయారట. అందుకు అధినేత ఓకే అన్నారట. దాంతో సదరు నేత మీటింగ్‌లోకొచ్చి తన చంద్రభక్తిని చాటుకున్నారట. ఓహో! పార్టీలోకి వచ్చేవారికే కాదు! పార్టీని వీడిపోతారని ప్రచారం జరిగినా ప్యాకేజీలు ఇస్తారన్నమాట. ఇదేదో బాగుందే.. మనమూ ఆ ఫీలర్స్ వదిలితే పోలే...!!  అని పలువురు పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారట..!

బాబు పరిపాలనపై బ్రిటన్ మేధావి GEORGE MONBIOT వ్రాసిన వ్యాసం

బాబు పరిపాలనపై బ్రిటన్ మేధావి  GEORGE MONBIOT వ్రాసిన వ్యాసం 



May 20, 2004
VIEW FROM BRITAIN

This Is What We Paid For
Tony Blair has lost the election. It's true he wasn't standing, but we won't split hairs. In throwing him out of their lives, the voters of Andhra Pradesh may have destroyed the world's most dangerous economic experiment.


Tony Blair has lost the election. It's true he wasn't standing, but we won't split hairs. His policies have just been put to the test by an electorate blessed with a viable opposition, and crushed. In throwing him out of their lives, the voters of the Indian state of Andhra Pradesh may have destroyed the world's most dangerous economic experiment.
Chandrababu Naidu, the state's chief minister, was the West's favourite Indian. Tony Blair and Bill Clinton both visited him in Hyderabad, the state capital. Time magazine named him South Asian of the Year; the governor of Illinois created a Naidu Day in his honour, and the British government and the World Bank flooded his state with money. They loved him because he did what he was told.
Naidu realised that to sustain power he must surrender it. He knew that as long as he gave the global powers what they wanted, he would receive the money and stature which count for so much in Indian politics. So instead of devising his own programme, he handed the job to the US consultancy company McKinsey.
McKinsey's scheme, "Vision 2020", is one of those documents whose summary says one thing and whose contents quite another.(1) It begins, for example, by insisting that education and healthcare must be made available to everyone. Only later do you discover that the state's hospitals and universities are to be privatised and funded by "user charges".(2) It extols small businesses but, way beyond the point at which most people stop reading, reveals that it intends to "eliminate" the laws which defend them,(3) and replace small investors, who "lack motivation", with "large corporations".(4) It claims it will "generate employment" in the countryside, and goes on to insist that over 20 million people should be thrown off the land.(5)
Put all these - and the other proposals for privatisation, deregulation and the shrinking of the state - together, and you see that McKinsey has unwittingly developed a blueprint for mass starvation. You dispossess 20 million farmers from the land just as the state is reducing the number of its employees and foreign corporations are "rationalising" the rest of the workforce, and you end up with millions without work or state support. "The State's people," McKinsey warns, "will need to be enlightened about the benefits of change."(6)
McKinsey's vision was not confined to Naidu's government. Once he had implemented these policies, Andhra Pradesh "should seize opportunities to lead other states in such reform, becoming, in the process, the benchmark state."(7) Foreign donors would pay for the experiment, then seek to persuade other parts of the developing world to follow Naidu's example.
There is something familiar about all this, and McKinsey have been kind enough to jog our memories. Vision 2020 contains 11 glowing references to Chile's experiment in the 1980s. General Pinochet handed the economic management of his country to a group of neoliberal economists known as the Chicago Boys. They privatised social provision, tore up the laws protecting workers and the environment and handed the economy to multinational companies. The result was a bonanza for big business, and a staggering growth in debt, unemployment, homelessness and malnutrition.(8) The plan was funded by the United States in the hope that it could be rolled out around the world.
Pinochet's understudy was bankrolled by Britain. In July 2001 Clare Short, then secretary of state for development, finally admitted to parliament that, despite numerous official denials, Britain was funding Vision 2020.(9) Blair's government has financed the state's economic reform programme, its privatisation of the power sector and its "centre for good governance" (which means as little governance as possible). (10) Our taxes also fund the "implementation secretariat" for the state's privatisation programme. The secretariat is run, at Britain's insistence, by the far-right business lobby group the Adam Smith Institute.(11) The money for all this comes out of Britain's foreign aid budget.
It is not hard to see why Blair's government is doing this. As Stephen Byers revealed when he was secretary of state for trade and industry, "the UK Government has designated India as one of the UK's 15 campaign markets."(12) The campaign is to expand the opportunities for British capital. The people of Andhra Pradesh know what this means: they call it "the return of the East India Company".
This isn't the only aspect of British history which is being repeated in Andhra Pradesh. There's something uncanny about the way in which the scandals that surrounded Tony Blair during his first term in office are recurring there. Bernie Ecclestone, the Formula 1 boss who gave Labour pounds1 million and later received an exemption from the ban on tobacco advertising, was negotiating with Naidu to bring his sport to Hyderabad. I have been shown the leaked minutes of a state cabinet meeting on January 10th this year.(13) McKinsey, they reveal, instructed the cabinet that Hyderabad should be a "world class futuristic city with Formula 1 as a core component." To make it viable, however, there would be a "state support requirement of Rs400-600 crs"(4 billion to 6 billion rupees).(14) This means a state subsidy for Formula 1 of pounds50million to pounds75m a year. It is worth noting that thousands of people in Andhra Pradesh now die of malnutrition-related diseases because Naidu had previously cut the subsidy for food.
Then the minutes become even more interesting. Ecclestone's Formula 1, they note, should be exempted from the Indian ban on tobacco advertising. Mr Naidu had already "addressed the PM as well as the Health Minister in this regard" and was hoping to enact "state legislation creating an exemption to the Act". (15)
The Hinduja brothers, the businessmen facing criminal charges in India who were given British passports after Peter Mandelson intervened on their behalf, have also been sniffing round Vision 2020. Another set of leaked minutes I have obtained shows that in 1999 their representatives held a secret meeting in London with the Indian attorney-general and the British government's export credit guarantee department, to help them obtain the backing required to build a power station under Naidu's privatisation programme. (16) When the attorney-general began lobbying the Indian government on their behalf, this caused yet another Hinduja scandal.
The results of the programme we have been funding are plain to see. During the hungry season, hundreds of thousands of people in Andhra Pradesh are now kept alive on gruel supplied by charities.(17) Last year hundreds of children died in an encephalitis outbreak because of the shortage of state-run hospitals.(18) The state government's own figures suggest that 77% of the population has fallen below the poverty line.(19) The measurement criteria are not consistent, but this appears to be a massive rise. In 1993 there was one bus a week taking migrant workers from a depot in Andhra Pradesh to Mumbai. Today there are 34. (20) The dispossessed must reduce themselves to the transplanted coolies of Blair's new empire.
Luckily, democracy still functions in India. In 1999, Naidu's party won 29 seats, leaving Congress with five. Last week those results were precisely reversed. We can't yet vote Tony Blair out of office in Britain, but in Andhra Pradesh they have done the job on our behalf.

హైదరాబాద్‌ కట్టిన చంద్రబాబుని!

September 30, 2013 10:38 (IST)
చంద్రబాబు - ఓ పిచ్చోడి కథ
హైదరాబాద్: నిజాం కాలేజీ మైదానంలో ఆదివారం జరిగిన సకల జనభేరి సభలో కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్‌ తన ప్రసంగంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గురించి చెప్పిన కథకు సభికుల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చింది.

‘‘ప్రస్తుతం ఎటూ పాలుపోని పరిస్థితిలో ఉన్న చంద్రబాబు అటూ, ఇటూ తిరుగుతూ ఒక పిచ్చోడికి తారసపడ్డారట. చంద్రబాబును చూసి నువ్వు ఎవ్వరివి అని ఓ పిచ్చోడు ప్రశ్నించగా.. నేను చంద్రబాబునని బదులిచ్చాడు. ఏ చంద్రబాబువి అని పిచ్చోడు తిరిగి ప్రశ్నిస్తే ‘అదే, హైదరాబాద్‌ కట్టిన చంద్రబాబునని’ చెప్పాడట.

చంద్రబాబు మాటలు విన్న పిచ్చోడు.. ‘ఆహా! త్వరలోనే తగ్గిపోతుంది. నేను కూడా కొద్దిరోజుల క్రితం వరకు ఢిల్లీ గురించి ఇట్లానే చెప్పేవాడిని’ అన్నాడట’’ అని దేశపతి చెప్పడంతో సభ చప్పట్లతో మారుమోగింది.

http://www.sakshi.com/news/andhra-pradesh/deshapathi-srinivas-narrates-chandrababu-mad-man-story-69503

చంద్రబాబుకు ఓటమి భయం!

చంద్రబాబుకు ఓటమి భయం!
సాక్షి, చిత్తూరు, కుప్పం టౌన్: తన సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ఓడిపోతానన్న భయం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి పట్టుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ తగ్గడంపై ఆయన కుప్పంలో ప్రత్యేకంగా సమీక్షించారు. అక్కడ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు రెండో రోజూ బిజీగా గడిపారు. కుప్పం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మంగళవారం నియోజకవర్గ తెలుగుదేశం సవున్వయ కమిటీ సవూవేశాన్ని నిర్వహించారు. 2014 అసెంబ్లీ ఎన్నికలో ఓడిపోయే పరిస్థితి ఉందని భయాందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా అంతర్గత సవూవేశాల్లో ఎవరైనా లేచి వూట్లాడితే.. ఏయ్ కూర్చో అనే చంద్రబాబు ఈ సవూవేశంలో మాత్రం స్వరం తగ్గించి వూట్లాడారు. ఇటీవల పంచాయుతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ 32 పంచాయుతీలను గెలుచుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సింగిల్ విండో డెరైక్టర్లు, కుప్పం టౌన్ బ్యాంక్ డెరైక్టర్ పోస్టుల్లోనూ వైఎస్‌ఆర్‌సీపీ గెలవడంపై ఆరా తీశారు. తాము సరిగ్గా వ్యవహరించకపోవడం వల్లే వైఎస్‌ఆర్‌సీపీ గెలిచిందని, మీరేం చేస్తున్నారని టీడీపీ నాయుకులను ప్రశ్నించారు.
 
  వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కుప్పం పర్యటనకు గ్రావూల నుంచి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలని ఆదేశించారు. 

http://www.sakshi.com/news/andhra-pradesh/defeat-fear-for-chandrababu-naidu-at-kuppam-of-chittor-82021?pfrom=home-top-story

మహిళల గోడు వినని చంద్రబాబు

మహిళల గోడు వినని చంద్రబాబువిస్తరించు & ప్లే క్లిక్ చేయండి
sakshi: చిత్తూరు: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంవ ప్రజల గోడునే పట్టించుకోవడంలేదు. మహిళల సమస్యలు వినడానికి కూడా ఆయన సిద్దంగాలేరు. చంద్రబాబు మాటలు వింటే కోటలు దాటుతాయి. సొంత ప్రజల గోడు కూడా పట్టించునే స్థితిలో ఆయనలేరు.

 చిత్తూరు జిల్లాలోని సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఏ అమావస్యకో కానీ సొంత నియోజకర్గానికి  వెళ్లని చంద్రబాబు ఏవేవో పనులు పెట్టుకుని ఈ రోజు  అక్కడికి వెళ్లారు.   శాంతిపురం నుంచి రామకుప్పం మధ్యలో  చంద్రబాబు వెళ్తున్నారని తెలిసి మఠం దగ్గర మహిళలు కాపుకాశారు.  ఖాళీ బిందెలతో నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు.

తీరా చంద్రబాబు వచ్చాకైనా వాళ్లకు అవకాశం దొరికిందా అంటే లేదు. పోలీసులు అంత దూరంలోనే జనాన్ని అడ్డుకుని కేవలం ఇద్దరు ముగ్గురిని మాత్రమే అనుమతించారు.  చంద్రబాబు ఆ వినతిపత్రం తీసుకుని వెళ్లిపోయారు. సొంత నియోజకవర్గంలోనే జనం పరిస్థితి ఇలా ఉంటే ఇక మిగతా ప్రాంతాల ప్రజల గోడు ఏమి పట్టించుకుంటారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ పర్యటనలో ఆయన ప్రసంగాలు కూడా ఎందుకు వచ్చారో చెప్పకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని విమర్శించడమే సరిపోయిందని పలువురు విమర్శిస్తున్నారు.

Chandrababu 100% fake assets

తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆస్తుల లెక్కలపై సాక్షి తనదైన శైలిలో విశ్లేషణ చేసింది. చంద్రబాబు ఆయా సంవత్సరాలలో ఇచ్చిన లెక్కలలోని తేడాలను వివరించడానికి, అలాగే కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఆస్తుల వివరాలకు మార్కెట్ విలువ కట్టి కదనాన్ని ఇచ్చింది.చంద్రబాబు తన కుటుంబ ఆస్తి 41 కోట్లు అని , అందులో తనవ్యక్తిగత ఆస్తి విలువ నలభై రెండు లక్షలని తెలిపిన నేపధ్యంలో ఈ విశ్లేషణ చేసింది.1988లో చంద్రబాబు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం కుటుంబ ఆస్తి 77 ఎకరాలని తెలిపారని, అందులో తన ఆదాయం వాటా ఏడాదికి ముప్పై ఆరు వేలు అని పేర్కొన్నారని సాక్షి తెలిపింది.1999లో స్పీకర్ ఇచ్చిన ప్రకటనలో 7.7 కోట్లుగా చెప్పారని పేర్కొన్నారు.2004 నాలుగులో ఇరవై కోట్లు, 2009లో అరవై కో్ట్లుగా అదికారికంగానే తెలిపారని వెల్లడించింది.ఇక ఇప్పుడు చంద్రబాబు ప్రకటించిన ఆస్తి మార్కెట్ విలువ 680కోట్లుగా సాక్షి లెక్కగట్టింది.
Chandrababu property - 2013
Chandrababu Properties
Chandrababu Properties
Chandrababu Properties
Chandrababu Properties
Chandrababu Properties
Chandrababu Properties
Chandrababu Properties
Chandrababu Properties
Chandrababu Properties
Chandrababu Properties
Chandrababu property - 2013
Chandrababu Properties
Chandrababu Properties
Chandrababu Properties
Heritage Story
Chandrababu Properties

http://www.okacharitra.com/tag/chandrababu-corruption-2/

ఎర్రబెల్లి చదువులేని వ్యక్తి..సి.ఎమ్. రమేష్ చీడపురుగు..

తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు తనను చీడపురుగు అనడం,పార్టీలో ఎవరు ఉండాలో తేల్చుకోవాలని అనడంపై టిడిపి ఎమ్.పి రాజ్యసభ సభ్యుడు సి.ఎమ్.రమేష్ మండిపడ్డారు.చదువు లేని వ్యక్తి దయాకరరావు అని,తాను ఆర్టికిల్ 371పై సుప్రింకోర్టుకు వెళితే ఆయనకు నష్టం ఏమిటని అన్నారు. చట్టపరమైన అంశాలు దయాకరరావుకు తెలియవని, కెసిఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించాల్సింది పోయి తమపై విమర్శలు చేయడం ఏమిటని ఆయన అన్నారు.వంద మంది దయాకరరావులు అడ్డుపడినా తమ ప్రయత్నాలు చేస్తామని,సమన్యాయం జరిగేవరకు రాష్ట్ర సమైక్యత కోసం పోరాడాతమని రమేష్ స్పష్టం చేశారు.దయాకరరావు, రమేష్ ల మధ్య మాటల యుద్దం ముదరడంతో పార్టీలో చిచ్చు తీవ్రం అయినట్లు కనిపిస్తుంది.

.తెలుగుదేశం పార్టీలో తాము ఉండాలో, రాజ్యసభ సబ్యుడు సి.ఎమ్. రమేష్ ఉండాలో తేల్చుకుంటామని తెలంగాణ టిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు స్పష్టం చేశారు. ఇలాంటి చీడపురుగులను పార్టీలో చేర్చుకోవడమే పెద్ద తప్పు అని ఆయన అన్నారు.ఇలాంటి డబ్బు ఉన్న వారిని పార్టీలో తీసుకుని, వారికి ఎమ్.పి పదవులు ఇవ్వడం వల్లనే పార్టీ నష్టపోయిందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు విభజన లేఖకు కట్టుబడి ఉన్నారని అంటూనే దయాకరరావు ఈ డిమాండ్ చేయడం విశేషం.

http://kommineni.info/articles/dailyarticles/content_20131115_15.php

http://kommineni.info/articles/dailyarticles/content_20131115_16.php

టీడీపీ నేత మధుసూదన్‌ నాయుడు అరెస్టు

తిరుపతి: తెలుగుదేశం పార్టీకి చెందిన మధుసూదన్‌నాయుడ్నిశుక్రవారం అరెస్టు చేశారు. రైస్ ఫిల్లింగ్ కు సంబంధించి అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపణలు రావడంతో అతనిపై కేసు నమోదైంది.  ఇందులో భాగంగానే ఈ రోజు పోలీసు అతన్నిఅదుపులోకి తీసుకున్నారు. వివిధ జిల్లాల్లో భారీగా వసూళ్లకు పాల్పడుతూ అక్రమాలకు చేశాడని అతనిపై ఆరోపణలు ఊపందుకున్నాయి. అతని వద్ద నుంచి విలువైన వస్తువులు, లక్ష నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా టీడీపీ నేతలు మాత్రం అతని అరెస్టును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఎమ్మార్‌పల్లి పీఎస్‌కు చేరుకున్నజిల్లా నేతలు అతన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

http://www.sakshi.com/news/andhra-pradesh/tdp-leader-madhusudan-naidu-arrested-80953


చంద్రబాబు మానసిక పరిస్థితి ఏమిటో!

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మానసిక పరిస్థితి ఆందోళన కలిగిస్తున్నదని టిఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఒక సారి రెండు కళ్ల సిద్దాంతం, మరోసారి ఇద్దరు పిల్లల సిద్దాంతం, ఇప్పుడు కొబ్బరి సిద్దాంతం అంటూ చంద్రబాబు అంటున్న తీరు చూస్తే అపరిచితుడి కన్నా వేగంగా రంగులు మార్చుతున్నారని ఆయన అన్నారు. వెంటనే చంద్రబాబు ను ఆస్పత్రిలో చేర్చాలని ఆయన అన్నారు

http://kommineni.info/articles/dailyarticles/content_20131114_24.php

Equal justice is nothing but breaking a coconut

https://www.facebook.com/photo.php?fbid=639797492726217&set=pb.309587409080562.-2207520000.1384434906.&type=3&theater

బాబు కొబ్బరికాయ న్యాయం

బాబు కొబ్బరికాయ న్యాయం
విభజనంటే గుళ్లో కొట్టిన టెంకాయలా ఉండాలి
 టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కొత్త సిద్ధాంతం

 
సాక్షి, హైదరాబాద్: భాషను పరిపుష్టం చేయడానికి తెలుగులో జాతీయాలతో పాటు కొన్ని న్యాయాలను పురాతన కాలం నుంచి కూడా విరివిగా వినియోగిస్తాం. ఇకపై వాటిల్లో విభజన విషయంలో ఎలాంటి న్యాయాలున్నాయి అని వెతుక్కోనవసరం లేదు. ఎందుకంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓ కొత్త న్యాయం ప్రవేశపెట్టారు. అదే కొబ్బరికాయ న్యాయం. దానికి ఆయన ఎలా నిర్వచనం ఇచ్చారంటే.. ‘మనలో ఎవరైనా గుడికి వెళ్లినపుడు కొబ్బరికాయ (టెంకాయ) కొడితే సమంగా పగలాలని కోరుకుంటాం. ఒకవేళ సరిగా పగలకపోతే ఏంటి ఇలా పగిలింది అని బాధపడతాం. సమానంగా పగిలితే ఆ రోజు మంచి జరుగుతుందని సంతోషపడతాం. రాష్ర్ట విభజన విషయంలో నేను కూడా ఇదే కోరుకుంటున్నాను’’ అన్నారు.
 
విభజనకు సంబంధించి 11 అంశాలపై అభిప్రాయాలు తెలపాలని జీవోఎం టీడీపీకి లేఖ రాసి సమయమిస్తే.. అదే సమయానికి అనగా.. బుధవారం ఉదయం 10.30 గంటలకు చంద్రబాబు తన నివాసంలో విలేకరుల సమావేశంలో సుదీర్ఘంగా ఆ న్యాయోపాఖ్యానం చేశారు. అంతే కాదు మళ్లీ ఆవు కథ అందుకున్నారు. ‘‘ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారు విడిపోవాలని నిర్ణయించుకుంటారు. అటువంటప్పుడు తండ్రి ఏ ఒక్కరికో న్యాయం చేయాలని చూడరు. నలుగురు పెద్ద మనుషులను కూర్చోబెట్టి ఇద్దరికీ సమన్యాయం జరిగేలా చూస్తారు. ఇపుడు నేను కోరుతున్నది కూడా అదే’’ అంటూ తండ్రి న్యాయం వల్లెవేశారు. అయితే ఈ విలేకరుల సమావేశానికి సాక్షి ప్రతినిధులను టీడీపీ అనుమతించలేదు. విశ్వసనీయ వర్గాల ద్వారా చంద్రబాబు న్యాయాలను సాక్షి సేకరించింది. ఒక వేళ అనుమతిస్తే ప్రజల తరఫున ‘సాక్షి’ ఈ ప్రశ్నలకు సమాధానం రాబట్టి ఉండేది.
 
 1. కొబ్బరికాయ న్యాయాన్ని విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖలో ఎందుకు ప్రస్తావించలేదు?
 2. సమన్యాయం అంటే రాయల తెలంగాణను ఏర్పాటు చేసి చెరో పక్క 21 పార్లమెంట్ స్థానాలు ఉండేటట్లు చూడడమా?
 3. విభజనకు అనుకూలంగా 2008లో ప్రణబ్ కమిటీకి లేఖ ఇచ్చి ఐదేళ్లు గడిచింది కదా.. ఈ కాలంలో సమన్యాయం చేసిన తర్వాతే విభ జించాలని ఎందుకు కోరలేదు?
 4. కేసీఆర్, బొత్స హోంమంత్రితో రహస్యంగా ఎందుకు భేటీ అయ్యారని ప్రశ్నిస్తున్న మీరు.. గతంలో కేంద్ర మంత్రి చిదంబరాన్ని చీకట్లో కలిసిన సంగతేంటి?

 http://www.sakshi.com/news/top-news/chandrababu-naidu-new-theory-on-state-bifurcation-80606

కనబడినవారందరికి మీకెందరు? ఇద్దరు పుత్రులా ...

ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ ప్రయోజనం ఆశించే నిర్ణయాలు తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కె.తారకరామారావు అన్నారు చంద్రబాబు కు ఈ విషయం తెలియదా , ఆయన డిల్లీలో ఎందుకు దీక్ష చేశారో , అప్పుడు ఎందుకు అఖిల పక్ష సమావేశం పిలవాలని కోరలేదా?అని ఆయన అన్నారు.ఇప్పుడు అఖిలపక్ష సమావేశం పెడితే మొహం చాటేశారని అన్నారు. ఆయనకు ఒక్కరే కొడుకని,కాని కనబడినవారందరికి మీకెందరు? ఇద్దరు పుత్రులా అంటూ అసంబధ్దమైన ప్రశ్నలు వేస్తున్నారని అన్నారు.ప్రజాప్రతినిధులను, రాజకీయ పార్టీలను కాకుండా జెఎసిలను,ప్రజాసంఘాలను పిలవాలని అనుకుంటే రాజకీయ పార్టీలు ఎందుకు ,టిడిపి ఎందుకు?ప్రధాన ప్రతిపక్ష హోదా ఎందుకు,ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఎందుకు ? అని కెటిఆర్ ప్రశ్నించారు. జెఎసిలనే ఎన్నికలలో నిలబెట్టి తెలుగుదేశం తప్పుకుంటుందా అని ఆయన అన్నారు.కేవలం తప్పించుకోవడానికే తప్ప జెఎసిల పై ప్రేమ ఉండి కాదని ఆయన అన్నారు. తెలుగు జాతికి సమన్యాయం పేరుతో ఇరు ప్రాంతాల తెలుగువారికి సమ మోసం చేస్తున్నదని అన్నారు. కేంద్రం పదకుండు అంశాల వారిగా వైఖరులు అడిగితే టిడిపి తప్ప అన్ని పార్టీలు అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారని అన్నారు.రాజ్యాంగ విరుద్దంగా ప్రక్రియ జరుగుతున్నదంటూ రాష్ట్రపతికి లేఖ రాసిన చంద్రబాబు ఆ అన్యాయం ఏమిటో ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పగలరా అని అన్నారు. అందరిని దూషించడం తప్ప ఒక విధానం లేకుండా చంద్రబాబు ఉన్నారంటే ఎంత దురవస్థ లో ఉన్నారో అర్ధం అవుతుందని అన్నారు. టిఆర్ఎస్ పై కూడా లేనిపోని మాటలు మాట్లాడారని, చంద్రబాబు లాగా చీకటి రాజకీయాలు చేయడం లేదని కెటిఆర్ స్పష్టం చేశారు.తమ దారిలోకి వస్తేనే కాంగ్రెస్ ,టిడిపిలతో పొత్తు పెట్టుకున్నామని అన్నారు.చంద్రబాబు జూలై ముప్పైనాడు కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్,అజాద్ లకుఫోన్ చేసి తెలంగాణను ఆపాలని కోరలేదని ప్రమాణం చేయగలరా అని కెటిఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పడుతుంటే అక్కసుతోనే టిఆర్ఎస్ పై నిందలు మోపుతున్నారని,తమకు అవసరం లేదని ఆయన అన్నారు.గతంలో నరేంద్ర మోడీని తీవ్రంగా విమర్శించిన చంద్రబాబు,ఇప్పుడు బిజెపితో పొత్తు కోసం తహతహలాడడం లేదా? అని చంద్రబాబును ఆయన విమర్శించారు.కెసిఆర్ తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన నాయకుడు అయితే, చంద్రబాబు మామను వెన్నుపోటు పొడిచి ,టిడిపిని కాంట్రాక్టర్ల పార్టీగా మార్చిన వ్యక్తి అని అన్నారు.టిఆర్ఎస్ పై చిల్లరమల్లర ఆరోపణలు చేస్తున్నారని,ఒక్కదానిని అయినా రుజువు చేయగలవా అని ఆయన ప్రశ్నించారు.

http://kommineni.info/articles/dailyarticles/content_20131113_10.php#.UoOD6lejyuI.facebook

జీఓఎం లో లేనిది ఆడియో ఫంక్షన్ లో ఏముంది?

Prathinidhi audio function (42)
TDP అధినేత చంద్రబాబు నాయిడు ఎప్పుడు రాజకీయాలకు మాత్రమే పరిమితం అయ్యేవారు. అలాంటి ఆయన ఈరోజు సరదాగా గడిపారు. ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడి తనయుడు నారా రోహిత్ కొత్త సినిమా ఆడియో ఫంక్షన్ కి ఆయన హాజరయ్యారు.
ఆయన రాకతో అక్కడ మొత్తం హడావిడి చేశారు. నాని తో కూడా ఆయన కొద్ది సేపు మాట్లాడారు. సీడీ ని ఆవిష్కరించిన ఆయన, మొట్టమొదటి సీడీ ను రోహిత్ కి ఇచ్చారు.
ఇది ఇలా ఉంటే, అక్కడికి వచ్చిన వారు మాత్రం, ఈయన GOM కి వెళ్లలేదు కాని ఆడియో ఫంక్షన్ కి రావడం ఏంటి అని అనుకున్నారు.

http://www.telugupost.com/%E0%B0%9C%E0%B1%80%E0%B0%93%E0%B0%8E%E0%B0%82-%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B2%E0%B1%87%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%86%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B-%E0%B0%AB%E0%B0%82%E0%B0%95/