నిజాయితీని బాబు పట్టించుకోలేదు

బాబు మోసం చేశాడు
=1999లో ఎమ్మెల్యే టికెట్టు ఇస్తానని ఇవ్వలేదు
 =2004లో నా భార్యకు బలవంతంగా టికెటిచ్చారు
 =ఆమె ఓడిపోవడంతో ఉన్న ఉద్యోగమూ పోయింది
 =నా నిజాయితీని బాబు పట్టించుకోలేదు
 =పార్టీలో గుర్తింపు లేకుండా చేశారు
 =వేపంజేరి మాజీ ఎమ్మెల్యే గాంధీ

 
పలమనేరు, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం నిజాయితీగా, నిబద్ధతతో పనిచేశానని, పార్టీలో సముచిత స్థానం కల్పించకుండా తనను, తన కుటుంబాన్ని చంద్రబాబు మోసం చేశారని వేంపజేరి మాజీ ఎమ్మెల్యే ఆర్. గాంధీ ఘాటుగా విమర్శించారు. పలమనేరు నియోజకవర్గంలోని పెద్దవెలగటూరులో శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.

అనంతరం పలమనేరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. 1994లో వేపంజేరి ఎమ్మెల్యేగా పనిచేశానని, చంద్రబాబుకు ప్రధాన అనుచరునిగా ఉన్నానని చెప్పారు. అయితే చంద్రబాబు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండు కళ్ల సిద్ధాంతమని, సమన్యాయమని ఆయన చెప్పిందానికల్లా అడ్డు చెప్పకుండా పోతే ఓకే అని, అలా కాదంటే తర్వాత ఎవరినీ పట్టించుకోరని విమర్శించారు. చంద్రబాబు వైఖరితో రాజకీయంగా ఎంతో నష్టపోయానన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా ఓడిపోతే ఆపై ఎందుకు కొరగాకుండా చూడడం ఆయన నైజమన్నారు.

1999లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని ఆపై మోసం చేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న తన భార్యకు 2004లో చంద్రబాబు టికెట్ ఇచ్చారన్నారు. ఈ వ్యవహారం తనకు తెలియకుండా జరిగిందని, తమ కుటుంబంలో ఆయన చిచ్చుపెట్టే విధంగా వ్యవహరించి రాజకీయం నడిపిన ఘనుడని గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఎన్నికల్లో తన భార్య ఓటమి చెందిందని, ఎన్నికల్లో పోటీచేయడంతో ఉన్న ఉద్యోగం కూడా కోల్పోయి ఎంత ఇబ్బంది పడ్డామో ఆయనకేమి తెలుసన్నారు.

తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం దశాబ్దాలుగా పాటుపడినందుకు ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని వాపోయారు. తెలుగుదేశం పార్టీలో బాబుకు నమ్మకస్తునిగా మెలిగానని, అయితే ఆయన  తనను అసలు పట్టించుకోలేదన్నారు. జేబులో చంద్రబాబు బొమ్మలేకుండా బయటకు వెళ్లలేదన్నారు.  హైదరాబాద్‌లో తన బైక్‌కు సైతం పసుపు రంగు కొట్టించి చంద్రబాబు ఫొటోతో తిరిగేవాడినని తన ఆవేదనను వ్యక్తం చేశారు. అలాంటి నమ్మకంగా వ్యవహరించిన తనకు గుర్తింపు లేనప్పుడు ఎందుకు పార్టీలో ఉండాలని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర సమైక్యత విషయంలో ఆ పార్టీ విధానాలు అసలు నచ్చలేదన్నారు. మొత్తం మీద ఈ కారణాలతో తాను ఆ పార్టీని వీడానన్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడమే ఉత్తమమని నిర్ణయించుకొనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే టికెట్‌లు ఆశించి పార్టీలో చేరలేదని స్పష్టం చేశారు. సాధారణ కార్యకర్తలా పార్టీ బలోపేతానికి కృషిచేస్తానన్నారు.

2004 ఎన్నికల్లో తన భార్య ఓటమి చెందినప్పుడు తిరిగి ఉద్యోగం కావాలని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని కలసి పరిస్థితిని వివరించానన్నారు. తాను ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడినైనా ఆయన సాయం చేశారన్నారు. అందుకే తనకు వైఎస్ అంటే వల్లమాలిన అభిమానమన్నారు. తాను పార్టీలో చేరినందున తనపై కూడా ప్యాకేజీ తీసుకున్నాననే ఆరోపణలు టీడీపీ నేతలు చేసే అవకాశం ఉందన్నారు.

తాను ఆనాడు వైశ్రాయ్ హోటల్‌లో బాబు వద్ద ప్యాకేజీలు తీసుకున్నట్లు చెప్పుకున్నారని, అదెంత నిజమో ఇప్పుడు తాను వైఎస్సార్‌సీపీ వద్ద ఏదైనా పుచ్చుకున్నాననే విషయంలోనూ అంతే నిజముంటుందని ఘాటుగా విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా నాయకులు అమరనాథ రెడ్డి, మనోహర్, నారాయణ స్వామి, ఆదిమూలం, కేశవులు, వినయ్‌రెడ్డి, సునీల్, సీవీ కుమార్, హేమంత్, సుధా, వంగపండు ఉష తదితరులున్నారు.

http://www.sakshi.com/news/andhra-pradesh/he-was-betrayed-92639

మనిషివా? చంద్రబాబువా?

బాబును మనిషిగా గుర్తించడం లేదు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు తీరును, మాటలను చూస్తున్నవారంతా ఆయన్ను మనిషిగానే గుర్తించడం లేదు. ఎవరినైనా తిట్టాలనుకుంటే.. మనిషివా? చంద్రబాబువా? అని తిడ్తున్నరు’’ అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు విమర్శించారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ అంటే తెలుగు దళారుల పార్టీగా మారిందని దుయ్యబట్టారు. రాష్ట్రపతిని కలవడానికి బాబు ఒంటరిగా ఎందుకు పోయినట్టు? రాష్ట్రపతితో రహస్యంగా జరిపిన మంతనాలేమిటీ? అని ప్రశ్నించారు. రెండు ప్రాంతాలకు న్యాయం కావాలని అడగడానికి చంద్రబాబు నిజంగానే పోతే ఆయా ప్రాంతాల నాయకులను ఎందుకు వెంట తీసుకుపోలేదని నిలదీశారు.


http://www.sakshi.com/news/andhra-pradesh/dont-recognise-chandrababu-as-human-says-ktr-92383

బురిడీ కొట్టించే యత్నాలు

చంద్రబాబుకు మస్కా!
సాక్షి ప్రతినిధి, గుంటూరు :‘ఇంటింటికీ దేశం’ కార్యక్రమంలో జిల్లా నేతలు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు మస్కా కొట్టారు. పార్టీకి దూరమైన నాయకులను కలుపుకునేందుకు, కొత్తవారిని చేర్చుకునేందుకు, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు రూపొందించిన ఈ కార్యక్రమాన్ని నామమాత్రంగా చేపట్టారు. అధినేత ఎంతో పటిష్టంగా రూపకల్పన చేసిన ఈ కార్యక్రమాన్ని  నేతలు భ్రష్టు పట్టించారనే విమర్శలు లేకపోలేదు. సీనియర్లు ఉన్న నియోజకవర్గాల్లో కొంత వరకు జరిగినా, మిగిలిన నియోజకవర్గాల్లో చడీచప్పుడు లేకుండా ముగిసింది. నవంబరు 15 నుంచి ఈ నెల 25 వరకు జరిగిన ఈ కార్యక్రమం దినపత్రికల్లో ఫొటోలకు పరిమితం అయింది.
 
 వార్తలకు సంబంధించి దినపత్రికల కటింగ్‌లను  పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపి జిల్లాలో పెద్ద ఎత్తున జరిగిందనే భ్రమ కల్పించారు. మొత్తం 40 రోజుల్లో పార్టీకి దూరమైన ముఖ్య నేతలను కలుపుకునే ప్రయత్నాలుగానీ, ఇతర పార్టీల్లోని ముఖ్యనేతలను టీడీపీలో చేర్చుకున్న దాఖలాలుగానీ లేవు. దీనికితోడు పార్టీకి సహకరించడం లేదనే కారణం చూపి 15 మందిని సస్పెండ్ చేయాలని తూర్పు ని యోజకవర్గ నేత తీసుకువచ్చిన ప్రతిపాదనపై సీనియర్లు మండిపడుతున్నారు. జిల్లాలో 17 అసె ంబ్లీ నియోజకవర్గాల్లో ఐదారింటి లో కూడా నేతలు దీనిని ప్రతిష్టాత్మకంగా చేపట్టలేదు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సైతం తన చిలకలూరిపేట నియోజకవర్గంలో నామమాత్రంగానే చేపట్టినట్టు తెలుస్తోంది. మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో ఎక్కువగా కార్యక్రమాన్ని చేపట్టలేదని, అధినేత సూచించిన విధంగా రాత్రి వేళ కార్యకర్తల నివాసాల వద్ద విశ్రాంతి తీసుకుని మర్నాడు అక్కడి నుంచే కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంటే, ఆ విధంగా జరగలేదని కార్యకర్తలే చెబుతున్నారు.
 
 దండిగా కరపత్రాలు,పోస్టర్లు
 పెదకూరపాడు నియోజకవర్గంలో కొమ్మాలపాటి శ్రీధర్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టకుండా, దానితోపాటు ఒకటి రెండు కార్యక్రమాల్ని మండలాల్లో ఏర్పాటు చేసుకుని అన్నింటినీ పూర్తిచేసి, వాటన్నింటినీ ఇంటింటికీ దేశం కార్యక్రమంగా వాడుకున్నట్టు తెలుస్తోంది. క్రోసూరు, అచ్చంపేట, పెదకూరపాడు మండలాల్లోని పెద్ద గ్రామాల్లో చేపట్టి, బెల్లంకొండ వంటి దూరాభారమైన ప్రాంతాల దరికి ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్లలేదని తెలుస్తోంది. కరపత్రాలు, పోస్టర్లు మాత్రం దండిగా నియోజకవర్గంలో కనపడే విధంగా చేశారు. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక్కో నియోజకవర్గంలో ఐదారు డివిజన్లకు మించి ఈ కార్యక్రమం జరగలేదని తెలుస్తోంది. తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి ఎస్‌ఎం జియావుద్దీన్ పర్యటించిన రాజీవ్‌గాంధీ నగర్‌లో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఒక మహిళ ఆయన చాలా రోజుల తరువాత డివిజన్‌కు రావడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది. మీరంతా మమ్మల్ని పట్టించుకోకపోవడంతో వైఎస్సార్‌సీపీలో చేరిపోయామని, మేం ఏ పార్టీలో ఉన్నామో కూడా తెలియని స్థితిలో నేతలున్నారని ఆమె వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
 
 బురిడీ కొట్టించే యత్నాలు
 కొంతమంది నేతలు అధినేతను బురిడీ కొట్టించే యత్నాలు చేశారు. ఇంటింటికీ దేశం కార్యక్రమాన్ని ఒక డివిజన్‌లో చేపట్టినప్పుడు ఆ కార్యక్రమాన్ని నాలుగైదు యాంగిల్స్‌లో ఫొటోలు తీసి, వాటిని రెండు మూడు రోజులపాటు దినపత్రికలకు పంపి ప్రచురితం అయ్యే విధంగా చేశారనే ఆరోపణలు లేకపోలేదు. దినపత్రికల కటింగ్స్‌ను పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీకి నేరుగా పంపి, తాము జిల్లాలో పార్టీ పటిష్టతకు కృషి చేసినట్టు బిల్డప్ ఇచ్చారని ఆ పార్టీ కార్యకర్తలే అంటున్నారు.కొత్త, పాత చేరికలు లేవు.. ఈ కార్యక్రమం ద్వారా కొత్తవారిని, స్వల్ప వివాదాల కారణంగా పార్టీని వీడిన వారిని చేర్చుకోవాలని అధినేత సూచించారు. అయితే అటువంటి ప్రయత్నాలు పెద్దగా జరగకపోగా, పశ్చిమ నియోజకవర్గంలో తనను వ్యతిరేకిస్తున్న 15 మంది నేతలపై చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి జియావుద్దీన్ డిమాండ్ చేస్తున్నారు. ఉన్నవారినీ వదులుకుంటే పార్టీ బతికేదెలా అని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. 

http://www.sakshi.com/news/andhra-pradesh/tdp-leaders-not-attending-chandrababu-naidu-dream-programme-in-guntur-district-91999?pfrom=home-top-story

అవమానిస్తున్నారంటూ తమ్ముళ్ల ఆవేదన

టీడీపీలో జనం గోల
=తెలుగుదేశం పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులకు ప్రత్యేక టార్గెట్
 =వీడియో చిత్రీకరిస్తామని హెచ్చరికలు
 =అవమానిస్తున్నారంటూ తమ్ముళ్ల ఆవేదన

 
సాక్షి, తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తిరుపతిలో ఈనెల 29వ తేదీన చేపట్టనున్న ఎన్నికల శంఖారావం  సభ జిల్లాలోని నేతలకు తలనొప్పిగా మారింది. సభకు తప్పనిసరిగా జనసమీకరణ  చేపట్టాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని అధిష్టానం నుంచి ఆదేశాలు రావడం, జిల్లా  నాయకులను ఆవేదనకు గురి చేస్తోంది. జన సమీకరణ కోసం ఆ పార్టీ ఎమ్మెల్యే ముద్దు కృష్ణమనాయుడు జిల్లావ్యాప్తంగా పర్యటిస్తూ, నాయకులకు టార్గెట్‌లు ఇస్తున్నారు.

రాష్ట్ర, జిల్లా నాయకులు టార్గెట్ తగ్గకుండా జనాన్ని తీసుకు రావాలని, ఆవిధంగా తీసుకు రాని వారిపై చర్యలు తీవ్రంగా ఉంటాయని  హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  జిల్లా స్థాయి నాయకుడు 500 మందికి తక్కువ కాకుండా తీసుకుని రావాలని, రాష్ట్ర నాయకులు వెయ్యి నుంచి రెండువేల మందిని తీసుకుని రావాలని ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి నుంచి, నగర ఇన్‌చార్జి చదలవాడ కృష్ణమూర్తికి కూడా 30 వేల మందిని సేకరించాలని సూచించినట్లు తెలిసింది. ఎంత మంది జనాలను సమీకరించారనేవిషయంపై వీడియో చిత్రీకరణ  ఉంటుందని, తక్కువ మందిని తీసుకుని వస్తే తీవ్రంగా పరిణామాలు ఉంటాయని జిల్లా నాయకులకు హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు తెలిసింది.

బుధవారం తెలుగుదేశం బూత్ లెవెల్ కమిటీ సమావేశం జరగ్గా, ఈ సమావేశంలో ముద్దుకృష్ణమ నాయుడు, చదలవాడ కృష్ణమూర్తి పాల్గొని, జన సమీకరణపై సూచనలు ఇచ్చారు. సమీకరణ చేయని వారిపట్ల పార్టీ కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పడంతో, తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పది సంవత్సరాలుగా అధికారంలో లేక పోయినా, పార్టీ కోసం డబ్బు ఖర్చు చేస్తూ, కష్టపడి పని చేస్తున్నా, తమపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, అవమానిస్తున్నారని నాయకులు బాధపడుతున్నారు. తమపై నమ్మకం లే క వీడియో చిత్రీకరణ చేయడం సబబు కాదని, పార్టీకి చెందిన జిల్లా నాయకుడు ఒకరు తెలిపారు.

జన సమీకరణ చేయకపోతే, తమ పదవులు తీసేస్తామని ముద్దుకృష్ణమ నాయుడు హెచ్చరికలు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో పార్టీలో ఎలా కొనసాగాలని కూడా ప్రశ్నిస్తున్నారు. ముద్దుకృష్ణమ నాయుడు 2004లో పార్టీ అధికారం కోల్పోగానే, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారని గుర్తు చేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆయనకు సీటు ఇవ్వక పోవడంతో, మళ్లీ తెలుగుదేశంలోకి వచ్చారని ఆరోపించారు. పార్టీ అధికారంలో ఉన్నా, లేక పోయినా, పార్టీ కోసం కష్టపడుతున్న తమపై ఆయన పెత్తనం చెలాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఎన్నికల శంఖారావం జరుగనున్న మున్సిపల్ హైస్కూలు మైదానంలో 30 వేల మందికి మించి పట్టరు. అయితే లక్ష మంది సభకు రానున్నారని తెలుగుదేశం నాయకులు పేర్కొంటున్నారు. చంద్రబాబు నాయుడు 29వ తేదీన ఉదయం తిరుపతికి చేరుకుని, నేరుగా తిరుమలకు వెళ్లి, సాయంత్రం మూడు గంటలపైన తిరుపతికి వస్తారని, ఎన్నికల శంఖారావం ప్రారంభిస్తారని తెలిసింది.

http://www.sakshi.com/news/andhra-pradesh/people-who-want-more-91800

వలసలను ఆపుకోవడానికే బిజెపితో పొత్తు ఉంటుందని చంద్రబాబు ప్రచారం

బిజెపి రాష్ట్ర శాఖ అద్యక్షుడు కిషన్ రెడ్డి టిడిపితో పొత్తుకు ససేమిరా అంటున్నారు. ఆయన టిడిపి అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలకు దిగడానికి వెనుకాడడం లేదు.తెలుగుదేశం నుంచి వలసలను ఆపుకోవడానికే బిజెపితో పొత్తు ఉంటుందని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.తమకు ఎవరితో పొత్తు ఉండదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.తాము ఎవరితో పొత్తు పెట్టుకోబోమని చెప్పడం వేరు, చంద్రబాబును విమర్శించడం వేరు.టిడిపి పరిస్థితి తెలంగాణలో బాగోలేదని ఆయన తెగేసి చెబుతున్నారు.

జగనబ్బాయ్! నీ ఆటలు ‘నాట్ బిఫోర్’ బాబు!

ఉపాయం ఉంటే చాలు ఎంతటి అపాయాన్నయినా ఇట్టే దాటెయ్యవచ్చు.
ఈ కిటుకు చంద్రబాబుకి తెలుసు. ఆయన పగవాడికి తెలియదు.
అదే బాబుగారి అసలు అదృష్టం.
అనగా అనగా నారాబాబు, జగన్‌బాబు అని ఇద్దరు శత్రువులు. ఒకడు తెలివిగలవాడు. రెండోవాడు అది కొంచెం తక్కువైనవాడు. ఇద్దరూ ఒకరిమీద ఒకరు ఒకే రకమైన అస్త్రాన్ని గురిచూసి వదిలారు. ఒకరి ఫ్లాష్‌బ్యాకుని ఒకరు కెలికి, అర్జంటుగా సిబిఐ ఎంక్వయిరీ వేయించాల్సిందేనంటూ ఒకే హైకోర్టుకు వెళ్లారు. కోర్టువారు ఇద్దరికీ సమాన న్యాయంచేసి, ఎవరు కోరిన ఎంక్వయిరీని వారికి మంజూరు చేశారు.
దాంతో - బద్ధ విరోధులిద్దరికీ ఒకే రకమైన ఆపద వచ్చింది.
ఋషిమూలం, నదిమూలంలాగే నాయకుడి మూలాన్ని కూడా తొంగి చూడకపోవటమే మంచిది. తవ్వటం మొదలుపెడితే ఎముకలు, అస్థిపంజరాలు ఎన్ని బయట పడతాయో, ఎన్ని తిప్పలు తెచ్చిపెడతాయో ఎవరికి ఎరుక? చట్టం చూపును గతంవైపు పోనివ్వకపోవటమే నేతాశ్రీలకు క్షేమం.
సో! ఎలాగైనా సిబిఐ చెడు దృష్టి తమమీద పడకుండా చూసుకోవాలి. అది ఎలా? హైకోర్టు ఆర్డరును ఆపించాలంటే దాని పైకోర్టుకే పోవాలి అని ఎవరైనా చెబుతారు. తెలివి లేనివాడు... అందరిలాగే ఆలోచించి, అందరూ చేసే పనే చేశాడు. ఎగస్పార్టీవాళ్లు కుట్ర చేసి మమ్మల్ని సతాయించటానికే అన్యాయంగా ఎంక్వయిరీ వేయించారు, దాన్ని ఉన్నపళాన ఆపించాలి అంటూ సుప్రీంకోర్టుకు మొత్తుకున్నాడు.
తెలివిగలవాడూ అదే పనిచేశాడు. కాని నేరుగా కాదు. ఇండైరక్టుగా! తాను వెనక ఉండి, అన్నీ జాగ్రత్తగా సెట్ చేశాక, తన శంఖుచక్రాలనూ, అవరోధ వ్రాతాలనూ పంపి సుప్రీంకోర్టులో కేసు వేయించాడు. సరిగ్గా తన పగవాడి ఆర్గ్యుమెంటునే అటూ ఇటూ మార్చి వన్స్‌మోర్‌గా వినిపించాడు.
పై కోర్టువారు కూడా ఇరు పక్షాలకూ సమాన న్యాయం (లేక ‘అన్యాయం’) చేశారు! ఇక్కడికెందుకొచ్చారు, చెప్పాల్సిందేమన్నా ఉంటే కింది కోర్టుకే వెళ్లి చెప్పుకోమన్నారు. దాంతో సీను మళ్లీ హైకోర్టుకు మారింది.
తెలివి తక్కువవాడు గోడకు కొట్టిన బంతిలా హైకోర్టుకు తిరిగొచ్చి, వెనకటి బెంచ్ దగ్గరికే మళ్లీ వెళ్లి, వెనకటి రికార్డునే మళ్లీ వినిపించాడు. ప్రాథమిక విచారణని ఆపించమని అతడు వేడుకుంటే, కోర్టు వారేమో ఏకంగా పూర్తిస్థాయి విచారణకే ఆర్డరు వేసి అతగాడికి మరిన్ని చికాకులు తెచ్చిపెట్టారు. చిక్కులు చుట్టుముట్టేకొద్దీ ఆ కుర్రవాడు రెచ్చిపోయి ఎల్లో మీడియానూ, గురివింద సిండికేట్లనూ పడతిట్టిపోస్తూ, కోర్టులనూ, కుమ్మక్కులనూ ఒళ్లుమండేలా అధిక్షేపిస్తూ, అనకూడని వారి గురించి, అనకూడని సమయంలో, అనకూడనిది అంటూ, బంటుల చేత అనిపిస్తూ ఉక్రోషంతో ఆక్రోశిస్తున్నాడు.
మరి తెలివిమీరిన వాడో? అలాంటి పిచ్చి పనులు ఏమీ చెయ్యలేదు. అతడిదంతా గెరిల్లా పద్ధతి. ఒడుపుచూసి అడుగు వేస్తాడు. కీలెరిగి వాత పెడతాడు.
చంద్రబాబు మంచి పనిమంతుడు. గొప్ప రాజకీయ క్రీడాకారుడు కూడా! పొలిటికల్ కారమ్ బోర్డు మీద స్ట్రైకరును ఎటుతిప్పికొడితే ఎటో ఉన్న రెడ్డో, దాని వెనుక బడ్డో ఎలా పాకెట్లో పడతాయో ఆయనకు భలేగా తెలుసు. పైగా బాబు పంచతంత్రంలోని దీర్ఘదర్శికి చదువు చెప్పగలిగినవాడు. ఇప్పటి తన పగవాడి డాడీలాగే నాయుడు కూడా చాలా ఏళ్లు రాజ్యమేలాడు. అనే్నళ్లూ ‘ఆ రెండు పత్రికలు’, ‘ఈ మూడు ముఠాలు’ అంటూ డైలాగులు కొడుతూ కూచోలేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న పాలిసీతో ఏ క్షేత్రానికా క్షేత్రంలో పనికొచ్చే విత్తనాలను చల్లాడు. అవే ఇప్పుడు విరగపండి ఏ రంగానికారంగంలో అవసరానికి ఆదుకుంటున్నాయి.
సుప్రీంకోర్టు స్టే ఇస్తుందో లేదో సందిగ్ధం కనుక ఎందుకైనా మంచిదని తెర వెనకే ఉండి కథ నడిపించిన బాబు, హైకోర్టుకు పోవచ్చని అక్కడ సెలవయ్యేసరికి ఈలవేస్తూ ముందుకొచ్చాడు. వాటమెరిగి పావులు కదిపాడు. న్యాయరంగంలో ఆయన ముందు జాగ్రత్తతో వెలిగించిన జ్యోతులూ సమయానికి అక్కరకొచ్చి కాగలకార్యాన్ని తిరుగులేని వ్యూహం ప్రకారం తీర్చాయి.
పవిత్రమైన కేసు పడగూడని వాళ్ల చేతుల్లో పడితే కొంపలంటుకుంటాయి. పాముల నోట పడకుండా తప్పించుకుంటూ కోరిక తీర్చే పెద్దనిచ్చెనను చేరుకుంటేగానీ జాక్‌పాట్ తగలదు. దానికి అదృష్టాన్ని నమ్ముకుని లాభం లేదు. ప్రణాళిక వెయ్యాలి. పాచిక విసరాలి. తెలుగుదేశం కన్న తండ్రి మీదే కోర్టుకెక్కి పార్టీ, జండా, గుర్తు, ఆస్తులు అన్నీ తనవేనని ‘జయప్రదంగా’ అనిపించుకోగలిగిన కౌటిల్యుడికి ఆఫ్టరాల్ ఒక ఎంక్వయిరీ ఉత్తర్వును ఎత్తివేయించటం ఒక లెక్కా?
భారతంలో కృష్ణుడు భీష్ముడి దగ్గరికే ధర్మరాజును పంపించి, తమరిచేత అస్తస్రన్యాసం చేయించటం ఎలా అని కూపీలాగించాడు. బాబు అండ్ కో అంతకంటే ఘనులు. ఏ ‘నాట్ బిఫోర్’ శిఖండిని అడ్డంపెడితే ఏ బెంచి చేతులెత్తేస్తుందో ముందే గ్రహించి, ఆయా శిఖండులను ఆయా సమయాలకు రెడీచేసి, అనుమానపు బెంచిలను పక్కకు తప్పించి, ప్రాప్తమున్న తీరానికి కేసు పడవను ఝామ్మంటూ లాక్కుపోయారు. మొత్తానికి కార్యం సాధించారు.
మీరు ఫలానా కేసులో ఎగస్పార్టీకి మేలు చేశారు. కాబట్టి ఈ కేసులోనూ మాకు కీడే చేస్తారు. మాకు నమ్మకం లేదు కాబట్టి మీరు కేసు తీసుకోకండి - అంటూ ఆ బాలుడు అడ్డదిడ్డంగా వాదిస్తూ తీరికూర్చుని జడ్జిలకు ఒళ్లు మండిస్తూంటే - ఈ గోపాలుడు న్యాయవ్యవస్థలోని ఉత్తమ సంప్రదాయాన్ని అడ్డంగా వాడుకుని, కులదైవాల అండతో, బంటు మీడియా వెంట్రిలాక్విజంతో కోరిన వరాన్ని సైలంటుగా కొట్టేశాడు. విరోధిమీద సిబిఐ ఎంక్వయిరీ పడితే, ‘స్టే’కెందుకు రంధి, విచారణకు నిలబడి నిజాయతీ నిరూపించుకోరాదా’ అని సవాలు విసిరిన బాబు అలాంటి ఎంక్వయిరీయే తన మీద పడేసరికి మిన్ను, మన్ను ఏకం చేసి, పద్మవ్యూహం పన్ని, ఎలాగైతేనేం అబేయన్సు అభయం పొందాడు.
దటీజ్ బాబు! అందుకే జగనబ్బాయ్! నీ ఆటలు ‘నాట్ బిఫోర్’ బాబు!




చేయాల్సిన పనెల్లా.. రకరకాల ఐడీలతో చంద్రబాబు అనుకూల భావజాలాన్ని...

మీకు ఓ పాత సంగతి గుర్తు చేయాలి. ఎన్నికల్లో ఓట్లు వేయడానికి బ్యాలెట్‌ పేపర్ల స్థానే మెషిన్లను ప్రవేశపెట్టిన తొలి  సందర్భంలో రాష్ట్రంలోని మెజారిటీ సామాన్య జనులు ‘ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు గెలిచి తీరుతాడని’ పల్లెలో రచ్చబండల దగ్గర కూడా పందేలు వేసుకున్నారు. ఓటు అనేది ‘మనం కాగితం మీద వేయకుండా.. మెషిన్లో వేస్తే.. ఆ మెషిన్లు.. వాటికి తగిలించే కంప్యూటర్లు కచ్చితంగా చంద్రబాబు మాట మాత్రమే వింటా’యని ప్రజలకు ఓ తీవ్రమైన నమ్మకం ఉండేది. చంద్రబాబు మీద అనుమానం, ద్వేషం, వ్యతిరేకత వలన వచ్చిన మాట కాదది.. టెక్నాలజీ అంటేనే దాన్ని తనకు అనుకూలంగా వాడుకోవడంలో చంద్రబాబును మించిన వాడు లేడనేది.. ఆ ప్రజల నమ్మకంగా ఉండేది. కానీ పాపం ఆ ఎన్నికల్లో చంద్రబాబు బ్యాలెట్‌ బాక్స్‌ ముందు బోల్తా పడ్డారు. 
ఒకసారి బోల్తా కొట్టినంత మాత్రాన చంద్రబాబు టెక్నాలజీలో వెనుకబడిన నాయకుడనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఆయన ఎన్నటికీ టెక్నాలజీ ప్రియుడు. ఇవాళ్టికి కూడా సైబర్‌ టవర్స్‌ భవనాన్ని చూసుకుని.. తాను తీసుకువచ్చిన ఐటీ పరిశ్రమకు ఇది సంకేతం అని ఆయన మురిసిపోతూ ఉంటారు. సదరు టెక్నాలజీ ప్రియత్వం అనేది ఆయన ఇప్పటికీ నిరూపించుకుంటూనే ఉన్నారు. రాజకీయంగా మంచిరోజులు ఇంకా రాలేదు గానీ.. టెక్నాలజీని ఔపోసన పట్టి.. సద్వినియోగం చేసుకోవడం మాత్రం.. చంద్రబాబుకు చేతనైనంతగా మరెవ్వరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. చిన్న ఉదాహరణ చూస్తే.. ఇవాళ్టి మన రాష్ట్రంలోని అగ్రశ్రేణికి చెందిన రాజకీయ నాయకుల్లో ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ల ద్వారా.. తన అభిప్రాయాలను ప్రపంచంతో పంచుకోవడంలో.. చంద్రబాబు అందరి కంటె అగ్రశ్రేణిలో ఉంటారన్నది కూడా నిజం. 
మతలబు : చంద్రబాబు సాంకేతిక రుబాబు!
చంద్రబాబుకు ఉన్న ఎడ్వాంటేజీ ఏంటంటే.. కొడుకు కూడా అంతో ఇంతో టెక్‌ కిడ్‌ కావడం. సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలోకి కాలిడిన ఒక తరం, ఒక వర్గం వారు ఆయనకు ఈ విషయంలో గట్టి దన్నుగానే ఉంటున్నారు. 
ఇదంతా పాజిటివ్‌ ఎండ్‌. చంద్రబాబు సాంకేతిక ప్రియత్వంలో మరో రుబాబు కూడా దాగి ఉంది. నెటిజన్లు, టీవీ ఛానెళ్లు, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్ల ద్వారా.. జనంలోకి తన అభిప్రాయాలను తీసుకువెళ్లడంలో మాత్రం చంద్రబాబు ముందంజలో ఉన్నారు. 
ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేకమైన టీంను పనిచేయిస్తూ ఉంటుందన్నది పార్టీలో కొందరు చెప్పే సంగతి. వీరంతా పార్టీ తరఫు ఉద్యోగులు. తెలుగుదేశం పార్టీకి అనుకూలుడు, ఆప్తుడు అయిన ఓ ఐటీ పారిశ్రామిక వేత్త.. ఈ బృందాన్ని నిర్వహిస్తుంటారు. వీరు చేయాల్సిన పనెల్లా.. నెటిజన్లలో చంద్రబాబు అనుకూల భావజాలాన్ని ప్రచారం చేస్తుండడమే. రకరకాల ఐడీలతో వివిధ వెబ్‌సైట్లు, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో వీరు 24I7 అందుబాటులో ఉంటారు. నిత్యం ఎవరితోనూ ఒకరితో సంభాషిస్తూ ఉంటారు. చంద్రబాబు అనుకూల భావజాలాన్ని అదే సమయంలో జగన్‌, కాంగ్రెసు, తెరాస వ్యతిరేకతను వీరు ప్రచారం చేస్తూ ఉంటారు. 
సాధారణంగా ఇంటర్నెట్‌లోకి వెళ్లాం అంటే.. చంద్రబాబు అనుకూల ప్రచారం చాలా విస్తృతంగా ఉంటుంది. నవతరం కుర్రకారులో ఇంతమంది తెదేపాకు అనుకూలంగా ఉన్నారా... అని మనకు అనుమానం కలుగుతూ ఉంటుంది. కానీ అందులో మతలబు ఏంటంటే.. వారంతా జీతం పుచ్చుకుని ప్రచారం చేస్తూ ఉంటారన్నమాట. సాధారణ ప్రజలేమో.. ఇదంతా తెదేపాకు నెటిజన్లలో ఉన్న క్రేజ్‌ కింద భ్రమ పడుతూ ఉంటారు. 
అందులోనూ చాలా చిన్నెలున్నాయ్‌...
తెలుగుదేశం తరఫున ఇలాంటి ప్రత్యేక బాధ్యతలలో పనిచేస్తుండే వారు చేసే పనులు చాలానే ఉంటాయిట. అనగా ఫరెగ్జాంపులో ప్రతి ఉదయం టీవీ ఛానెళ్లలో డిస్కషన్‌ షోలు వస్తుంటాయి. ఆ సందర్భంగా ఎస్సెమ్మెస్‌ పోల్‌లను కూడా నిర్వహిస్తుంటారు. ఆ పోల్‌లు చంద్రబాబుకు సంబంధించిన అంశాల మీద ఉన్నట్లయితే గనుక.. అప్పుడు ఉంటుంది మజా! ఎలాగంటే.. పోల్‌ ప్రారంభం అయినప్పుడు.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎక్కువ ఓట్‌ శాతం నమోదు అవుతూ ఉంటుంది. అయితే.. కాసేపటికే.. ఈ తెలుగుదేశం బృందం జూలు విదిల్చి నిదుర మేల్కొంటుంది. వెంటనే వారి ఎస్సెమ్మెస్‌ బాణాలు వెల్లువెత్తుతాయి. పోల్‌ పర్సంటేజీలు మారిపోతూ వస్తాయి. జనాభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ.. వీలైనంత వరకు వాటిని ఎంచక్కా చంద్రబాబుకు అనుకూలంగా, లేదా తటస్థంగా మార్చేసేలా.. వారు ఎస్సెమ్మెస్‌లు కుమ్మేస్తుంటారన్నమాట.
మొత్తానికి చంద్రబాబు ప్రజల హృదయాల్లో ఎంత మేరకు నిశ్చలంగా ఉన్నారో లేదో మనకు తెలియదు గానీ.. నెటిజన్లలో మాత్రం.. చాలా ముమ్మరంగానే.. కీర్తి ప్రతిష్టలను గడిస్తూ ఉంటారు. అయితే అవన్నీ స్వయంకృత, స్వయం ప్రసాదిత కీర్తి, యశస్సులనే సంగతి ఆయనకు తెలుసు. జనానికి ఎప్పటికి తెలుస్తుందో మరి. 

పాపిష్టి పనులకు కేరాఫ్ చంద్రబాబే!

పాపిష్టి పనులకు కేరాఫ్ చంద్రబాబే!
హైదరాబాద్: ‘ఒకరోజు ఓ జడ్జి నా దగ్గరికి వచ్చి కంట నీరు పెట్టుకున్నాడు. తెలుగుదేశం పార్టీ ఎన్‌టీఆర్‌దేనని ఇంటికొచ్చి జడ్జిమెంటు రాయించుకున్నారని, అంతకంతా తాను అనుభవిస్తున్నట్లుగా చెప్పి ఏడ్చాడు. నేను పెట్టిన తెలుగుదేశం పార్టీ ఎన్‌టీఆర్‌దని తీర్పు చెప్పినందుకు 1985 మధ్యంతర ఎన్నికల్లో ఆ జడ్జికి ఎమ్మెల్యే టిక్కెట్టు, మంత్రి పదవి ఇచ్చి మాజీ సీఎం జలగం వెంగళరావు ఇంటి ముందు నివాసం పెట్టించారు’ అంటూ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను పెట్టిన పార్టీకి ఇప్పుడు అధినేతగా ఉన్న చంద్రబాబు తనపై మతిలేని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏనాడూ సత్యం చెప్పకుండా పాపిష్టి పనులు చేయడంలో చంద్రబాబును మించినవారు లేరని విమర్శించారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాస్కరరావు మాట్లాడారు. ఇటీవల చంద్రబాబు స్పీకర్ నాదెండ్ల మనోహర్, తనపై చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ... ‘ స్పీకర్ రాజ్యాంగ బద్ధుడు. రాష్ట్రపతి, గవర్నర్ తరహాలో స్పీకర్ కూడా రాజకీయాలతో సంబంధం లేకుండా పనిచేస్తారు. రాష్ట్రపతి పంపిన నోట్‌ను స్పీకర్‌గా అసెంబ్లీలో ప్రవేశపెట్టడం ఆయన విధి. అసలు ఆర్టికల్ 365 గురించి నీకు తెలుసా? రాష్ట్రంలో పీవీ నరసింహారావు ప్రభుత్వంపై మాత్రమే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ఆర్టికల్‌ను ఉపయోగించారు’ అని చెప్పారు. 

రాష్ట్ర విభజనకు సంబంధించి చంద్రబాబు సమన్యాయం అంటున్నాడని.. సమన్యాయం అంటే కృష్ణా నదిని ఆ పక్కనుంచి ఈ పక్కకు రెండుగా చీల్చి సమంగా పంచుతారా? అని ప్రశ్నించారు.
http://www.sakshi.com/news/andhra-pradesh/nadendla-bhaskara-rao-blames-chandrababu-naidu-for-division-89916?pfrom=home-latest-story

టీడీపీ నేత ఇంట్లో 102 ఓట్లు

 కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ నాయకుల బోగస్ ఓట్ల దందా బయటపడింది. సాక్ష్యాత్తు డివిజన్ అధ్యక్షుడు నివాసం ఉన్న ఇంటి నంబర్ మీద 102 ఓట్ల్లు నమోదు చేయించి బోగస్ ఓట్లకు రికార్డు సృష్టించాడు. విషయం తెలుసుకున్న ఇతర పార్టీ నాయకులు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వాటిని తొలగించేందుకు కసరత్తులు ప్రారంభించారు.

 
 కేపీహెచ్‌బీ డివిజన్ పరిధిలోని సాయినగర్‌లో గల ఫ్లాట్ నంబర్ 48 ఇంటి నంబర్ 16-2-153/ఇ  లో టీడీపీ డివిజన్ అధ్యక్షుడు నారాయణ రాజు నివాసముంటున్నారు. అదే ఇంటిపై వివిధ ప్రాంతాల్లో ఉంటున్న 102 మందికి ఓటు హక్కు ఉంది. ఓటరు లిస్ట్‌లో పేర్లను చూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఓటర్ లిస్ట్‌లో 367వ పోలింగ్ కేంద్రంలో ఈ ఓట్లు నమోదయ్యాయి. దాంతో మునిసిపల్ అధికారులు ఆ ఇంట్లో తనిఖీలు ప్రారంభించారు.

http://www.sakshi.com/news/andhra-pradesh/bogus-votes-in-telugu-desam-party-leader-house-in-hydrabad-88747

చంద్రబాబు రక్తపిపాసి...

చంద్రబాబు రక్తపిపాసి.. చర్చకు సై: కేసీఆర్వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధిపై చంద్రబాబుతో ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు తాను సిద్ధమని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సవాలు విసిరారు. ఎన్ కౌంటర్ల పేరుతో వందలాది మంది యువకుల ప్రాణాలు తీసిన రక్తపిపాసి చంద్రబాబేనని, అవినీతికి ఆయన మారుపేరని మండిపడ్డారు. దాని ఫలితంగానే అలిపిరి దాడి జరిగిందని అన్నారు. తన గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని, బహిరంగ చర్చకు వస్తే తన చరిత్ర ఏంటో, చంద్రబాబు చరిత్ర ఏంటో తేలిపోతుందని అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం తాను కేంద్ర మంత్రిపదవిని కూడా గడ్డిపోచలా వదిలేస్తే బాబు మాత్రం పదవి కోసం మామకే వెన్నుపోటు పొడిచాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాగానే లోకేశ్, బ్రహ్మణి, భువనేశ్వరి.. ఇలా అందరి పేర్ల మీద ఉన్న బినామీ భూములన్నింటినీ కక్కిస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు తనతో మాట్లాడినట్లు కేంద్ర మంత్రి చిదంబరమే స్వయంగా చెప్పారని, కాంగ్రెస్ తో కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నది బాబేనని కేసీఆర్ విమర్శించారు.

''ఫాంహౌస్ లో పడుకుంటా, నా ఇష్టం. నీకేం బాధ? కావాలంటే నువ్వు కూడా రా.. నీకేం అభ్యంతరం? కావాలంటే వారం రోజులుంటా, వ్యవసాయం చేసుకుంటా. నాకు వచ్చిన పనేంటో చూసుకుంటా. రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి చెప్పి మరీ నేను ఆమరణ దీక్షకు దిగాను. చంద్రబాబు ఢిల్లీలో ఎందుకు దీక్ష చేశాడో చెప్పగలడా? ఒక్కోసారి ఒక్కోమాట చెబుతావు. ప్రణబ్ ముఖర్జీకి లేఖ ఇచ్చింది నువ్వు కాదా? ఉప ఎన్నికల్లో 12కు 12 స్థానాల్లోనూ డిపాజిట్లు పోయినా ఇంకా బుద్ధి రాలేదా? ఇలాంటి దొంగలకు ప్రజలు మరోసారి అవకాశం ఇస్తారా?'' అని కేసీఆర్ అడిగారు.

http://www.sakshi.com/news/andhra-pradesh/iam-ready-for-open-debate-wich-chandra-babu-naidu-says-k-chandra-sekhar-rao-87537?pfrom=home-top-story

Whom Do you believe?

https://www.facebook.com/photo.php?fbid=651647631541203&set=a.375213312517971.82316.309587409080562&type=1&relevant_count=1

కాపాడకపోతే అసలు ఇప్పుడు రాష్ట్ర విభజన అంశం ఉండేదా?


చంద్రబాబు అవిశ్వాస తీర్మానం లో కాంగ్రెస్ నీ కాపాడకపోతే అసలు ఇప్పుడు రాష్ట్ర విభజన అంశం ఉండేదా?? 
కాంగ్రెస్ మీద అవిశ్వాసం పెట్టి పడగొట్టాలని చూసింది YSRCP.. కాంగ్రెస్ ని అవిశ్వాసంలో కాపాడింది TDP..



https://www.facebook.com/photo.php?fbid=652508491455117&set=a.375213312517971.82316.309587409080562&type=1&relevant_count=1

plz answer this babu!

https://www.facebook.com/photo.php?fbid=652096111496355&set=a.375213312517971.82316.309587409080562&type=1&relevant_count=1

TDP leader faces embarrassment

TDP leader Gali Muddukrishnama Naidu addressing students at Puttur on Sunday. Photo: Umashanker Kalivikodi
The Hindu
TDP leader Gali Muddukrishnama Naidu addressing students at Puttur on Sunday. Photo: Umashanker Kalivikodi

Telugu Desam Party (TDP) senior leader and Nagari MLA Gali Muddukrishnama Naidu experienced embarrassing moments when school girls, whom he was addressing as part of Samaikyandhra agitation, at Puttur on Sunday, clapped profusely whenever he uttered the names of Y.S. Rajasekhara Reddy and Jaganmohan Reddy, though his objective was to make allegations against them.
Local TDP leaders mobilised about 200 girl students from private schools at Puttur in the morning and they converged at the Ambedkar circle. Blocking the traffic for a while, the TDP cadres started addressing the girls, while a small crowd too was present. Whenever the cadres mentioned the names of YSR and Jagan, the girls clapped and shouted in a frenzied mood, without allowing them to complete the words meant to criticise them.
When Muddukrishnama Naidu’s turn came, he spoke eloquently about the hard work the Seemandhra people have put in to develop Hyderabad since six decades. No sooner than he began criticising YSR and Jaganmohan Reddy for allegedly cheating people and amassing wealth, the girl students took to hooting and clapping without letting Mr. Muddukrishnama Naidu complete the sentences. As it did not seem to end, he switched over to Sonia Gandhi, blaming her for State bifurcation for political gains to which the girls remained silent.
Though the meeting failed to completely serve the purpose, it surely managed to elicit laughter among the passersby.
http://www.thehindu.com/news/national/andhra-pradesh/tdp-leader-faces-embarrassment/article5439405.ece?fb_action_ids=656655101051184&fb_action_types=og.likes&fb_source=other_multiline&action_object_map=%5B254784688011033%5D&action_type_map=%5B"og.likes"%5D&action_ref_map=%5B%5D

Chandrababu missed the last chance in 2009?

https://www.facebook.com/photo.php?fbid=673741375994053&set=a.588711407830384.1073741827.588704751164383&type=1&theater

చంద్రబాబు అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ ని కాపాడకపోతే రాష్ట్ర విభజన జరిగేదా ??

https://www.facebook.com/photo.php?fbid=674450572589800&set=a.588710867830438.1073741826.588704751164383&type=1&theater

Do you believe that Chandrababu ruined Telugu people’s life in last 2 decades?




https://www.facebook.com/photo.php?fbid=649978421708124&set=a.375213312517971.82316.309587409080562&type=1&theater

మీరు చేస్తే ఒప్పు,అవతలి వారు చేస్తే తప్పా ?

విజయమ్మ గారు బైబిల్ పట్టుకుని తిరిగితే మత ప్రచారం అని అన్నారు ... ఆవిడ ధైర్యం కోసం బైబిల్ పట్టుకుని పర్యటనలు చేసిన ఎ రోజు కూడా ఆ మతాన్ని కించపరిచే విధం గా ప్రవర్తించలేదు మరియు బైబిల్ కి ఎక్కడ అమర్యాద కలిగించలేదు...జగన్ మోహన్ రెడ్డి గారు కానీ,షర్మిల గారు కానీ,విజయమ్మ గారు కానీ.. హిందు దేవాలయాలకు వెళ్ళినా,చర్చి కు వెళ్ళినా,మసీదు కు వెళ్ళినా భక్తి తో శ్రద్ధగా వెళ్తారు...ఎ మతాన్ని కించపరిచే విధంగా ప్రజల మనోభావాలు దెబ్బ తినే విధంగా ప్రవర్తించరు ...జగన్ ను,విజయమ్మ గారిని ,షర్మిల గారిని మత ప్రచారం చేస్తున్నారు అని గొంతు చించుకునే తెలుగు తమ్ములు ఈ ఫోటో లో ఉన్న మురళి మోహన్ చేస్తున్న పని ఏంటి చెప్పగలరా ?? పవిత్రమైన అయ్యప్ప దీక్ష లో ఉండి పాధరక్షణలు వేసుకుని ఆయప్ప భక్తులను,ఆయప్ప స్వామి నిష్టలను కించపరచడం ఏంటి ??? పవిత్రమైన దీక్ష లో ఉండి అపవిత్రమైన పనులు చేయడం ఎందుకు ? ఈ ముసుగు దీక్ష లు చేయడం ఎందుకు ?? విజయమ్మ గారు బైబిల్ పట్టుకుని తిరిగితే మత ప్రచారం అయితే...మురళి మోహన్ అయ్యప్ప దీక్ష లో ఉండి పాదయాత్ర చేయడం కూడా మత ప్రచారమే కదా ???? మీరు చేస్తే ఒప్పు,అవతలి వారు చేస్తే తప్పా ??? చేసే పని,చెప్పే మాట,నిలిచే నెల సాక్షి గా ప్రజల శ్రేయస్సు కోరి ఉండాలి....నాటకాలు కాదు....జోహార్
https://www.facebook.com/photo.php?fbid=634794316584545&set=a.417366834993962.103115.100001619485065&type=1&theater

fixing the match with Congress

Chandrababu giving directions to Congress to divide the state.. Do you believe that Babu is playing this game, after fixing the match with Congress?

చంద్రబాబు కొబ్బరికాయ సిద్దాంతాన్ని కాంగ్రెస్ అమలు చేస్తుంది.. ఇది కుమ్మకు కాదా??

వెన్నుపోటు అంటే ఏంటి? గూగుల్ ని అడిగి చూడండి

వెన్నుపోటు అంటే ఏంటి? గూగుల్ ని అడిగి చూడండి
ఆనాడు తండ్రిని బంధించి, తమ్ముళ్ళను చంపిన ఔరంజేబుని , ఈనాటి చంద్రబాబు మించి పోయాడు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి, పదవి లాక్కుని, విలువలు లేవని తిట్టి, చనిపోయేలా చేసి, ఇప్పుడు అదే ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుని జనాలని మోసం చేస్తున్న చంద్రబాబుని నమ్ముతారా?

https://www.facebook.com/DontVoteForTdp

https://www.facebook.com/photo.php?fbid=672086462826211&set=a.588711407830384.1073741827.588704751164383&type=1

Chandrababu's regime had more media HYPE than substance!

YSR started a new University in every district. In total 18 new Universities were established apart from specialized Universities during Dr. YSR's Goldlen Era. In contrast, Chandrababu's regime had more media HYPE than substance!
https://www.facebook.com/photo.php?fbid=649086775130622&set=a.375213312517971.82316.309587409080562&type=1&relevant_count=1

సాగు నీరడిగితే.. ఎమ్మెల్యే సీటెందుకు ఇవ్వాలన్నారు

విజయవాడ :
 జిల్లాను వేదికగా చేసుకున్న చంద్రబాబు మరో హైడ్రామాకు తెరలేపారు. తన హయాంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు కృష్ణా జలాల కోసం ఆందోళన చేయడంపై రైతులు మండిపడుతున్నారు. తప్పు చేసి ఒప్పుకోని చంద్రబాబు ఉనికికోసం పడుతున్న ఆరాటంలో భాగంగానే బుధవారం  నగరంలో ఉద్యమం చేపడుతున్నారని రైతులు విమర్శిస్తున్నారు. వ్యవసాయం దండగ.. దానికి సబ్సిడీలు, పెట్టుబడులు అనవసరం.. రైతులు ఇతర రంగాలకు తరలిపోవాలంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. బాబు హయాంలో జిల్లాలో రైతులు సాగునీటికి కటకటలాడాల్సిన దుస్థితి దాపురించింది. ఎంతసేపు హైటెక్ ముఖ్యమంత్రిగా కీర్తించుకున్న ఆయన  దేశానికి పట్టెడన్నం పెట్టే అన్నదాతల అవస్థలు పట్టించుకోలేదన్న విమర్శలను మూటగట్టుకున్నారు.
 
 బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో కృష్ణా జలాల విషయం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఇదే అదనుగా బాబు సరికొత్త వ్యూహాలకు పదునుపెట్టి మరోమారు విమర్శలపాలవుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డారు. ఇప్పుడు కృష్ణా జలాల విషయమై ఆందోళనకు దిగి సమైక్యవాదులను దారిమళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన.. నీటి రాజకీయానికి రంగులద్ది తన లోపాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేయడంతో రైతులు విమర్శిస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ప్రాజెక్టులు నిర్మించి ఉంటే మిగులు జలాలపై మనకు కూడా హక్కు, సాగుకు భరోసా ఉండేదని రైతులు చెబుతున్నారు.
 
 తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను కూడా బాబు తుంగలో తొక్కేయడం విమర్శలకు తావిస్తోంది. పులిచింతల ప్రాజెక్టుకు ఎన్టీఆర్ శంకుస్థాపన చేయగా.. చంద్రబాబు దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దీంతో వైఎస్ జలయజ్ఞంతో నిర్మాణం చేపట్టిన సంగతిని రైతులు గుర్తుచేస్తున్నారు.
 
 బాబు హయాంలో సాగునీటి సమస్య..
 జిల్లాకు చంద్రబాబు పాలనలోనే సాగునీటి విడుదలలో తీవ్ర జాప్యం జరిగింది. ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్సార్‌లు సైతం జిల్లాకు సాగునీటిని సకాలంలో అందించి రైతాంగానికి మేలు చేశారు. నాగార్జునసాగర్‌లో డెడ్‌స్టోరేజ్ ఉన్న సమయంలోనూ  అనుకున్న సమయానికే నీరిచ్చిన ఘనత వారికి దక్కింది. బాబు చివరికి సకాలంలో నీరివ్వకుండా చేసి రైతులు సాగుపై ఆశ వదులకునేలా  వ్యవహరించారన్న విమర్శలున్నాయి.
 
 సాగు నీరడిగితే.. ఎమ్మెల్యే సీటెందుకు ఇవ్వాలన్నారు..
 వ్యవసాయ రంగంపై ఆధారపడిన జిల్లాలో పలువురు ప్రజాప్రతినిధులు సైతం వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినవారే.  వారు సాగు నీరివ్వాలని అడిగినందుకు తరువాతి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వాలంటూ ఇబ్బందులు పెట్టిన ఘనచరిత్ర బాబుకు ఉంది. 2003లో సెప్టెంబర్ 15 వరకు సాగు నీరివ్వకపోవడంతో రైతులు పెద్దఎత్తున ఉద్యమించారు. శివారు ప్రాంతంగా ఉన్న కృష్ణా డెల్టాను కాదని మహబూబ్‌నగర్‌లోని జూరాలకు సాగునీరిచ్చిన అప్పటి టీడీపీ ప్రభుత్వం విమర్శలపాలైంది. అప్పట్లో రైతు నాయకులు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, ఎర్నేని నాగేంద్రనాథ్ తదితర ముఖ్యులతోపాటు అప్పటి ఎమ్మెల్యే సీతాదేవి సైతం సాగునీటికోసం సాగిన ఉద్యమంలో పాల్గొన్నారు.  సుమారు 10 వేల మందికిపైగా రైతులతో సాగిన అతిపెద్ద ఉద్యమంలో పాల్గొన్న టీడీపీకి చెందిన సీతాదేవి సాగునీరిచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న బాబు 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ల పంపిణీలో చివరి నిమిషం వరకు టెన్షన్ పెట్టి సీతాదేవికి ముదినేపల్లి సీటిచ్చారు. సాగునీటి కోసం రైతుల పక్షాన పోరాడిన పలువురు తెలుగుదేశం నాయకులపై కూడా బాబు ఆగ్రహించారని రైతు నాయకులు ఇప్పటికీ చెబుతారు. సాగు నీటి విడుదల ఆలస్యం చేయడం అనే పద్ధతిని బాబు కాలం నుంచే మొదలైందని రైతులు వాపోతున్నారు.
 
 ఎన్టీఆర్ స్ఫూర్తి ఏదీ..
 నందమూరి తారక రామారావు పురిటిగడ్డ కృష్ణా జిల్లా విషయంలో చంద్రబాబు ఎప్పుడూ నిర్లక్ష్యంగానే వ్యవహరించారని ఎన్టీఆర్ అభిమానులు వాపోతుంటారు. శివారు ప్రాంతంగా ఉన్న ఈ జిల్లా ముంపు బారిన పడకుండా 1984లో ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన డ్రైనేజీ బోర్డు తగు చర్యలు తీసుకునేది. ఈ బోర్డును రద్దుచేసిన బాబు నీటి వినియోగదారుల సంఘాలను ఏర్పాటుచేశారు. నీటి పంపిణీ విషయంలో వినియోగదారుల సంఘాలు ఎలా ఉన్నా, డ్రైనేజీ బోర్డు రద్దుతో మురుగు డ్రైన్లు ప్రక్షాళనకు నోచుకోక ముంపు సమస్య ఎక్కువైంది. ఇలా ఎన్టీఆర్ చేపట్టిన అనే సాగునీటి సంస్కరణలపై బాబు నీళ్లు చల్లారు. చివరకు జిల్లా రైతాంగానికి మద్దతు ధర సాధించడంలోను బాబు విఫలమయ్యారు. చంద్రబాబు హయాంలో కేంద్ర ప్రభుత్వం ధాన్యం మద్దతు ధర క్వింటాలుకు రూ.60 (12శాతం) పెంచితే, అదే వైఎస్ కాలంలో రూ.550 నుంచి రూ. 1000 (82) శాతానికి పెంచింది. ఇలా చెప్పుకుంటే బాబు వ్యవసాయ రంగానికి జల వనరులను అందించడంలో పూర్తిగా విఫలమయ్యారు. మరి ఇప్పుడు ఆయన చేపట్టే దీక్షను రైతులు ఎలా నమ్ముతారన్నది చంద్రబాబుకే ఎరుక

http://www.sakshi.com/news/andhra-pradesh/chandra-babu-naidu-playing-cheap-politics-85600

Whom Do you believe

https://www.facebook.com/photo.php?fbid=648697758502857&set=a.375213312517971.82316.309587409080562&type=1&relevant_count=1

నాడు నిద్రపోయి... నేడు వైఎస్‌పై నిందలేస్తున్న చంద్రబాబు

ఎవరి తప్పు ఎంత?http://www.sakshi.com/news/editorial/chandrababu-naidu-spreading-lies-over-krishna-waters-85393?pfrom=home-top-story

  • నాడు నిద్రపోయి... నేడు వైఎస్‌పై నిందలేస్తున్న చంద్రబాబు
  •  1995-2004 మధ్య తన హయాంలో కర్ణాటక ప్రాజెక్టులు కడుతున్నా పట్టించుకోని బాబు
కృష్ణా మిగులు జలాలు రాష్ట్రానికి దక్కకుండా చేసే, ఆ రకంగా ఉభయ ప్రాంతాల మధ్య వివాదం తలెత్తకుండా.. రాష్ట్ర విభజనకు సహకరించేలా బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్  ఇచ్చిన తీర్పుపై చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించకుండా.. తన దాడిని చనిపోయిన రాజశేఖరరెడ్డిపై కేంద్రీకరించడం ఓ వింత. ఈ వింతలో.. తాను అధికారంలో ఉండగా నిద్రపోవడమే కాకుండా, ఈ దారుణానికి తానే కారణమన్న నిజాన్ని దాచేందుకు కూడా బాబు ప్రయత్నిస్తున్నారు. తన హయాంలో కర్ణాటక చేపట్టిన ఆలమట్టిలాంటి ప్రాజెక్టులను బాబు అడ్డుకోలేకపోయూరు. రాష్ట్రంలో తాను ఎలాంటి ప్రాజెక్టులూ చేపట్టకపోగా ఎన్టీఆర్ ప్రభుత్వం పిలిచిన టెండర్లు సైతం రద్దు చేశారు. వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలోనే అనేక సాగునీటి ప్రాజెక్టులు చేపట్టడమే కాకుండా రూ.వేల కోట్లు వెచ్చించారు. నాటి చంద్రబాబు నిర్వాకాలు, ప్రాజెక్టుల నిర్మాణానికి వైఎస్ పడిన తపనపై సాక్షి కథనం..
 
సాక్షి, హైదరాబాద్: ‘ఫస్ట్ ఇన్ టైమ్, ఫస్ట్ ఇన్ రైట్’.... ఈ అమెరికన్ చట్ట స్ఫూర్తిని ఎక్కడైనా జలవివాదాలకు సంబంధించి ఒక ప్రామాణికంగా తీసుకుంటారు. వినియోగంలో ముందున్నవారికి హక్కులోనూ ప్రాధాన్యతముంటుందని దీని అర్థం. కృష్ణా జలాలపై ఏర్పడిన బచావత్ ట్రిబ్యునల్ సహా దేశంలోని వివిధ ట్రిబ్యునళ్లు ఈ మేరకే వ్యవహరించాయి. ఒక నదిపై ముందే ప్రాజెక్టులు కట్టుకుని వాటి ఆధారంగా జీవిస్తున్న ప్రజలకు ముందుగా రక్షణ కల్పించాలన్నదే ఆ సూత్రంలోని పరమార్థం.
ఆ విధంగానే 1973లో బచావత్ అప్పటికే నీటిని వినియోగించుకుంటున్న ప్రాజెక్టులను అనుమతించారు. కొత్త ట్రిబ్యునల్ కూడా అదే తీరున వ్యవహరిస్తుందనే వాస్తవాన్ని మనకు ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలు బాగా గ్రహించాయి. అందుకే బచావత్ ట్రిబ్యునల్ గడువు ముగిసే 2000 లోపు కొత్త ట్రిబ్యునల్ ఏర్పడిన 2004 లోపు అనేక ప్రాజెక్టులను శరవేగంగా నిర్మించుకున్నాయి. అప్పట్లో రాష్ట్రాన్ని పాలించిన తెలుగుదేశం ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడుకు  ఇదేమీ పట్టలేదు. ప్రాజెక్టులను గాలికొదిలేశారు.
కృష్ణా మిగులు జలాల వినియోగంపై మనకున్న స్వేచ్ఛను కాపాడుకోవటానికి  ప్రాజెక్టులు నిర్మించాలన్న ప్రతిపక్షాల డిమాండ్లను కూడా తేలికగా తీసుకున్నారు. ఫలితం.. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ రాష్ట్రానికి శరాఘాతం వంటి తీర్పునిచ్చింది. ఈ శాపానికి ప్రధానకారకుడైన చంద్రబాబు వూత్రం యథావిధిగా ప్రజలను మభ్య పెట్టేందుకు దీనికీ వైఎస్ రాజశేఖరరెడ్డే కారకుడంటూ ఓ విచిత్రవాదనను ఎత్తుకున్నారు. లేఖలకూ, దీక్షలకూ దిగుతున్నారు!
 
కర్ణాటక ముందుచూపు.. బాబు వెనుకచూపు
కర్ణాటక 2004 నాటికల్లా తమ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు 1996లోనే కర్ణాటక సాగునీటి సంస్థ (నీరావరి నిగమ లిమిటెడ్) ఏర్పాటు చేసింది. కృష్ణా నదిపై నారాయణపూర్, ఆలమట్టి వంటి వందల టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులన్నింటికీ విరివిగా నిధులిచ్చింది. కేంద్రం నుంచీ నిధులు సాధించింది. నిధుల కొరత కారణంగా ప్రాజెక్టులు ఆగరాదని ప్రజలకు బాండ్లు జారీచేసి, నిధులు సమీకరించి వురీ ప్రాజెక్టుల్ని వేగంగా నిర్మించుకుంది. బ్రిడ్జ్ కమ్ బ్యారేజీల నిర్మాణాన్ని ఉద్యమస్థాయిలో చేపట్టింది, పూర్తి చేసింది కూడా. 1995-2004 మధ్య, అంటే మన రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉన్న రోజుల్లోనే కావడం గమనార్హం. కర్ణాటక 2005, ఆ తర్వాత కూడా ప్రాజెక్టుల్ని పూర్తి చేయటం, చిన్నాచితకా ప్రాజెక్టుల్ని చేపట్టటం జరిగింది.  2004 నాటికే దాదాపుగా ఆ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, నీటి నిల్వ పథకాలన్నీ పూర్తయ్యాయి. తన ఇల్లు చక్కబెట్టుకున్న కర్ణాటక ఇంకోవైపు ప్రాజెక్టులు కట్టకుండా మన రాష్ట్రాన్ని నిలువరించేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ చంద్రబాబు ఆ విలువైన సవుయుంలో కర్ణాటకలో ప్రాజెక్టులను ఆపలేకపోయారు. కనీసం మన రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టలేకపోయారు. కృష్ణా మిగులు జలాలను వినియోగించుకునేందుకు ఉద్దేశించిన హంద్రీనీవా, గాలేరు-నగరి, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు, తెలుగుగంగ ప్రాజెక్టులను 2004 నాటికి పూర్తిచేసి ఉంటే వీటన్నింటికీ తప్పకుండా హక్కు దక్కి ఉండేది. కర్ణాటక, వుహారాష్ట్ర నిర్మించుకున్న ప్రాజెక్టుల సావుర్థ్యాన్ని, వాటి ఎత్తును బ్రిజేశ్‌కువూర్ ట్రిబ్యునల్ సవుర్థించడమే ఇందుకు నిదర్శనం.
 
చంద్రబాబు నిర్వాకానికి ఇవే సాక్ష్యాలు!
హంద్రీ-నీవాసుజల స్రవంతి
ఇది తరచుగా కరువువాత పడే కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో సాగునీటి సదుపాయం కోసం ప్రతిపాదించిన ప్రాజెక్టు. 1998 మే నెలలో పరిపాలక అనుమతి లభించింది. కానీ ఐదేళ్లకు 2003-04 బడ్జెట్‌లో చంద్రబాబు కేవలం రూ.14 కోట్లు కేటాయించారు. ఇవి పరిపాలన వ్యయూనికే సరిపోలేదు.
 
వెలిగొండ
ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 4.38 లక్షల ఎకరాల సాగుకు, 29 మండలాల్లోని 15 లక్షల మందికి తాగునీటికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు 43.5 టీఎంసీల కృష్ణా వరద జలాలను మళ్లించాల్సి ఉంటుంది. 1995 నవంబర్‌లోనే కేంద్ర జలమండలికి ప్రాజెక్టు రిపోర్టు సమర్పించారు. దీనికి 2003-04లో రూ.5 కోట్లు కేటాయించారు. ప్రాజెక్టు సిబ్బంది జీతభత్యాలకూ ఇవి చాలలేదు.
 
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం
మహబూబ్‌నగర్ జిల్లాలో 25 టీఎంసీల నీటితో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 3.2 లక్షల మందికి తాగునీరు ఇచ్చేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు అంచనాలను 2002 ఆగస్టులో సమర్పించారు. 14.05.2003న జీవో నెంబరు 65తో రూ.1500 కోట్ల అంచనా వ్యయానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. 2003-04లో ఏఐబీపీ (ఏక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ (సత్వర సాగునీటి ప్రయోజన కార్యక్రమం) నిధుల కింద కేవలం రూ.15 కోట్లు, బడ్జెట్‌లో రూ.25 కోట్లు కేటాయించారు.
 
నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం
మహబూబ్‌నగర్ జిల్లాలో 2 లక్షల ఎకరాల సాగునీరు, 148 గ్రామాలకు తాగునీరు ఇచ్చేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు 20 టీఎంసీలు అవసరమని అంచనా. 1997 డిసెంబరులో ప్రాజెక్టు రూపకల్పనకు రూ. 5 కోట్లు కేటాయించింది. అక్టోబరు 2000లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక సమర్పించారు. 12.11.03న మరో నివేదిక సమర్పించారు. 2003-04 బడ్జెట్‌లో ఈ పథకానికి రూ. 5 కోట్లు కేటాయించారు.
 
తెలుగు గంగ
29 టీఎంసీల కృష్ణా వరద జలాలు, 30 టీఎంసీల పెన్నా వరద జలాల వినియోగంతో కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటు తమిళనాడు అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు ఇది. 2004 నాటికి రూ.1758 కోట్లు ఖర్చు చేశారు. 2004 నాటికి ఇంకా రూ.1342 కోట్ల పనులు మిగిలే ఉన్నాయి.
 
వైఎస్ చెప్పినా పట్టించుకోని బాబు!
ప్రాజెక్టులపై చంద్రబాబు నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపేందుకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అనేక ప్రయత్నాలు చేశారు. అవకాశం దొరికినప్పుడల్లా ప్రాజెక్టుల నిర్మాణ ఆవశ్యకతను తెలియజేసే ప్రయత్నం చేశారు. తద్వారా సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందని భావించారు. అయినప్పటికీ నాటి చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరవలేదు. కనీసం బాబు హయూంలోనే శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులనైనా చేపట్టాలని వైఎస్ కోరారు. కానీ చంద్రబాబు నాడు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలతోనే సరిపుచ్చారు. అంతకుమించిన దారుణం ఏమిటంటే గతంలో దూరదృష్టితో ఎన్టీఆర్ చేపట్టిన ప్రాజెక్టులను సైతం పక్కనపెట్టేశారు. ఎన్టీఆర్ హయూంలో పిలిచిన టెండర్లను కూడా రద్దు చేయడం సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు దృక్పథానికి నిలువెత్తు నిదర్శనం.
 
వైఎస్ లేఖ ఒక అనివార్యత!
ప్రస్తుతం టీడీపీ గోల చేస్తున్న ‘వైఎస్ లేఖ’కు కూడా చంద్రబాబు వైఫల్యాలే మూలం. మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కర్ణాటక 1997 మార్చి 1న సుప్రీంకోర్టుకు (కేసు నం.ఓఎస్ 1/1997) వెళ్లింది. అయితే 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ ఈ ప్రాజెక్టులను చేపట్టడం, ఆ వెంటనే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటు కావడం జరిగిపోయాయి. దాంతో మరోసారి కర్ణాటక ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు సంబంధించి ట్రిబ్యునల్ ముందు అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీం తీర్పు ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టులు చేపడుతోందని ఫిర్యాదు చేసింది. దాంతో వైఎస్ ప్రభుత్వం అనివార్యంగా ట్రిబ్యునల్‌కు లేఖ ఇవ్వాల్సి వచ్చింది. ‘మిగులు జలాలపై మాకు స్వేచ్ఛ ఉంది. ఒక హక్కుగా మేం కోరడం లేదు. అనుమతించండి’ అని వైఎస్ ప్రభుత్వం ఆ లేఖలో పేర్కొంది. దాంతో ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు యథావిధిగా కొనసాగాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. చంద్రబాబు వైఫల్యాల పుణ్యమా అని కృష్ణా ట్రిబ్యునల్ రాష్ట్రానికి నష్టదాయకమైన తీర్పు వెలువరిస్తే.. వైఎస్ లేఖకు తనదైన శైలిలో వింత భాష్యాలు చెబుతూ ట్రిబ్యునల్ నష్టదాయక తీర్పుకు వైఎస్సే కారణవుని చంద్రబాబు నిందించే ప్రయత్నం చేస్తుండటం విడ్డూరం!
 
బాబు నిర్వాకం గాలేరు నగరికి తెలుసు..
1985లో రాయలసీమ ఉద్యమ ఒత్తిడి కారణంగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1989 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్టు ప్రకటించారు. అందులో భాగంగా శేషాచల రిజర్వాయర్‌కు రూ.30 లక్షలతో శంకుస్థాపన కూడా చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 1990 ఫిబ్రవరిలో మంత్రివర్గ సమావేశంలో గాలేరు నగరికి సంబంధించిన పనుల్ని చేపట్టాలని నిర్ణయించారు. 1993లో దీనికి సంబంధించిన ప్రాజెక్టు రిపోర్ట్‌ను రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్రీరామిరెడ్డి అప్పటి సీఎం విజయభాస్కరరెడ్డికి సమర్పించారు. అనంతరం ప్రాజెక్టులో భాగమైన మిట్టకందాల డీప్ వెడ ల్పు పనులకు, గండికోట రిజర్వాయర్  తదితర పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందుకోసం రూ. 50 కోట్లను కూడా కేటాయించారు.
అనంతరం ప్రాజెక్టు నిర్మాణంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నారుు. చివరకు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 1995 డిసెంబర్ 5న గాలేరు నగరి ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పనులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. 1996లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. దాంతో గాలేరు నగరిలో భాగమైన గండికోట రిజర్వాయర్‌కు బాబు శంకుస్థాపన చేశారు. రూ.50 కోట్లను మంజూరు చేస్తున్నట్టు  ప్రకటించారు. అరుుతే ఇందుకు సంబంధించిన ఎలాంటి ఉత్తర్వులూ లేకపోవడమే విచిత్రం. ఆ తర్వాత కూడా ప్రాజెక్టు పనుల్ని పట్టించుకోలేదు. చంద్రబాబు గద్దె దిగే 2004 వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. ఎంతో విలువైన సమయం వృథా అయింది. వైఎస్ అధికారంలోకి రాగానే 2004 జూన్ 10న ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు జీవో ఇచ్చారు. ఒక్క గాలేరు నగరే కాదు హంద్రీ-నీవా, కల్వకుర్తి, నెట్టెంపాడు, వెలిగొండ వంటి అనేక ప్రాజెక్టుల విషయంలో బాబు నిర్లక్ష్యం ఇలాగే కొనసాగింది.
 
ప్రాజెక్టుల కోసం వైఎస్ యాత్ర..
సాగునీటి ప్రాజెక్టులపై బాబు నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపేందుకు ప్రతిపక్ష నేతగా వైఎస్ అనుక్షణం ప్రయత్నించారు. ఇందుకోసం ఏకంగా యాత్రనే చేపట్టారు. ఈ యాత్రలో చంద్రబాబు చేసిన శంకుస్థాపనలను గుర్తుచేస్తూ... వాటి వద్ద మొక్కలు నాటడంతో పాటు వాటికి ‘స్మృతి చిహ్నాలు’గా నామకరణం చేశారు. తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించారు. పాదయాత్ర సమయంలో కూడా ప్రాజెక్టుల ప్రాంతానికి వైఎస్ వెళ్లారు. ప్రాజెక్టుల ఆవశ్యకతను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాల్సిన అవసరాన్ని ప్రభుత్వానికి గుర్తుచేశారు. 2002 సెప్టెంబర్ 16న ఆయన యాత్రను ప్రారంభించారు. గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకానికి 1999 జూన్ 25న నాటి సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లాలోని సి.బెళగల్ వద్ద శంకుస్థాపన చేశారు. అదే ప్రాంతం నుంచి వైఎస్ యాత్రను ప్రారంభించారు. 1999లో శంకుస్థాపన చేసినప్పటికీ 2002 వరకూ ఒక్క రూపాయి కూడా నాటి చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేయలేదు. ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు చేపట్టాలని అనంతపురం జిల్లాలోని ఉరవకొండ, కనేకల్, బెలుగుప్ప, ఆత్మకూరు తదితర ప్రాంతాలను 2002 సెప్టెంబర్ 18వ తేదీన వైఎస్ సందర్శించారు. ఈ ప్రాజెక్టుకు చంద్రబాబు ఏకంగా రెండుసార్లు శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద హంద్రీ-నీవా ప్రాజెక్టు నిర్మాణానికి 1996లో ఒకసారి... 1999లో ఆత్మకూరు వద్ద మరోసారి చంద్రబాబు శంకుస్థాపనలు చేశారు. ఈ ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని వైఎస్ డిమాండ్ చేశారు. చంద్రబాబు శంకుస్థాపన చేసిన పైలాన్స్ వద్ద మొక్కలు నాటారు. కడప జిల్లాలో లక్కిరెడ్డిపల్లె అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 25 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో నిర్మించ తలపెట్టిన వెలిగల్లు ప్రాజెక్టును పూర్తిచేయాలని వైఎస్ 2002 సెప్టెంబర్ 20న గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన వేసిన చంద్రబాబు... ఒక్క పైసా నిధులను విడుదల చేయలేదని మండిపడ్డారు. 1988లో ఎన్టీఆర్ ప్రారంభించిన హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుపై ఆయన మరణానంతరం చంద్రబాబు నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ 2002 నాటికి 14 సంవత్సరాలైన సందర్భంగా... ఆక్కడి పైలాన్ చుట్టూ 14 మొక్కలను 2002 సెప్టెంబర్ 23న వైఎస్ నాటారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణ సంగతి పక్కనపెడితే.... కనీసం గతంలో ఎన్టీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులను సైతం నిర్లక్ష్యం చేయడాన్ని వైఎస్ దుయ్యబట్టారు. భవిష్యత్తులో రాబోయే నీటి ముప్పును ముందే గ్రహించిన వైఎస్... బాబు కళ్లు తెరిపించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయినప్పటికీ బాబు పట్టించుకోలేదు.
 
రాష్ట్రానికి బాబు ద్రోహం ఇలా...
  •  ‘ఫస్ట్ ఇన్ టైం, ఫస్ట్ ఇన్ రైట్’ అనే స్ఫూర్తితో, బచావత్ ట్రిబ్యునల్ గడువు ముగిసేలోపు ప్రాజెక్టులు నిర్మించాలని ఎన్టీఆర్ పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. బాబు ఆ స్ఫూర్తిని అర్థం చేసుకోలేదు. అందిపుచ్చుకోలేదు! ప్రాజెక్టులను పట్టించుకోలేదు సరికదా ఎన్టీఆర్ పిలిచిన టెండర్లనూ రద్దు చేశారు!
  •    జలవినియోగంలో ముందుంటేనే హక్కులు సాధించుకోవచ్చునని కర్ణాటక యుద్ధప్రాతిపదికన ఆలమట్టి వంటి ప్రాజెక్టులు చేపడితే... ఆ వేగమెందుకో చంద్రబాబు అర్థం చేసుకోలేదు. అడ్డుకోలేదు. సరికదా కేంద్రంలోని అప్పటి ఎన్డీయే ప్రభుత్వంలో చక్రం తిప్పే స్థాయిలో తనూ పరోక్షంగా ఆ రాష్ట్రానికి సాయపడ్డారు!
  •    పాత ట్రిబ్యునల్ గడువుకు నాలుగేళ్ల ఏళ్ల ముందు కాలం, గడువు ముగిశాక కొత్త ట్రిబ్యునల్ ఏర్పడటానికి పట్టిన మరో 4 ఏళ్ల వ్యవధి.. అంటే 1996-2004లో కర్ణాటక, మహారాష్ట్రలు ప్రాజెక్టులపై ఇబ్బడిముబ్బడిగా నిధుల్ని వెచ్చించాయి. ప్రాజెక్టుల్ని నిర్మించుకోవాల్సిన విలువైన అవకాశాన్ని మన రాష్ట్రం కోల్పోయిందీ ఈ కాలంలోనే. బాబు పాలనాకాలమూ అదే.
  •    ప్రాజెక్టుల నిర్మాణ ఆవశ్యకత గురించి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంత ఎలుగెత్తినా... చరిత్రహీనుడవుతావంటూ హెచ్చరించినా... పెండింగ్ ప్రాజెక్టుల వద్ద మొక్కలు నాటినా... చంద్రబాబు కళ్లు తెరుచుకోలేదు.
  •    తనకు ప్రాజెక్టుల నిర్మాణం చేతగాకపోగా... 2004 తరువాత వైఎస్ చేపట్టిన జలయజ్ఞానికి కూడా చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడే ప్రయత్నం చేశారు.
 
 బాబు మార్కు స్ఫూర్తి ఇదీ..
 కర్ణాటక 300 టీఎంసీల సామర్థ్యంతో ఆలమట్టిని  నిర్మిస్తుంటే దాన్ని నిలువరించలేని చంద్రబాబు అనంతపురం జిల్లా హద్దుల్లో 300 ఎంసీఎఫ్‌టీ స్థాయిలో నిర్మించే ఓ చిన్న చెరువులాంటి పరగోడు ప్రాజెక్టును రచ్చ చేయటానికి ప్రయత్నించారు. పరిటాల రవిని ఉసిగొల్పారు. దటీజ్ బాబు మార్కు రాజనీతిజ్ఞత!
 
సుప్రీం ఉత్తర్వులిస్తేనే తీర్పు అమల్లోకి...
బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై చంద్రబాబు స్పందించిన తీరు కూడా విచిత్రమే. ట్రిబ్యునల్ తీర్పు వెంటనే అమల్లోకి రాకుండా సుప్రీంలో రాష్ర్టం గతంలోనే ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది. అంటే ఈ తీర్పు గెజిట్‌లో ప్రచురితమై ఆచరణలోకి రావాలంటే సుప్రీంకోర్డు ఉత్తర్వులను జారీ చేయాలి. ఈ విషయం తెలిసి కూడా కేవలం ప్రచారం కోసం చంద్రబాబు రాష్ర్టపతి ని కలిసి తీర్పు అమల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలనడం విడ్డూరం.
 
బాబు చక్రం తిప్పినప్పుడే కర్ణాటకకు ఎక్కువ నిధులు!
తెలుగుదేశం పదేళ్ళ పాలన (1995-2004)లో నీటిపారుదల మీద పెట్టిన ఖర్చు రూ.10,663 కోట్లు. అదే పదేళ్ళలో కర్ణాటక ప్రభుత్వం నీటి పారుదలకు పెట్టిన ఖర్చు రూ.19,391 కోట్లు. అంటే దాదాపు రెట్టింపు. ఏఐబీపీ అనేది చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పుతున్న 1996లో ఏర్పడింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే ఆయకట్టు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పథకం కింద అత్యధిక మొత్తంలో నిధులు చంద్రబాబు సీఎంగా ఉన్న తొమ్మిదేళ్ళలోనే కర్ణాటకకు అందాయి. ఈ పథకం ప్రారంభమైన 1996 నుంచి చంద్రబాబు సీఎంగా ఉన్న చివరి సంవత్సరం 2004 వరకు ఎనిమిదేళ్ళలో కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అందినది కేవలం రూ.867 కోట్లు. అదే కాలంలో కర్ణాటక ఏకంగా రూ.1954 కోట్లు దక్కించుకుంది.
 
వైఎస్ హయూంలో సాగునీటికి 4 రెట్లు ఎక్కువగా నిధులు
  • కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరవాత, వైఎస్ ప్రభుత్వం 2004-09 మధ్య సాగునీటి మీద చేసిన వ్యయం ఏకంగా రూ.44,530 కోట్లు. అంటే తెలుగుదేశం ప్రభుత్వం పదేళ్ళలో పెట్టిన ఖర్చుకంటే, వైఎస్ ప్రభుత్వం అయిదేళ్లలో చేసిన వ్యయం నాలుగు రెట్లు ఎక్కువ.ఇదే కాలంలో కర్ణాటక ఇరిగేషన్ మీద పెట్టిన ఖర్చు రూ.17,604  కోట్లు మాత్రమే. అంటే వైఎస్ ప్రభుత్వం కర్ణాటకతో పోలిస్తే దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ ఖర్చు చేసిందన్నమాట.
  •  
  • కర్ణాటక 1994-99 మధ్య అయిదేళ్లలో నీటిపారుదల కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని... వైఎస్ ప్రభుత్వం ఒక్క 2005-06 ఆర్థిక సంవత్సరంలోనే అంటే ఒక్క ఏడాదిలోనే ఖర్చు చేసింది. కర్ణాటక 1999-2004 మధ్య అయిదేళ్లలో ఇరిగేషన్‌మీద ఎంత ఖర్చు చేసిందో 2006-07 సంవత్సరంలోనే వైఎస్ ప్రభుత్వం అంత డబ్బును ప్రాజెక్టుల నిర్మాణం, నీటిపారుదల మీద వెచ్చించింది.

హైదరాబాద్ ఫేస్‌వాల్యూ పెంచి, ఫేస్‌బుక్‌లో ఎక్కించాను

హ్యూమరం: కోతల రాయుడు
 ‘రింజిం రింజిం హైదరాబాద్’ అని పాడుకుంటూ సైకిలెక్కి బయలుదేరాడు చంద్రబాబు. ఆయన వెంట టీవీలవాళ్లు పరిగెత్తారు.
 ‘‘డెవలప్‌మెంట్, అసైన్‌మెంట్, అగ్రిమెంట్, కంటోన్మెంట్, గవర్నమెంట్’’ అన్నాడు బాబు.
 ‘‘వామ్మో, ఇంత ఇంగ్లీషా?’’ అని ఆశ్చర్యపోయారు విలేకరులు.
 ‘‘ట్రీట్‌మెంట్, టెంపర్‌మెంట్, పిప్పర్‌మెంట్, కామెంట్’’ అన్నాడు బాబు.
 ‘‘నో కామెంట్ సార్, ఇంతకూ మీరేం మాట్లాడుతున్నారు’’ అడిగారు విలేకరులు.
 ‘‘మాట్లాడ్డానికి విషయం లేనప్పుడు ఇలా ప్రాసతో మాట్లాడాలని మా గురువు చెప్పాడు.’’
 ‘‘ఎవరు సార్, ఆయన?’’
 ‘‘గురువులను నేను గుర్తుంచుకోను’’ అంటూ చార్మినార్ వద్ద సైకిల్ ఆపాడు.
 ‘‘దీన్ని చార్మినార్ అంటారు. దీన్ని దొంగలెత్తుకుపోకుండా తొమ్మిదేళ్లు నేను కాపాడాను. చార్మినార్ అంటే నాకెందుకిష్టమంటే, అందులో నార్ ఉంది. నాలో నారా ఉన్నాడు. అందుకే మేమిద్దరం నాలుగు కాలాలు నిలబడి ఉన్నాం.’’
 ‘‘వాట్ ఏ కంపారిజన్’’ అని ఆశ్చర్యపోయారు విలేకరులు.
 ‘‘రాజకీయాలకు రీజన్, సీజన్ ఉండవు. ఇటు చూడండి, సాలార్‌జంగ్ మ్యూజియమ్. ఇందులోని వస్తువులన్నీ నాయకుల ఇళ్లకు వెళ్లకుండా కాపలా ఉన్నాను’’ అంటూ అసెంబ్లీకి తీసుకెళ్లాడు.
 ‘‘ఈ గాంధీ విగ్రహాన్ని నాయకులు ఎత్తుకెళ్లి చైనావాళ్లకు అమ్మకుండా నేనే కాపాడి అసెంబ్లీ పరువును రక్షించాను. రక్షణ, భక్షణ, శిక్షణ... అన్నీ ఒక్కలాగే కనిపించినా అర్థాలు వేరు.’’
 హైటెక్ సిటీకి తీసుకెళ్లి, ‘‘బిల్డింగ్‌లు కట్టించాను, బిల్ క్లింటన్‌ను రప్పించాను, రోడ్లు వేయించాను, చెట్లు నాటించాను, కాలువలు తవ్వించాను, హైదరాబాద్ ఫేస్‌వాల్యూ పెంచి, ఫేస్‌బుక్‌లో ఎక్కించాను. టెక్నాలజీ, ఐడియాలజీ ప్రజలకు అర్థం కావు’’ అన్నాడు.
 ‘‘ఆహో ఆంధ్రభోజా! ఇన్ని పనులు మీరు చేస్తే, మరి మిమ్మల్ని ఓడించే పనిలో ప్రజలెందుకున్నారు?’’ అడిగారు విలేకరులు.
 ‘‘డిఫీట్, రిపీట్, సర్కస్ ఫీట్, ప్రాఫిట్. జనం నాడి అర్థంకాక, ఆస్ట్రాలజీని నమ్ముకుంటున్నాను’’ అని చిలక జ్యోతిష్కుని పిలిచాడు.
 చంద్రబాబుని చూసి చిలక పారిపోవడానికి ప్రయత్నించింది. అతికష్టం మీద జ్యోతిష్కుడు దాన్ని పట్టుకుని ఒక కార్డు తీయించాడు. అందులో ఇలా ఉంది.
 ‘‘మీకు వర్తమానమూ లేదు, భవిష్యత్తూ లేదు. మిగిలింది గతమే. దాని గురించే మాట్లాడుతూ ఉండండి.’’
 -   జి.ఆర్.మహర్షి

http://www.sakshi.com/news/funday/comedy-satire-on-chandra-babu-naidu-84725?pfrom=home-top-story

బాబు పాపం.. రాష్ట్రానికి శాపం!

బాబు పాపం.. రాష్ట్రానికి శాపం!
  •  ఆనాడే ప్రాజెక్టులు నిర్మించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు
  •   ఆ ప్రాజెక్టులన్నింటికీ నేడు ట్రిబ్యునల్ నీటిని కేటాయించేది
  •   కానీ బాబు తొమ్మిదేళ్ల పాలనలో  ప్రాజెక్టులను పట్టించుకోలేదు
  •   పైగా ఆయన హయాంలోనే ఎగువ రాష్ట్రాల్లో ఆలవుట్టి వంటి మెగా ప్రాజెక్టుల నిర్మాణం
  •   ఇవన్నీ విస్మరించి వైఎస్‌పై దుష్ర్పచారం
 
 సాక్షి, హైదరాబాద్: గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రాజెక్టుల నిర్మాణంపై అనుసరించిన వైఖరే ఇప్పుడు రాష్ట్రానికి పెనుశాపంగా మారింది! ఒకవైపు బచావత్ ట్రిబ్యునల్ తీర్పు గడువు సమీపిస్తున్నా అప్పటి సీఎం చంద్రబాబు మిన్నకుండిపోయారు. ప్రాజెక్టులకు డబ్బుల్లేవంటూ చేతులు ముడుచుకొని కూర్చోవద్దని, వాటిని పూర్తిచేయుకపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వైఎస్ అనేకమార్లు చెప్పారు. చరిత్రహీనుడిగా మిగిలిపోవద్దని హెచ్చరించారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం ఖాతరు చేయులేదు. తీరా వైఎస్ వుుఖ్యవుంత్రి అయ్యాక పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయుటానికి నడుంబిగించారు. వుహారాష్ట్ర, కర్ణాటక ఇందుకు అభ్యంతరం తెలిపాయి. కొత్త ట్రిబ్యునల్ ఎదుట ఆ ప్రాజెక్టుల నిర్మాణాలు ఆపేరుుంచాలని పట్టుబట్టారుు. 
 
 అప్పుడు మిగులు జలాలపై ఆధారపడిన ప్రాజెక్టులకు మేం ఎలాంటి హక్కులు కోరబోవునీ, ఎలాగూ మిగులు జలాలపై వూకు స్వేచ్ఛ ఉంది కాబట్టి వాటిపై ఆధారపడే నిర్మించుకుంటావునీ వైఎస్ ప్రభుత్వం ఒక లేఖ ఇచ్చింది. ఆ తర్వాతే ఆ ప్రాజెక్టుల ప్రగతి సాధ్యమైంది. లేకపోతే వాటిని ఆరంభించడమే సాధ్యం కాకపోయేది. నాడు బాబు ప్రభుత్వం ప్రదర్శించిన అలసత్వం కారణంగా నేడు ఈ పరిస్థితి నెలకొంది. ట్రిబ్యునల్ ఏర్పడే నాటికే ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తి కావడమో లేక.. నిర్మాణాలు చివరి దశలో ఉండి ఉంటే.. ఇప్పుడు ఈ నష్టం జరిగేది కాదు. ప్రాజెక్టులు ఉన్నందున నీటి కేటాయింపులు వచ్చేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర ఇలాగే ప్రయోజనం పొందాయి. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో తప్పిదాలు ఇంకా రాష్ట్రాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ట్రిబ్యునల్ తీర్పు కూడా అందులో ఒక భాగం!
 
 బాబు హయాంలోనే బాబ్లీ..
 రాష్ట్రంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు చంద్రబాబు హయాంలోనే రూపు దిద్దుకుంది. పైగా టీడీపీ ముఖ్యనేతకు చెందిన సంస్థే దాన్ని నిర్మించింది. నిర్మాణం పూర్తయ్యాక ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఈ ప్రాజెక్టును అనుమతిస్తూ తీర్పు వెల్లడించింది. అలాగే ఎగువ కృష్ణాలో కర్ణాటక నిర్మించిన ఆలమట్టిని కూడా బాబు హయాంలోనే పూర్తయింది. దాంతో ఈ ప్రాజెక్టుకు నీటి  కోటాను పెంచుతూ ప్రస్తుత ట్రిబ్యునల్ తీర్పును వెల్లడించింది.
 
 ఆనాడే నిర్మించి ఉంటే...
 ప్రస్తుత బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ 2004 ఏప్రిల్ 2న ఏర్పాటైంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ వైఎస్ సీఎం అయిన తర్వాత చేపట్టినవే. జలయజ్ఞం కింద మొత్తం 86 ప్రాజెక్టులను చేపట్టారు. ఇందులో ఆయన హయాంలోనే 12 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మరో 21 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీరందించారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగానే కల్వకుర్తి, నెట్టెంపాడు, గాలేరు-నగరి,  హంద్రీనీవా, వెలిగొండ, ఏఎమ్మార్పీ వంటి ప్రాజెక్టులను చేపట్టారు.
ఇవి ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ప్రజల నుంచి డిమాండ్ ఉంది. వీటిలో కొన్ని ఎన్టీఆర్, చంద్రబాబు కూడా శంకుస్థాపన చేసినవి ఉన్నాయి. అయితే వాటిని నిర్మించడంలో విఫలమయ్యారు. వైఎస్ వచ్చిన తర్వాత వాటికి మోక్షం కలిగింది. గతంలోనే ఈ ప్రాజెక్టులను నిర్మించి ఉంటే.. నేడు ట్రిబ్యునల్ వీటికి నీటి కేటాయింపులను చేసేది. సాధారణంగా ట్రిబ్యున ల్ ఏర్పాటు కంటే ముందే పూర్తయిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను చేయడం ఆనవాయితీ. దాంతో రాష్ట్రానికి ఎంతో మేలు జరిగేది. 
 
 అయితే ట్రిబ్యునల్ మొదలైన తర్వాత వీటిని చేపట్టినందున ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర అభ్యంతరం చెప్పాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణాలను నిలుపుదల చేయించాల్సిందిగా ట్రిబ్యునల్‌పై ఒత్తిడి తీసుకువచ్చాయి. దాంతో ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయడానికి వీలుగా ప్రభుత్వం వీటికి నికర జలాలను కోరబోమనే అఫిడవిట్‌ను దాఖలు చేసింది. వీటిని మిగులు జలాల ఆధారంగానే చేపట్టినందున, వరద నీటిని ఉపయోగించుకుంటామని చెప్పింది. ఇలా కాకుండా గతంలోనే ఈ ప్రాజెక్టులు పూర్తయినట్టయితే.. నేడు ట్రిబ్యునల్ వాటికీ నీటికి కేటాయించడానికి అవకాశం ఉండేది. 
 
 నికర జలాలంటే...
  •  కృష్ణా బేసిన్‌లో 47 సంవత్సరాల ప్రవాహాల్లో 65 శాతం నీటి లభ్యతను ఆధారంగా చేసుకొని.. బేసిన్‌లో ఏటా అందులోబాటులోకి వచ్చే జలాల పరిమాణాన్ని లెక్కిస్తారు. అవే నికర జలాలు.
  •  మిగులు జలాలు: నదీ పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురిసినప్పుడు.. సాధారణం కంటే అధిక పరిమాణంలో లభ్యమయ్యే నీటినే మిగులు జలాలు అంటారు.
  •  వరద జలాలు: వరదల సమయంలో నదిలో అధికంగా (నికర, మిగులు జలాలకు మించి) ప్రవహించే నీరు.
  •  డిపెండబిలిటీ అంటే..?: 75 శాతం డిపెండబిలిటీ అంటే.. వందేళ్లలో 75 సంవత్సరాల్లో వచ్చిన నీటి ప్రవాహం సరాసరి.
http://www.sakshi.com/news/andhra-pradesh/chandrababu-naidu-is-the-reason-for-the-krishna-water-tribunal-verdict-84540?pfrom=home-latest-story