విజయవాడ :
జిల్లాను వేదికగా చేసుకున్న చంద్రబాబు మరో హైడ్రామాకు తెరలేపారు. తన హయాంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు కృష్ణా జలాల కోసం ఆందోళన చేయడంపై రైతులు మండిపడుతున్నారు. తప్పు చేసి ఒప్పుకోని చంద్రబాబు ఉనికికోసం పడుతున్న ఆరాటంలో భాగంగానే బుధవారం నగరంలో ఉద్యమం చేపడుతున్నారని రైతులు విమర్శిస్తున్నారు. వ్యవసాయం దండగ.. దానికి సబ్సిడీలు, పెట్టుబడులు అనవసరం.. రైతులు ఇతర రంగాలకు తరలిపోవాలంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. బాబు హయాంలో జిల్లాలో రైతులు సాగునీటికి కటకటలాడాల్సిన దుస్థితి దాపురించింది. ఎంతసేపు హైటెక్ ముఖ్యమంత్రిగా కీర్తించుకున్న ఆయన దేశానికి పట్టెడన్నం పెట్టే అన్నదాతల అవస్థలు పట్టించుకోలేదన్న విమర్శలను మూటగట్టుకున్నారు.
బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో కృష్ణా జలాల విషయం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఇదే అదనుగా బాబు సరికొత్త వ్యూహాలకు పదునుపెట్టి మరోమారు విమర్శలపాలవుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డారు. ఇప్పుడు కృష్ణా జలాల విషయమై ఆందోళనకు దిగి సమైక్యవాదులను దారిమళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన.. నీటి రాజకీయానికి రంగులద్ది తన లోపాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేయడంతో రైతులు విమర్శిస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ప్రాజెక్టులు నిర్మించి ఉంటే మిగులు జలాలపై మనకు కూడా హక్కు, సాగుకు భరోసా ఉండేదని రైతులు చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను కూడా బాబు తుంగలో తొక్కేయడం విమర్శలకు తావిస్తోంది. పులిచింతల ప్రాజెక్టుకు ఎన్టీఆర్ శంకుస్థాపన చేయగా.. చంద్రబాబు దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దీంతో వైఎస్ జలయజ్ఞంతో నిర్మాణం చేపట్టిన సంగతిని రైతులు గుర్తుచేస్తున్నారు.
బాబు హయాంలో సాగునీటి సమస్య..
జిల్లాకు చంద్రబాబు పాలనలోనే సాగునీటి విడుదలలో తీవ్ర జాప్యం జరిగింది. ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్సార్‌లు సైతం జిల్లాకు సాగునీటిని సకాలంలో అందించి రైతాంగానికి మేలు చేశారు. నాగార్జునసాగర్‌లో డెడ్‌స్టోరేజ్ ఉన్న సమయంలోనూ అనుకున్న సమయానికే నీరిచ్చిన ఘనత వారికి దక్కింది. బాబు చివరికి సకాలంలో నీరివ్వకుండా చేసి రైతులు సాగుపై ఆశ వదులకునేలా వ్యవహరించారన్న విమర్శలున్నాయి.
సాగు నీరడిగితే.. ఎమ్మెల్యే సీటెందుకు ఇవ్వాలన్నారు..
వ్యవసాయ రంగంపై ఆధారపడిన జిల్లాలో పలువురు ప్రజాప్రతినిధులు సైతం వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినవారే. వారు సాగు నీరివ్వాలని అడిగినందుకు తరువాతి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వాలంటూ ఇబ్బందులు పెట్టిన ఘనచరిత్ర బాబుకు ఉంది. 2003లో సెప్టెంబర్ 15 వరకు సాగు నీరివ్వకపోవడంతో రైతులు పెద్దఎత్తున ఉద్యమించారు. శివారు ప్రాంతంగా ఉన్న కృష్ణా డెల్టాను కాదని మహబూబ్‌నగర్‌లోని జూరాలకు సాగునీరిచ్చిన అప్పటి టీడీపీ ప్రభుత్వం విమర్శలపాలైంది. అప్పట్లో రైతు నాయకులు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, ఎర్నేని నాగేంద్రనాథ్ తదితర ముఖ్యులతోపాటు అప్పటి ఎమ్మెల్యే సీతాదేవి సైతం సాగునీటికోసం సాగిన ఉద్యమంలో పాల్గొన్నారు. సుమారు 10 వేల మందికిపైగా రైతులతో సాగిన అతిపెద్ద ఉద్యమంలో పాల్గొన్న టీడీపీకి చెందిన సీతాదేవి సాగునీరిచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న బాబు 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ల పంపిణీలో చివరి నిమిషం వరకు టెన్షన్ పెట్టి సీతాదేవికి ముదినేపల్లి సీటిచ్చారు. సాగునీటి కోసం రైతుల పక్షాన పోరాడిన పలువురు తెలుగుదేశం నాయకులపై కూడా బాబు ఆగ్రహించారని రైతు నాయకులు ఇప్పటికీ చెబుతారు. సాగు నీటి విడుదల ఆలస్యం చేయడం అనే పద్ధతిని బాబు కాలం నుంచే మొదలైందని రైతులు వాపోతున్నారు.
ఎన్టీఆర్ స్ఫూర్తి ఏదీ..
నందమూరి తారక రామారావు పురిటిగడ్డ కృష్ణా జిల్లా విషయంలో చంద్రబాబు ఎప్పుడూ నిర్లక్ష్యంగానే వ్యవహరించారని ఎన్టీఆర్ అభిమానులు వాపోతుంటారు. శివారు ప్రాంతంగా ఉన్న ఈ జిల్లా ముంపు బారిన పడకుండా 1984లో ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన డ్రైనేజీ బోర్డు తగు చర్యలు తీసుకునేది. ఈ బోర్డును రద్దుచేసిన బాబు నీటి వినియోగదారుల సంఘాలను ఏర్పాటుచేశారు. నీటి పంపిణీ విషయంలో వినియోగదారుల సంఘాలు ఎలా ఉన్నా, డ్రైనేజీ బోర్డు రద్దుతో మురుగు డ్రైన్లు ప్రక్షాళనకు నోచుకోక ముంపు సమస్య ఎక్కువైంది. ఇలా ఎన్టీఆర్ చేపట్టిన అనే సాగునీటి సంస్కరణలపై బాబు నీళ్లు చల్లారు. చివరకు జిల్లా రైతాంగానికి మద్దతు ధర సాధించడంలోను బాబు విఫలమయ్యారు. చంద్రబాబు హయాంలో కేంద్ర ప్రభుత్వం ధాన్యం మద్దతు ధర క్వింటాలుకు రూ.60 (12శాతం) పెంచితే, అదే వైఎస్ కాలంలో రూ.550 నుంచి రూ. 1000 (82) శాతానికి పెంచింది. ఇలా చెప్పుకుంటే బాబు వ్యవసాయ రంగానికి జల వనరులను అందించడంలో పూర్తిగా విఫలమయ్యారు. మరి ఇప్పుడు ఆయన చేపట్టే దీక్షను రైతులు ఎలా నమ్ముతారన్నది చంద్రబాబుకే ఎరుక
http://www.sakshi.com/news/andhra-pradesh/chandra-babu-naidu-playing-cheap-politics-85600

+ comments + 1 comments
రూపాయలో తొంబై తొమ్మది పైసలు అక్రమంగా సొంతానికి ఆస్తులు కొనుకొంటు తినేసి ,సమాజ అబివృద్ది కి వక పైసా కర్చు పెట్టే జగన్ మోహన్ రెడ్డి గారి వై .ఎస్ .అర్ పార్టీ మరియు బాగా డబ్బులు సంపాయించాలి అని ఆకలి తో వున్నా కెసిఆర్ తెలంగాణా పార్టీ తో జాగ్రత్త గా వుండండి .
మార్పు జనం తోటే సాద్యం(powrudu.blogspot.com)
ఎంచే లంచేలుగా సమాజం లో మార్పు జనం మంచి ఆలోచన ,నడవడిక మూలం గానే వస్తుంది .
బయం వద్దు , అందరు కలసి కట్టుగా చెడును విబేదించండి.ఎంతె మందిని బెదిరిస్తారు, వక్కడిని బేదిరించగలరు ,వంద మందిని బెదిరించాగలరా .
పౌరిడిగా వక చిన్న ప్రయత్నం
ఈ బ్లాగ్ ని చదవండి .మీ రచనలు ఈ ఫోరం లో ముద్రించండి .
దయచేసి ఈ బ్లాగు ని మీ సైట్ కి జతచేయండి
Post a Comment