మీకు ఓ పాత సంగతి గుర్తు చేయాలి. ఎన్నికల్లో ఓట్లు వేయడానికి బ్యాలెట్ పేపర్ల స్థానే మెషిన్లను ప్రవేశపెట్టిన తొలి సందర్భంలో రాష్ట్రంలోని మెజారిటీ సామాన్య జనులు ‘ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు గెలిచి తీరుతాడని’ పల్లెలో రచ్చబండల దగ్గర కూడా పందేలు వేసుకున్నారు. ఓటు అనేది ‘మనం కాగితం మీద వేయకుండా.. మెషిన్లో వేస్తే.. ఆ మెషిన్లు.. వాటికి తగిలించే కంప్యూటర్లు కచ్చితంగా చంద్రబాబు మాట మాత్రమే వింటా’యని ప్రజలకు ఓ తీవ్రమైన నమ్మకం ఉండేది. చంద్రబాబు మీద అనుమానం, ద్వేషం, వ్యతిరేకత వలన వచ్చిన మాట కాదది.. టెక్నాలజీ అంటేనే దాన్ని తనకు అనుకూలంగా వాడుకోవడంలో చంద్రబాబును మించిన వాడు లేడనేది.. ఆ ప్రజల నమ్మకంగా ఉండేది. కానీ పాపం ఆ ఎన్నికల్లో చంద్రబాబు బ్యాలెట్ బాక్స్ ముందు బోల్తా పడ్డారు.
ఒకసారి బోల్తా కొట్టినంత మాత్రాన చంద్రబాబు టెక్నాలజీలో వెనుకబడిన నాయకుడనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఆయన ఎన్నటికీ టెక్నాలజీ ప్రియుడు. ఇవాళ్టికి కూడా సైబర్ టవర్స్ భవనాన్ని చూసుకుని.. తాను తీసుకువచ్చిన ఐటీ పరిశ్రమకు ఇది సంకేతం అని ఆయన మురిసిపోతూ ఉంటారు. సదరు టెక్నాలజీ ప్రియత్వం అనేది ఆయన ఇప్పటికీ నిరూపించుకుంటూనే ఉన్నారు. రాజకీయంగా మంచిరోజులు ఇంకా రాలేదు గానీ.. టెక్నాలజీని ఔపోసన పట్టి.. సద్వినియోగం చేసుకోవడం మాత్రం.. చంద్రబాబుకు చేతనైనంతగా మరెవ్వరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. చిన్న ఉదాహరణ చూస్తే.. ఇవాళ్టి మన రాష్ట్రంలోని అగ్రశ్రేణికి చెందిన రాజకీయ నాయకుల్లో ఫేస్‌బుక్, ట్విటర్ ల ద్వారా.. తన అభిప్రాయాలను ప్రపంచంతో పంచుకోవడంలో.. చంద్రబాబు అందరి కంటె అగ్రశ్రేణిలో ఉంటారన్నది కూడా నిజం.
మతలబు : చంద్రబాబు సాంకేతిక రుబాబు!
చంద్రబాబుకు ఉన్న ఎడ్వాంటేజీ ఏంటంటే.. కొడుకు కూడా అంతో ఇంతో టెక్ కిడ్ కావడం. సాఫ్ట్‌వేర్ పరిశ్రమలోకి కాలిడిన ఒక తరం, ఒక వర్గం వారు ఆయనకు ఈ విషయంలో గట్టి దన్నుగానే ఉంటున్నారు.
ఇదంతా పాజిటివ్ ఎండ్. చంద్రబాబు సాంకేతిక ప్రియత్వంలో మరో రుబాబు కూడా దాగి ఉంది. నెటిజన్లు, టీవీ ఛానెళ్లు, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారా.. జనంలోకి తన అభిప్రాయాలను తీసుకువెళ్లడంలో మాత్రం చంద్రబాబు ముందంజలో ఉన్నారు.
ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేకమైన టీంను పనిచేయిస్తూ ఉంటుందన్నది పార్టీలో కొందరు చెప్పే సంగతి. వీరంతా పార్టీ తరఫు ఉద్యోగులు. తెలుగుదేశం పార్టీకి అనుకూలుడు, ఆప్తుడు అయిన ఓ ఐటీ పారిశ్రామిక వేత్త.. ఈ బృందాన్ని నిర్వహిస్తుంటారు. వీరు చేయాల్సిన పనెల్లా.. నెటిజన్లలో చంద్రబాబు అనుకూల భావజాలాన్ని ప్రచారం చేస్తుండడమే. రకరకాల ఐడీలతో వివిధ వెబ్‌సైట్లు, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వీరు 24I7 అందుబాటులో ఉంటారు. నిత్యం ఎవరితోనూ ఒకరితో సంభాషిస్తూ ఉంటారు. చంద్రబాబు అనుకూల భావజాలాన్ని అదే సమయంలో జగన్, కాంగ్రెసు, తెరాస వ్యతిరేకతను వీరు ప్రచారం చేస్తూ ఉంటారు.
సాధారణంగా ఇంటర్నెట్‌లోకి వెళ్లాం అంటే.. చంద్రబాబు అనుకూల ప్రచారం చాలా విస్తృతంగా ఉంటుంది. నవతరం కుర్రకారులో ఇంతమంది తెదేపాకు అనుకూలంగా ఉన్నారా... అని మనకు అనుమానం కలుగుతూ ఉంటుంది. కానీ అందులో మతలబు ఏంటంటే.. వారంతా జీతం పుచ్చుకుని ప్రచారం చేస్తూ ఉంటారన్నమాట. సాధారణ ప్రజలేమో.. ఇదంతా తెదేపాకు నెటిజన్లలో ఉన్న క్రేజ్ కింద భ్రమ పడుతూ ఉంటారు.
అందులోనూ చాలా చిన్నెలున్నాయ్...
తెలుగుదేశం తరఫున ఇలాంటి ప్రత్యేక బాధ్యతలలో పనిచేస్తుండే వారు చేసే పనులు చాలానే ఉంటాయిట. అనగా ఫరెగ్జాంపులో ప్రతి ఉదయం టీవీ ఛానెళ్లలో డిస్కషన్ షోలు వస్తుంటాయి. ఆ సందర్భంగా ఎస్సెమ్మెస్ పోల్‌లను కూడా నిర్వహిస్తుంటారు. ఆ పోల్‌లు చంద్రబాబుకు సంబంధించిన అంశాల మీద ఉన్నట్లయితే గనుక.. అప్పుడు ఉంటుంది మజా! ఎలాగంటే.. పోల్ ప్రారంభం అయినప్పుడు.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎక్కువ ఓట్ శాతం నమోదు అవుతూ ఉంటుంది. అయితే.. కాసేపటికే.. ఈ తెలుగుదేశం బృందం జూలు విదిల్చి నిదుర మేల్కొంటుంది. వెంటనే వారి ఎస్సెమ్మెస్ బాణాలు వెల్లువెత్తుతాయి. పోల్ పర్సంటేజీలు మారిపోతూ వస్తాయి. జనాభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ.. వీలైనంత వరకు వాటిని ఎంచక్కా చంద్రబాబుకు అనుకూలంగా, లేదా తటస్థంగా మార్చేసేలా.. వారు ఎస్సెమ్మెస్‌లు కుమ్మేస్తుంటారన్నమాట.
మొత్తానికి చంద్రబాబు ప్రజల హృదయాల్లో ఎంత మేరకు నిశ్చలంగా ఉన్నారో లేదో మనకు తెలియదు గానీ.. నెటిజన్లలో మాత్రం.. చాలా ముమ్మరంగానే.. కీర్తి ప్రతిష్టలను గడిస్తూ ఉంటారు. అయితే అవన్నీ స్వయంకృత, స్వయం ప్రసాదిత కీర్తి, యశస్సులనే సంగతి ఆయనకు తెలుసు. జనానికి ఎప్పటికి తెలుస్తుందో మరి.
+ comments + 1 comments
రూపాయలో తొంబై తొమ్మది పైసలు అక్రమంగా సొంతానికి ఆస్తులు కొనుకొంటు తినేసి ,సమాజ అబివృద్ది కి వక పైసా కర్చు పెట్టే జగన్ మోహన్ రెడ్డి గారి వై .ఎస్ .అర్ పార్టీ మరియు బాగా డబ్బులు సంపాయించాలి అని ఆకలి తో వున్నా కెసిఆర్ తెలంగాణా పార్టీ తో జాగ్రత్త గా వుండండి .
మార్పు జనం తోటే సాద్యం(powrudu.blogspot.com)
ఎంచే లంచేలుగా సమాజం లో మార్పు జనం మంచి ఆలోచన ,నడవడిక మూలం గానే వస్తుంది .
బయం వద్దు , అందరు కలసి కట్టుగా చెడును విబేదించండి.ఎంతె మందిని బెదిరిస్తారు, వక్కడిని బేదిరించగలరు ,వంద మందిని బెదిరించాగలరా .
పౌరిడిగా వక చిన్న ప్రయత్నం
ఈ బ్లాగ్ ని చదవండి .మీ రచనలు ఈ ఫోరం లో ముద్రించండి .
దయచేసి ఈ బ్లాగు ని మీ సైట్ కి జతచేయండి
Post a Comment