ఉపాయం ఉంటే చాలు ఎంతటి అపాయాన్నయినా ఇట్టే దాటెయ్యవచ్చు.
ఈ కిటుకు చంద్రబాబుకి తెలుసు. ఆయన పగవాడికి తెలియదు.
అదే బాబుగారి అసలు అదృష్టం.
అనగా అనగా నారాబాబు, జగన్‌బాబు అని ఇద్దరు శత్రువులు. ఒకడు తెలివిగలవాడు. రెండోవాడు అది కొంచెం తక్కువైనవాడు. ఇద్దరూ ఒకరిమీద ఒకరు ఒకే రకమైన అస్త్రాన్ని గురిచూసి వదిలారు. ఒకరి ఫ్లాష్‌బ్యాకుని ఒకరు కెలికి, అర్జంటుగా సిబిఐ ఎంక్వయిరీ వేయించాల్సిందేనంటూ ఒకే హైకోర్టుకు వెళ్లారు. కోర్టువారు ఇద్దరికీ సమాన న్యాయంచేసి, ఎవరు కోరిన ఎంక్వయిరీని వారికి మంజూరు చేశారు.
దాంతో - బద్ధ విరోధులిద్దరికీ ఒకే రకమైన ఆపద వచ్చింది.
ఋషిమూలం, నదిమూలంలాగే నాయకుడి మూలాన్ని కూడా తొంగి చూడకపోవటమే మంచిది. తవ్వటం మొదలుపెడితే ఎముకలు, అస్థిపంజరాలు ఎన్ని బయట పడతాయో, ఎన్ని తిప్పలు తెచ్చిపెడతాయో ఎవరికి ఎరుక? చట్టం చూపును గతంవైపు పోనివ్వకపోవటమే నేతాశ్రీలకు క్షేమం.
సో! ఎలాగైనా సిబిఐ చెడు దృష్టి తమమీద పడకుండా చూసుకోవాలి. అది ఎలా? హైకోర్టు ఆర్డరును ఆపించాలంటే దాని పైకోర్టుకే పోవాలి అని ఎవరైనా చెబుతారు. తెలివి లేనివాడు... అందరిలాగే ఆలోచించి, అందరూ చేసే పనే చేశాడు. ఎగస్పార్టీవాళ్లు కుట్ర చేసి మమ్మల్ని సతాయించటానికే అన్యాయంగా ఎంక్వయిరీ వేయించారు, దాన్ని ఉన్నపళాన ఆపించాలి అంటూ సుప్రీంకోర్టుకు మొత్తుకున్నాడు.
తెలివిగలవాడూ అదే పనిచేశాడు. కాని నేరుగా కాదు. ఇండైరక్టుగా! తాను వెనక ఉండి, అన్నీ జాగ్రత్తగా సెట్ చేశాక, తన శంఖుచక్రాలనూ, అవరోధ వ్రాతాలనూ పంపి సుప్రీంకోర్టులో కేసు వేయించాడు. సరిగ్గా తన పగవాడి ఆర్గ్యుమెంటునే అటూ ఇటూ మార్చి వన్స్‌మోర్‌గా వినిపించాడు.
పై కోర్టువారు కూడా ఇరు పక్షాలకూ సమాన న్యాయం (లేక ‘అన్యాయం’) చేశారు! ఇక్కడికెందుకొచ్చారు, చెప్పాల్సిందేమన్నా ఉంటే కింది కోర్టుకే వెళ్లి చెప్పుకోమన్నారు. దాంతో సీను మళ్లీ హైకోర్టుకు మారింది.
తెలివి తక్కువవాడు గోడకు కొట్టిన బంతిలా హైకోర్టుకు తిరిగొచ్చి, వెనకటి బెంచ్ దగ్గరికే మళ్లీ వెళ్లి, వెనకటి రికార్డునే మళ్లీ వినిపించాడు. ప్రాథమిక విచారణని ఆపించమని అతడు వేడుకుంటే, కోర్టు వారేమో ఏకంగా పూర్తిస్థాయి విచారణకే ఆర్డరు వేసి అతగాడికి మరిన్ని చికాకులు తెచ్చిపెట్టారు. చిక్కులు చుట్టుముట్టేకొద్దీ ఆ కుర్రవాడు రెచ్చిపోయి ఎల్లో మీడియానూ, గురివింద సిండికేట్లనూ పడతిట్టిపోస్తూ, కోర్టులనూ, కుమ్మక్కులనూ ఒళ్లుమండేలా అధిక్షేపిస్తూ, అనకూడని వారి గురించి, అనకూడని సమయంలో, అనకూడనిది అంటూ, బంటుల చేత అనిపిస్తూ ఉక్రోషంతో ఆక్రోశిస్తున్నాడు.
మరి తెలివిమీరిన వాడో? అలాంటి పిచ్చి పనులు ఏమీ చెయ్యలేదు. అతడిదంతా గెరిల్లా పద్ధతి. ఒడుపుచూసి అడుగు వేస్తాడు. కీలెరిగి వాత పెడతాడు.
చంద్రబాబు మంచి పనిమంతుడు. గొప్ప రాజకీయ క్రీడాకారుడు కూడా! పొలిటికల్ కారమ్ బోర్డు మీద స్ట్రైకరును ఎటుతిప్పికొడితే ఎటో ఉన్న రెడ్డో, దాని వెనుక బడ్డో ఎలా పాకెట్లో పడతాయో ఆయనకు భలేగా తెలుసు. పైగా బాబు పంచతంత్రంలోని దీర్ఘదర్శికి చదువు చెప్పగలిగినవాడు. ఇప్పటి తన పగవాడి డాడీలాగే నాయుడు కూడా చాలా ఏళ్లు రాజ్యమేలాడు. అనే్నళ్లూ ‘ఆ రెండు పత్రికలు’, ‘ఈ మూడు ముఠాలు’ అంటూ డైలాగులు కొడుతూ కూచోలేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న పాలిసీతో ఏ క్షేత్రానికా క్షేత్రంలో పనికొచ్చే విత్తనాలను చల్లాడు. అవే ఇప్పుడు విరగపండి ఏ రంగానికారంగంలో అవసరానికి ఆదుకుంటున్నాయి.
సుప్రీంకోర్టు స్టే ఇస్తుందో లేదో సందిగ్ధం కనుక ఎందుకైనా మంచిదని తెర వెనకే ఉండి కథ నడిపించిన బాబు, హైకోర్టుకు పోవచ్చని అక్కడ సెలవయ్యేసరికి ఈలవేస్తూ ముందుకొచ్చాడు. వాటమెరిగి పావులు కదిపాడు. న్యాయరంగంలో ఆయన ముందు జాగ్రత్తతో వెలిగించిన జ్యోతులూ సమయానికి అక్కరకొచ్చి కాగలకార్యాన్ని తిరుగులేని వ్యూహం ప్రకారం తీర్చాయి.
పవిత్రమైన కేసు పడగూడని వాళ్ల చేతుల్లో పడితే కొంపలంటుకుంటాయి. పాముల నోట పడకుండా తప్పించుకుంటూ కోరిక తీర్చే పెద్దనిచ్చెనను చేరుకుంటేగానీ జాక్‌పాట్ తగలదు. దానికి అదృష్టాన్ని నమ్ముకుని లాభం లేదు. ప్రణాళిక వెయ్యాలి. పాచిక విసరాలి. తెలుగుదేశం కన్న తండ్రి మీదే కోర్టుకెక్కి పార్టీ, జండా, గుర్తు, ఆస్తులు అన్నీ తనవేనని ‘జయప్రదంగా’ అనిపించుకోగలిగిన కౌటిల్యుడికి ఆఫ్టరాల్ ఒక ఎంక్వయిరీ ఉత్తర్వును ఎత్తివేయించటం ఒక లెక్కా?
భారతంలో కృష్ణుడు భీష్ముడి దగ్గరికే ధర్మరాజును పంపించి, తమరిచేత అస్తస్రన్యాసం చేయించటం ఎలా అని కూపీలాగించాడు. బాబు అండ్ కో అంతకంటే ఘనులు. ఏ ‘నాట్ బిఫోర్’ శిఖండిని అడ్డంపెడితే ఏ బెంచి చేతులెత్తేస్తుందో ముందే గ్రహించి, ఆయా శిఖండులను ఆయా సమయాలకు రెడీచేసి, అనుమానపు బెంచిలను పక్కకు తప్పించి, ప్రాప్తమున్న తీరానికి కేసు పడవను ఝామ్మంటూ లాక్కుపోయారు. మొత్తానికి కార్యం సాధించారు.
మీరు ఫలానా కేసులో ఎగస్పార్టీకి మేలు చేశారు. కాబట్టి ఈ కేసులోనూ మాకు కీడే చేస్తారు. మాకు నమ్మకం లేదు కాబట్టి మీరు కేసు తీసుకోకండి - అంటూ ఆ బాలుడు అడ్డదిడ్డంగా వాదిస్తూ తీరికూర్చుని జడ్జిలకు ఒళ్లు మండిస్తూంటే - ఈ గోపాలుడు న్యాయవ్యవస్థలోని ఉత్తమ సంప్రదాయాన్ని అడ్డంగా వాడుకుని, కులదైవాల అండతో, బంటు మీడియా వెంట్రిలాక్విజంతో కోరిన వరాన్ని సైలంటుగా కొట్టేశాడు. విరోధిమీద సిబిఐ ఎంక్వయిరీ పడితే, ‘స్టే’కెందుకు రంధి, విచారణకు నిలబడి నిజాయతీ నిరూపించుకోరాదా’ అని సవాలు విసిరిన బాబు అలాంటి ఎంక్వయిరీయే తన మీద పడేసరికి మిన్ను, మన్ను ఏకం చేసి, పద్మవ్యూహం పన్ని, ఎలాగైతేనేం అబేయన్సు అభయం పొందాడు.
దటీజ్ బాబు! అందుకే జగనబ్బాయ్! నీ ఆటలు ‘నాట్ బిఫోర్’ బాబు!

+ comments + 1 comments
రూపాయలో తొంబై తొమ్మది పైసలు అక్రమంగా సొంతానికి ఆస్తులు కొనుకొంటు తినేసి ,సమాజ అబివృద్ది కి వక పైసా కర్చు పెట్టే జగన్ మోహన్ రెడ్డి గారి వై .ఎస్ .అర్ పార్టీ మరియు బాగా డబ్బులు సంపాయించాలి అని ఆకలి తో వున్నా కెసిఆర్ తెలంగాణా పార్టీ తో జాగ్రత్త గా వుండండి .
మార్పు జనం తోటే సాద్యం(powrudu.blogspot.com)
ఎంచే లంచేలుగా సమాజం లో మార్పు జనం మంచి ఆలోచన ,నడవడిక మూలం గానే వస్తుంది .
బయం వద్దు , అందరు కలసి కట్టుగా చెడును విబేదించండి.ఎంతె మందిని బెదిరిస్తారు, వక్కడిని బేదిరించగలరు ,వంద మందిని బెదిరించాగలరా .
పౌరిడిగా వక చిన్న ప్రయత్నం
ఈ బ్లాగ్ ని చదవండి .మీ రచనలు ఈ ఫోరం లో ముద్రించండి .
దయచేసి ఈ బ్లాగు ని మీ సైట్ కి జతచేయండి
Post a Comment