హైదరాబాద్: ‘ఒకరోజు ఓ జడ్జి నా దగ్గరికి వచ్చి కంట నీరు పెట్టుకున్నాడు. తెలుగుదేశం పార్టీ ఎన్‌టీఆర్‌దేనని ఇంటికొచ్చి జడ్జిమెంటు రాయించుకున్నారని, అంతకంతా తాను అనుభవిస్తున్నట్లుగా చెప్పి ఏడ్చాడు. నేను పెట్టిన తెలుగుదేశం పార్టీ ఎన్‌టీఆర్‌దని తీర్పు చెప్పినందుకు 1985 మధ్యంతర ఎన్నికల్లో ఆ జడ్జికి ఎమ్మెల్యే టిక్కెట్టు, మంత్రి పదవి ఇచ్చి మాజీ సీఎం జలగం వెంగళరావు ఇంటి ముందు నివాసం పెట్టించారు’ అంటూ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను పెట్టిన పార్టీకి ఇప్పుడు అధినేతగా ఉన్న చంద్రబాబు తనపై మతిలేని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏనాడూ సత్యం చెప్పకుండా పాపిష్టి పనులు చేయడంలో చంద్రబాబును మించినవారు లేరని విమర్శించారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాస్కరరావు మాట్లాడారు. ఇటీవల చంద్రబాబు స్పీకర్ నాదెండ్ల మనోహర్, తనపై చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ... ‘ స్పీకర్ రాజ్యాంగ బద్ధుడు. రాష్ట్రపతి, గవర్నర్ తరహాలో స్పీకర్ కూడా రాజకీయాలతో సంబంధం లేకుండా పనిచేస్తారు. రాష్ట్రపతి పంపిన నోట్‌ను స్పీకర్‌గా అసెంబ్లీలో ప్రవేశపెట్టడం ఆయన విధి. అసలు ఆర్టికల్ 365 గురించి నీకు తెలుసా? రాష్ట్రంలో పీవీ నరసింహారావు ప్రభుత్వంపై మాత్రమే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ఆర్టికల్‌ను ఉపయోగించారు’ అని చెప్పారు.
రాష్ట్ర విభజనకు సంబంధించి చంద్రబాబు సమన్యాయం అంటున్నాడని.. సమన్యాయం అంటే కృష్ణా నదిని ఆ పక్కనుంచి ఈ పక్కకు రెండుగా చీల్చి సమంగా పంచుతారా? అని ప్రశ్నించారు.
http://www.sakshi.com/news/andhra-pradesh/nadendla-bhaskara-rao-blames-chandrababu-naidu-for-division-89916?pfrom=home-latest-story
+ comments + 1 comments
రూపాయలో తొంబై తొమ్మది పైసలు అక్రమంగా సొంతానికి ఆస్తులు కొనుకొంటు తినేసి ,సమాజ అబివృద్ది కి వక పైసా కర్చు పెట్టే జగన్ మోహన్ రెడ్డి గారి వై .ఎస్ .అర్ పార్టీ మరియు బాగా డబ్బులు సంపాయించాలి అని ఆకలి తో వున్నా కెసిఆర్ తెలంగాణా పార్టీ తో జాగ్రత్త గా వుండండి .
మార్పు జనం తోటే సాద్యం(powrudu.blogspot.com)
ఎంచే లంచేలుగా సమాజం లో మార్పు జనం మంచి ఆలోచన ,నడవడిక మూలం గానే వస్తుంది .
బయం వద్దు , అందరు కలసి కట్టుగా చెడును విబేదించండి.ఎంతె మందిని బెదిరిస్తారు, వక్కడిని బేదిరించగలరు ,వంద మందిని బెదిరించాగలరా .
పౌరిడిగా వక చిన్న ప్రయత్నం
ఈ బ్లాగ్ ని చదవండి .మీ రచనలు ఈ ఫోరం లో ముద్రించండి .
దయచేసి ఈ బ్లాగు ని మీ సైట్ కి జతచేయండి
Post a Comment