Home » , , , » చంద్రబాబుకు నిలకడైన సిద్ధాంతం లేదు.. ఆనాడు మోడీని తిట్టి ఇప్పుడు పొత్తెలా పెట్టుకుంటారు?

చంద్రబాబుకు నిలకడైన సిద్ధాంతం లేదు.. ఆనాడు మోడీని తిట్టి ఇప్పుడు పొత్తెలా పెట్టుకుంటారు?


బాబుది అధికార దాహం: పి.మధు
సీపీఎం ఏపీ కార్యదర్శి పి.మధు ధ్వజం
చంద్రబాబుకు నిలకడైన సిద్ధాంతం లేదు.. ఆనాడు మోడీని తిట్టి ఇప్పుడు పొత్తెలా పెట్టుకుంటారు?


సాక్షి, హైదరాబాద్:
టీడీపీ అధినేత చంద్రబాబు అధికార దాహంతో అల్లాడుతున్నారని సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పి.మధు ధ్వజమెత్తారు. బాబుకు నిలకడైన సిద్ధాంతం లేదన్నారు. ఆయన సోమవారమిక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. గోద్రా సంఘటన అనంతరం నరేంద్రమోడీని తిట్టి, ఆయన పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు పొత్తుకు వెంపర్లాడుతున్నారని అన్నారు. బీజేపీ ఉంటే తప్ప మనుగడ లేదన్న భావన చంద్రబాబులోనే ఉంటే సామాన్య కార్యకర్తలకు ఏం భరోసా కల్పిస్తారని ప్రశ్నించారు. మునిగిపోతున్న టీడీపీ గడ్డిపోచను పట్టుకుని బయటపడాలని చూస్తోందని చమత్కరించారు. చంద్రబాబు రోడ్ షోల పేరుతో జనసమీకరణ చేసినా, సాధారణ ప్రజల్లో ఏమాత్రం విశ్వసనీయత కల్పించలేకపోతున్నారని చెప్పారు.  అన్ని పదవులూ అనుభవించిన జేసీ దివాకర్‌రెడ్డి, పురందేశ్వరీ, రాయపాటి వంటి వారు మళ్లీ పదవుల కోసం పార్టీ ఫిరాయించడం దేనికి సంకేతమని  ప్రశ్నించారు.

 కాంగ్రెస్‌ను వదలాలని సీపీఐకి సలహా
  కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని సీపీఐ ఎవర్ని ఓడించాలని చూస్తోందని మండిపడ్డారు. ‘కాంగ్రెస్, బీజేపీలను ఓడించాలన్నది వామపక్షాల విధానం. దాన్ని పక్కన బెట్టినప్పుడు కాంగ్రెస్‌తోనే ఎందుకు? బీజేపీతో కూడా పొత్తు పెట్టుకోవచ్చు. ఆ పార్టీ కూడా తెలంగాణ కోసం పోరాడినదే గదా! ఈ రెండూ కార్పొరేట్లకు ఊడిగం చేయడానికైనా సిద్ధమంటున్నాయి. ఈ విషయాలన్నీ ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్న వారికి  తెలియదా? ఇది మౌలిక సిద్ధాంతంతో రాజీ పడటం, రాజ కీయ దివాళాకోరుతనమే’ అని అన్నారు.

 వైఎస్సార్‌సీపీపై మైనారిటీల ఆశలు
 బీజేపీ, టీడీపీల వైఖరితో విసిగిన ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. వైఎస్ కుమారుడైన జగన్ వారికి రక్షణగా ఉంటారని భావిస్తున్నారని తెలిపారు.
Share this article :

+ comments + 1 comments

Anonymous
13 April 2014 at 14:36

రూపాయలో తొంబై తొమ్మది పైసలు అక్రమంగా సొంతానికి ఆస్తులు కొనుకొంటు తినేసి ,సమాజ అబివృద్ది కి వక పైసా కర్చు పెట్టే జగన్ మోహన్ రెడ్డి గారి వై .ఎస్ .అర్ పార్టీ మరియు బాగా డబ్బులు సంపాయించాలి అని ఆకలి తో వున్నా కెసిఆర్ తెలంగాణా పార్టీ తో జాగ్రత్త గా వుండండి .

మార్పు జనం తోటే సాద్యం(powrudu.blogspot.com)


ఎంచే లంచేలుగా సమాజం లో మార్పు జనం మంచి ఆలోచన ,నడవడిక మూలం గానే వస్తుంది .
బయం వద్దు , అందరు కలసి కట్టుగా చెడును విబేదించండి.ఎంతె మందిని బెదిరిస్తారు, వక్కడిని బేదిరించగలరు ,వంద మందిని బెదిరించాగలరా .
పౌరిడిగా వక చిన్న ప్రయత్నం

ఈ బ్లాగ్ ని చదవండి .మీ రచనలు ఈ ఫోరం లో ముద్రించండి .

దయచేసి ఈ బ్లాగు ని మీ సైట్ కి జతచేయండి

Post a Comment