తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తానంటున్న చంద్రబాబు మూడు అంశాలపై స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. పోలవరం డిజైన్‌ను మార్చడానికి సిద్ధమేనా? దుమ్ముగూడెం ప్రాజెక్టు రద్దు చేయడానికి అంగీకరిస్తావా? ఉద్యోగుల విభజనలో ఎక్కడి ప్రాంతవాసులు అక్కడే వంటి విషయాలపై స్పష్టత ఇవ్వాలన్నారు.
తెలంగాణ పూర్తిస్థాయిలో అభివృద్ధి సాధించాలంటే టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి రావాలని కేసీఆర్ మరోమారు ప్రకటించారు. కొత్త నాయకత్వంలో సరికొత్త పంథాలో అభివృద్ధి జరగాలన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలను ఇప్పటికే చూశామని చెప్పారు. అవి సరిగ్గా పనిచేస్తే రైతుల ఆకలి చావులు ఎందుకు ఉంటాయి? గ ల్ఫ్ దేశాలకు వలసలెందుకు వెళతారు? అని ప్రశ్నించారు. తె లంగాణ సంపూర్ణ అభివృద్ధి కోసం సమగ్రవంతంగా మేనిఫెస్టోను రూపొందిస్తున్నామని... పేదలకు ఇళ్లు, లక్ష లోపు రైతు రుణాల రద్దు వంటి పలు విషయాలను ఇందులో పొందుపరుస్తున్నామని తెలిపారు. తెలుగువారి సంవత్సరాది ఉగాది రోజున పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వరంగల్‌లో టెక్స్‌టైల్ హబ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. పొన్నాలపై మరోసారి విరుచుకుపడ్డారు. ఆయన ఆధ్వర్యంలోనే ఆంధ్రా అక్రమ ప్రాజెక్టులకు అనుమతిని జారీ చేశారని విమర్శించారు. కార్యక్రమంలో కొండా దంపతులు తదితరులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 1న బాబుమోహన్ చేరిక: నటుడు బాబుమోహన్, ప్రముఖ పారిశ్రామిక వేత్త బీబీ పాఠిల్ ఏప్రిల్ ఒకటో తేదీన టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. మెదక్ జిల్లా జహీరాబాద్‌లో ఏర్పాటు చేసే కార్యక్రమంలో వీరు కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్టు సమాచారం. బాబుమోహన్ శనివారం కేసీఆర్‌ను కలసి పార్టీలో చేరే విషయంపై చర్చించారు.
source: సాక్షి
+ comments + 1 comments
రూపాయలో తొంబై తొమ్మది పైసలు అక్రమంగా సొంతానికి ఆస్తులు కొనుకొంటు తినేసి ,సమాజ అబివృద్ది కి వక పైసా కర్చు పెట్టే జగన్ మోహన్ రెడ్డి గారి వై .ఎస్ .అర్ పార్టీ మరియు బాగా డబ్బులు సంపాయించాలి అని ఆకలి తో వున్నా కెసిఆర్ తెలంగాణా పార్టీ తో జాగ్రత్త గా వుండండి .
మార్పు జనం తోటే సాద్యం(powrudu.blogspot.com)
ఎంచే లంచేలుగా సమాజం లో మార్పు జనం మంచి ఆలోచన ,నడవడిక మూలం గానే వస్తుంది .
బయం వద్దు , అందరు కలసి కట్టుగా చెడును విబేదించండి.ఎంతె మందిని బెదిరిస్తారు, వక్కడిని బేదిరించగలరు ,వంద మందిని బెదిరించాగలరా .
పౌరిడిగా వక చిన్న ప్రయత్నం
ఈ బ్లాగ్ ని చదవండి .మీ రచనలు ఈ ఫోరం లో ముద్రించండి .
దయచేసి ఈ బ్లాగు ని మీ సైట్ కి జతచేయండి
Post a Comment