మున్సిపల్ ఎన్నికల బరిలో 34, 35వ వార్డులకు వైఎస్సార్ సీపీ అభ్యర్థులుగా రోజారాణి, ఆయన భర్త గౌతం లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. 34వ వార్డులో టీడీపీ అభ్యర్థిగా బండి నాగరాజ పోటీలో ఉన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారానికి తెరపడింది. అయితే వైఎస్సార్ సీపీపై గెలవలేమన్న భయంతో టీ డీపీకి దిక్కు తోచలేదు. దీంతో నీరుగట్టుపల్లెకు చెందిన నాయకుల్ని రంగంలోకి దింపి జోరుగా డబ్బు, మద్యం పంపిణీ చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ పార్టీ కార్యకర్త బీ.సుబ్రమణ్యం (36)ను వెంటబెట్టుకుని 34వ వార్డుకు కారులో వెళ్లారు. టీడీపీ నాయకుడు శ్రీరాంచినబాబు, ఆయన సోదరుడు యోగేశ్వరబాబు, పెన్నార్ వెంకటేష్, శంకర్ తదితరులు కారులో ఉన్న లక్ష్మీనారాయణ, సుబ్రమణ్యంను చితకబాదారు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు అడ్డుకున్నారు. గాయపడిన వారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు అర్ధరాత్రి వేళ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిపై ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.
http://www.sakshi.com/news/elections-2014/tdp-to-midnight-anarchy-117677
+ comments + 1 comments
రూపాయలో తొంబై తొమ్మది పైసలు అక్రమంగా సొంతానికి ఆస్తులు కొనుకొంటు తినేసి ,సమాజ అబివృద్ది కి వక పైసా కర్చు పెట్టే జగన్ మోహన్ రెడ్డి గారి వై .ఎస్ .అర్ పార్టీ మరియు బాగా డబ్బులు సంపాయించాలి అని ఆకలి తో వున్నా కెసిఆర్ తెలంగాణా పార్టీ తో జాగ్రత్త గా వుండండి .
మార్పు జనం తోటే సాద్యం(powrudu.blogspot.com)
ఎంచే లంచేలుగా సమాజం లో మార్పు జనం మంచి ఆలోచన ,నడవడిక మూలం గానే వస్తుంది .
బయం వద్దు , అందరు కలసి కట్టుగా చెడును విబేదించండి.ఎంతె మందిని బెదిరిస్తారు, వక్కడిని బేదిరించగలరు ,వంద మందిని బెదిరించాగలరా .
పౌరిడిగా వక చిన్న ప్రయత్నం
ఈ బ్లాగ్ ని చదవండి .మీ రచనలు ఈ ఫోరం లో ముద్రించండి .
దయచేసి ఈ బ్లాగు ని మీ సైట్ కి జతచేయండి
Post a Comment